బైక్‌కి బదులుగా 28Km మైలేజ్ ఇచ్చే కారు కొంటే ఏమవుతుంది? ఎంత మంది రూ.5 లక్షల విలువైన హ్యాచ్‌బ్యాక్ కొన్నారు?
గత కొన్ని సంవత్సరాలలో టాటా మోటార్స్ (Tata Motors) సామాన్య కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని అనేక మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వాటిలో టియాగో (Tiago) ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇది హ్యాచ్‌బ్యాక్ బాడీ టైప్‌లో వస్తున్నా, అందంగా, బడ్జెట్ ధరలో, సురక్షితంగా ఉండటంతో అనేక మంది వినియోగదారుల మనసు దోచుకుంది. తాజాగా ఈ కారుకు సంబంధించిన సేల్స్ వివరాలను టాటా వెల్లడించింది. దీని ప్రకారం, మే 2025లో టియాగో కారు ఇంకా మార్కెట్లో తన స్థానం దృఢంగా నిలుపుకుంటోందని స్పష్టమవుతుంది. కంపెనీ విడుదల చేసిన గణాంకాలు చూసినట్లయితే, మొత్తం 6,407 యూనిట్లు అమ్ముడైనట్లు వెల్లడైంది. ఈ సంఖ్యలో టియాగో ఎలక్ట్రిక్ వేరియంట్‌తో పాటు, Ice ఇంజిన్ వేరియంట్లు కూడా ఉన్నాయి.
అదే గత ఏడాది మే 2024లో టియాగో అమ్మకాలు 5,927 యూనిట్లుగా ఉన్నాయి. ఒక్క సంవత్సరం వ్యవధిలో టియాగో అమ్మకాల్లో దాదాపు 8 శాతం వృద్ధి కనిపించింది. ఇది SUVల హవా నడుస్తున్న మార్కెట్‌లో ఒక హ్యాచ్‌బ్యాక్ కారుకు అందిన గొప్ప స్పందన. టాటా మోటార్స్ అమ్మకాలలో వృద్ధిని నమోదు చేసిన మోడళ్లలో టియాగో కూడా ఒకటి కావడం గమనార్హం. కంపెనీ నమ్మకానికి నిదర్శనంగా లక్షలాది కుటుంబాలకు చేరువ అయింది.

టాటా టియాగో ధర పరంగా అందరికీ అందుబాటులో ఉండటంతో పాటు, ఇది గణనీయమైన సేఫ్టీని అందిస్తుంది. 4-స్టార్ గ్లోబల్ ఎన్‌క్యాప్ రేటింగ్‌ను పొందిన ఈ కారు, "సేఫ్టీ కూడా ప్రాధాన్యం" అనే దృష్టితో కొనుగోలు చేసే కుటుంబాలకు బాగా నచ్చుతుంది. చిన్నదైనా బలమైనదిగా ఉండే ఈ కారు డిజైన్, ఇంజిన్ పనితీరు, మైలేజ్ వంటి అన్ని అంశాలు కూడా కారును అందరికి నచ్చేలా ఆకట్టుకునేలా చేశాయి.
టాటా టియాగో అనేది వినియోగదారుల అవసరాలను బాగా అర్థం చేసుకుని రూపొందించిన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్. ఈ కారును టాటా మోటార్స్ మూడు భిన్నమైన పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందిస్తోంది, పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ వేరియంట్లలో. ఇది తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్, భద్రత, స్టైలింగ్ అందించే కారుగా మార్కెట్లో తనదైన గుర్తింపును సంపాదించుకుంది. టియాగో ICE ఇంజిన్ వేరియంట్ల ధరలు రూ.5 లక్షల ప్రారంభ ధర నుండి ప్రారంభమవుతాయి.

దీని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.45 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్). ఇక టియాగో EV విషయానికి వస్తే, ఇది భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుండి మొదలై రూ. 11.14 లక్షల వరకు వెళ్లుతుంది. తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
కంపెనీ ప్రకారం, టియాగో EV పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత గరిష్ఠంగా 315 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని పేర్కొంది. ఇంకా, టియాగో CNG వేరియంట్లు కూడా వినియోగదారుల మనసు దోచుకుంటున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది దేశంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో అందుబాటులో ఉన్న CNG కార్లలో ఒకటి. పెట్రోల్, సీఎన్జీ మోడళ్లలో ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను అందించడమే కాదు, అదే సమయంలో మంచి మైలేజ్‌ను కూడా అందిస్తోంది.

CNG/ఆటోమేటిక్ వెర్షన్ 28.06 కి.మీ/కి.జీ మైలేజ్‌ను అందించగలదని కంపెనీ చెబుతోంది. టియాగో ఒక కుటుంబానికి సరిపోయేలా ఉంటుంది. హ్యాచ్‌బ్యాక్ కారు ఐదుగురు వ్యక్తులు సౌకర్యంగా ప్రయాణించగలిగేంత ఇంటీరియర్‌ను కలిగి ఉంది. ప్రీమియం బైక్ ధరకే అందుబాటులో ఉండే ఈ కారు, బైక్‌ల మాదిరిగానే మంచి మైలేజీని అందించగలదు. ఇంధన ధరలు పెరుగుతున్న ఈ సమయంలో, తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు అందించే కారు కోసం చూస్తున్నవారికి టాటా టియాగో బెస్ట్.


Click it and Unblock the Notifications








