టాటా సుమో తిరిగి వస్తుందా? క్రేజీ లుక్ అదిరిపోయింది.. కార్ మార్కెట్ షేక్ కాబోతుందా?
టాటా మోటార్స్ (tata motots) ఇటీవల సియారా పేరును మళ్లీ తెరపైకి తీసుకురావడంతో, భారత ఆటో మార్కెట్‌లో ట్రెండ్‌కు మళ్లీ ఊపొచ్చింది. ఒకప్పుడు భారతీయ రోడ్లపై రాజ్యమేలిన పాత కార్లను ఆధునిక రూపంలో తిరిగి పరిచయం చేయాలనే టాటా వ్యూహం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. సియారా రీ-ఎంట్రీ తర్వాత, టాటా అభిమానుల మధ్య ఒక ప్రశ్న బలంగా వినిపిస్తోంది.. తర్వాత ఏ లెజెండరీ కారు తిరిగి రాబోతోంది? ఈ చర్చల మధ్యలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు టాటా సుమో. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకూ, కుటుంబ వినియోగం నుంచి కమర్షియల్ అవసరాల వరకూ విస్తృతంగా ఉపయోగించిన సుమో, భారత ఆటో చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ప్రస్తుతం టాటా లైన్‌అప్‌లో ఈ సెగ్మెంట్‌ను నింపే సరైన MPV లేదా బాడీ-ఆన్-ఫ్రేమ్ యుటిలిటీ వాహనం లేకపోవడం వల్ల, సుమో తిరిగి వస్తే ఖాళీని భర్తీ చేయగలదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సుమో రీ-ఎంట్రీపై పెద్ద చర్చ నడుస్తోంది. కార్ లవర్స్ - అందరూ తమ ఊహలకు రెక్కలు పెట్టి న్యూ జనరేషన్ టాటా సుమో ఎలా ఉండొచ్చో డిజైన్ రేందర్లు తయారు చేస్తున్నారు.

బాక్సీ కానీ మస్క్యులర్ లుక్, ఆధునిక LED లైటింగ్, పెద్ద గ్రిల్, SUV స్టాన్స్‌తో సుమో తిరిగి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ ఈ డిజైన్లు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సుమో కొత్త రూపంలో కనిపిస్తున్న రెండర్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి టాటా నుంచి అధికారికంగా విడుదలైనవి కాకపోయినా, కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో రూపొందించిన డిజైన్లు కావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
భారతీయ రోడ్లపై దుమ్మురేపిన సుమోను ఆధునిక SUV శైలిలో మళ్లీ ఊహించి చూపించడమే ప్రత్యేకత. ఈ డిజైన్‌లో సుమోకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన బాక్సీ లుక్‌ను అస్సలు మార్చకుండా, అదే రగ్గడ్ స్టైల్‌ను కొనసాగించారు. ముందు భాగం మరింత మస్క్యులర్‌గా కనిపించేలా పెద్ద గ్రిల్, స్లీక్ LED హెడ్‌ల్యాంప్స్, కొత్త బంపర్ డిజైన్‌తో ఆధునిక టచ్ ఇచ్చారు. పాత సుమో ఆత్మను అలాగే ఉంచి, దానికి SUVల స్టైల్‌ను జోడించారు.
ఈ మోడల్‌ను లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ లేఅవుట్‌లో చూపించారు. ముందు ప్రకాశవంతంగా కనిపించే టాటా లోగోతో కూడిన ఫ్రంట్ గ్రిల్, అలాగే ఇప్పుడు టాటా వాహనాల్లో సాధారణంగా కనిపిస్తున్న స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్ ఆధునిక గుర్తింపును ఇస్తున్నాయి. కారు ముందు నల్లటి బంపర్ మరింత రగ్గడ్, ఆఫ్-రోడ్ వాహనాల తరహా గంభీరమైన లుక్‌ను అందిస్తోంది. దీనిని కాంప్లిమెంట్ చేసేలా సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్, ఆకర్షణీయమైన ఎరుపు టో హుక్ను జోడించారు.
వర్టికల్ టెయిల్‌గేట్ డిజైన్ ఇటీవల రీ-ఇంట్రడ్యూస్ చేసిన సియారాను గుర్తు చేస్తుంది. వెనుక భాగం అంతటా సాగిన LED లైట్ బార్ ఈ వాహనానికి ప్రీమియం టచ్‌ను ఇస్తోంది. టెయిల్‌గేట్ మధ్యలో స్పష్టంగా కనిపించే 'SUMO' లోగో, అలాగే వెనుక భాగంలో అమర్చిన స్పేర్ వీల్ పాత సుమో గుర్తులను గుర్తుచేస్తూ, నాస్టాల్జియాను మళ్లీ తీసుకువస్తాయి. ఇంటీరియర్ డిజైన్ కూడా పూర్తిగా ఆధునిక శైలిలో ఊహించారు.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం ప్రకారం, టాటా మోటార్స్ ఇప్పటివరకు సుమో రీ-లాంచ్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, సుమో పేరుపై ఇప్పటికీ ప్రజల్లో ఆసక్తి, సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని గమనిస్తే, ఈ మోడల్‌పై అంచనాలు ఎంత బలంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఒకప్పుడు భారతీయ రోడ్లపై విశ్వసనీయతకు, రగ్గడ్ పనితీరుకు ప్రతీకగా నిలిచిన సుమోను, ఆధునిక డిజైన్, కొత్త టెక్నాలజీతో తిరిగి తీసుకువస్తే, పెద్ద స్థాయిలో ప్రభావం చూపే అవకాశముంది.


Click it and Unblock the Notifications








