తక్కువ ధరలో మంచి కారు కావాలా.. అయితే 2025లో ఈ కొత్త కార్లు మీకు బెస్ట్ ఛాయిస్!

దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రత్యేక బ్రాండ్‌గా పేరు సంపాదించింది. తక్కువ ధరలో, నాణ్యమైన కార్లను అందించడంలో ఈ సంస్థకు తమదైన గుర్తింపు ఉంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన టాటా టియాగో, టాటా టిగోర్ మోడల్ కార్లు.. కస్టమర్లను బాగా ఆకట్టుకున్నాయి. కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈ కార్లను మరింత అడ్వాన్స్‌డ్ ఫీచర్లను తీసుకువస్తోందీ సంస్థ. జనవరి 17 నుంచి 22వరకు దిల్లీలో జరగనున్న గ్లోబల్ మొబిలిటీ ఎక్స్‌పోలో టాటా టియాగో, టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్ పేర్లతో మూడు అప్డేటెడ్ కార్లను లాంఛ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ మోడళ్లకు సంబంధించి టీజర్లను ఈ సంస్థ విడుదల చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

మొదట్లో పెట్రోల్, డీజిల్ వెర్షన్‌లలో అందుబాటులో ఉన్న టాటా టియాగో కారు... ఆ తర్వాత BS-VI మోడల్‌కు తగ్గట్లుగా పెట్రోల్ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైంది. అయినప్పటికీ సేల్స్‌లో ఏమాత్రం వెనుకబడలేదు. దీనికి ప్రధాన కారణం ఈ కారు అందించే సేఫ్టీ అనే చెప్పవచ్చు.

Tata tiago and Tigor EV updated versions Teaser

తక్కువ ధరలో లభించడంతో పాటు, 4- స్టార్ రేటింగ్‌ను సాధించిన హ్యాచ్‌బ్యాక్‌గా టియాగో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే సెగ్మెంట్‌లో భారత మార్కెట్‌లో వేరే ఏ కారు కూడా అందుబాటులో లేదు. అయితే.. టాటా మోటార్స్ సంస్థ ఈ టియాగో కారును ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా లాంచ్‌ చేసింది. వినియోగదారులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు అప్‌గ్రేడ్‌ చేసిన టియాగో, టియాగో ఈవీని ఆటో ఎక్స్ పోలో లాంచ్‌ చేయనుంది.

2020 జనవరిలో వచ్చిన మోడల్స్ తరహాలోనే ఈ రానున్న కార్లు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూడు కారు మోడళ్లు కొత్త కలర్ ఆప్షన్లతో రావడంతో పాటు ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో కొన్ని మైనర్ ఛేంజెస్ ఉండే అవకాశం ఉంది. టియాగోలో గ్రిల్, అలాయ్ వీల్ డిజైన్‌లలో అప్డేటతో పాటు కొన్ని ఇతర ఫీచర్లను జోడించి తీసుకురానున్నారు.

ఇక టియాగో కారు ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త అప్‌హోల్‌స్టరీతో (upholstery), ఇతర ఎక్విప్‌మెంట్స్ ఇందులో ఉండనున్నాయి. అంతేగాకుండా ఈ కారులో కొత్త టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉండబోతుంది. అప్డేటెడ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆప్షనల్ సన్ రూఫ్ వేరియంట్స్, న్యూ కేబిన్ కలర్ స్కీముల్లో ఇది ఉండబోతోంది.

టియాగో, టిగోర్ మోడల్ కార్లు రెండూ కూడా 1.2 లీటర్ రివోర్టన్ పెట్రోల్ ఇంజిన్‌తో , మ్యాన్యువల్, AMT ఆప్షన్లతో అనుసంధానించి రానున్నాయి. దీంట్లో ప్రస్తుతం ఉన్న ట్విన్ సిలిండర్ సీఎన్‌జీ టెక్నాలజీ సదుపాయం కూడా కొనసాగనుంది. 5- స్పీడ్ మ్యాన్యూవల్ లేదా AMT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో ఇది అందుబాటులో ఉంటుంది. ఇది 86 bhp, 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఈ టియాగో హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుత ప్రారంభ ధర రూ.5 లక్షలుగా ఉంది. దీంట్లో టాప్-ఎండ్ వేరియంట్ రూ.10.33 లక్షలకు(ఎక్స్- షోరూమ్) దొరుకుతుంది. మరోవైపు.. టిగోర్ సెడాన్ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.9.40 లక్షల మధ్య ఉంది. అప్గ్రేడ్స్‌తో రానున్న ప్రస్తుత కార్లు కొద్ది మేర ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

టియాగో ఈవీ ఎక్స్ షో రూమ్ ధర ప్రస్తుతం రూ.7.99 లక్షల నుంచి రూ.11.49 లక్షలుగా ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ రెండు బ్యాటరీ ప్యాక్స్ ఆప్షన్లతో వస్తుంది. ఒకటి 19.2 kWh కాగా, మరొకటి 24 kWh. ప్రస్తుతం ఉన్న XE, XT, XZ ప్లస్, XZ ప్లస్ టెక్ వేరియంట్‌లు మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వెర్షన్లు రానున్న కార్లలోనూ కొనసాగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 9, 2025, 19:21 [IST]
English summary
Tata tiago ev and tigor ev teaser released ahead of launch in auto expo 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+