కేవలం రూ.5 లక్షలు.. 28 కిలోమీటర్ల మైలేజ్.. సేఫ్టీలో రారాజు.. ఈ కారు కోసం షోరూమ్‌కు క్యూ కట్టిన జనాలు
దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో దిగ్గజ కంపెనీగా పేరుగాంచిన టాటా మోటార్స్ (tata motors) ప్రయాణికుల రక్షణకు సంబంధించి అత్యుత్తమ నాణ్యతతో కూడిన కార్లను విడుదల చేయడంలో ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. ఇదే క్రమంలో టాటా నుంచి వచ్చిన టియాగో (tiago) ప్రసిద్ద మోడల్‌గా భారతీయ వినియోగదారులకు ఇష్టమైన కారుగా నిలుస్తుంది. చిన్న హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఇది ఒకటి. తక్కువ ధరలో, గట్టి నిర్మాణం, మెరుగైన మైలేజీ, ప్రధానంగా సేఫ్టీ పరంగా అద్భుతమైన మోడల్. ఈ కారుకు ఉన్న డిమాండ్ ఏప్రిల్ 2025 అమ్మకాల గణాంకాల్లో బాగా కనిపించింది. తాజాగా టాటా మోటార్స్ నుంచి వెల్లడైన డేటా ప్రకారం, ఏప్రిల్ 2025లో టాటా టియాగో మొత్తం 8,277 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
ఇది గత సంవత్సరం అదే నెలతో పోల్చితే గణనీయమైన పెరుగుదల. ఏప్రిల్ 2024లో అమ్మకాలు 6,796 యూనిట్లకు పరిమితమయ్యాయి. అంటే, ఒకే సంవత్సరంలో 22 శాతం వృద్ధి సాధించడం, మార్కెట్లో ఈ కారుకు ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది. ఈ గణాంకాల వృద్ధికి ప్రధానంగా రెండు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, టియాగోకు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్, రెండోది బడ్జెట్ ధరలో మంచి పనితీరును కనబరచడం.

టాటా టియాగో భారత మార్కెట్‌లో తన స్థిరమైన స్థానాన్ని మరింత బలపరిచే దిశగా కొనసాగుతోంది. మార్చి 2025లో టాటా టియాగో అమ్మకాలు 7,946 యూనిట్లుగా నమోదయ్యాయి. కానీ ఏప్రిల్ 2025లో ఈ సంఖ్య 8,277కి పెరిగింది. అంటే కేవలం ఒక నెల వ్యవధిలోనే 4 శాతం అమ్మకాల వృద్ధి నమోదయ్యింది. అయితే టియాగో ఇలా నెలనెలకూ మెరుగైన ప్రదర్శన కనబరచడం, దీనికి ఉన్న డిమాండ్‌ను చాటుతోంది.
టాటా టియాగో ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు పూర్తి రక్షణ అందిస్తుందని క్రాష్ టెస్ట్‌లో వెల్లడైంది. గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ పరీక్షలలో ఈ కారు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇది తక్కువ ధరలో లభించే హ్యాచ్‌బ్యాక్ కార్లలో అరుదైన విషయం. పెద్దల నుంచి మొదలుకుని చిన్న పిల్లల వరకు, ముందు డ్రైవర్ భద్రత వరకు, టియాగో అందించే సేఫ్టీ ప్రజలను చాలా ఆకట్టుకుంది.

ఇక ధర విషయానికి వస్తే, టియాగో బడ్జెట్ ప్రేమికుల కలల కారుగా నిలుస్తోంది. ICE వేరియంట్ ప్రారంభ ధర రూ. 5 లక్షలు మాత్రమే, అదే టాప్ వేరియంట్ రూ. 8.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఒక చిన్న హ్యాచ్‌బ్యాక్‌లో దాదాపు అన్ని అవసరమైన ఫీచర్లను అందించే విధంగా తయారు చేయబడింది. ఇంకా, కాలంతో పాటు మారుతున్న వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని, టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను తీసుకొచ్చింది.
అదే టాటా టియాగో ఈవీ ధరను చూసినట్లయితే దాదాపు రూ. 7.99 లక్షలు. దీని టాప్ వేరియంట్ ధర వచ్చేసి రూ.11.14 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎలక్ట్రిక్ వేరియంట్‌లో ఈ కారు పూర్తి ఛార్జ్‌తో దాదాపు 315 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ఇది సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా కొనుగోలు చేయడానికి లభిస్తుంది. దీనిలో మైలేజ్‌ను చూసినట్లయితే దాదాపే 28.06 కిమీల వరకు వస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








