రూ.7లక్షల ధరలో, అద్భుతమైన ఫీచర్లతో టాటా టియాగో ఎన్ఆర్‌జీ న్యూ వెర్షన్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి

దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ టాటా మోటార్స్ పై కస్టమర్లు ఎలాంటి నమ్మకం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కంపెనీ వాహకాలకు ఇచ్చే స్ట్రాంగ్ బాడీ బిల్డింగ్ కారణంగా ఈ కార్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా టాటా కంపెనీ ఆధునిక మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే టాటా టియాగో ఎన్ఆర్జీ (Tata Tiago NRG) న్యూ వెర్షన్ ను రిలీజ్ చేసింది.

గతంలో టాటా నుంచి విడుదలైన టియాగోకు ఎస్‎యూవీ లుక్ ఇస్తూ ఎన్ఆర్జీ మోడల్ తీసుకొచ్చింది. స్టైలిష్ లుక్ లో ఉన్న ఈ మోడల్ మార్కెట్లో మారుతి సుజుకీ సెలెరియో ఎక్స్, ఫోర్డ్ ఫ్రీస్టైల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది స్టా గ్రీన్, ఫైర్ రెడ్, స్నో వైట్, క్లౌడీ గ్రే కలర్ వేరియంట్స్‎లో లభించనుంది. ఇది పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లలో లభిస్తుంది.

Tata Tiago NRG Front

టాటా మోటార్స్ ఇటీవల అప్ డేటెడ్ 2025 టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ కారు 'NRG వెర్షన్'ను అప్‌గ్రేడ్ చేయడం గురించి మాత్రం ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. చివరగా టాటా కొన్నిఇన్నోవేషన్స్ తో టియాగో NRGని ప్రారంభించింది. రెగ్యులర్ టియాగోతో పోలిస్తే, ఇది కొంచెం స్పోర్టియర్ మోడల్. ఇది ఏ రోడ్డు మీదనైనా చాలా ఈజీగా ప్రయాణించగలదు.

కొత్త 2025 టాటా టియాగో NRG హ్యాచ్‌బ్యాక్ సాధారణ టియాగో మాదిరి ఎక్సటర్నల్ డిజైన్ కలిగి ఉంటుంది. కాకపోతే దీనికి కొన్ని కాస్మోటిక్ మార్పులు తీసుకొచ్చింది. ఇది మందపాటి సిల్వర్ స్కిడ్ ప్లేట్ తో రీ డిజైన్ చేసిన బంపర్ తో వస్తుంది. షార్క్ ఫిన్ యాంటెన్నా, కుడి వైపున NRG బ్యాడ్జింగ్ కూడా ఉన్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ క్యాబిన్ ఇంటర్నల్ డిజైన్ మరింత లేటెస్ట్ డిజైన్ కలిగి ఉంది.

Tata Tiago NRG Interior

ఇది రెండు స్పోక్ స్టీరింగ్ వీల్‌పై టాటా లోగోతో వచ్చింది. ఈ టాటా టియాగో NRG కారులో డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో 10.25ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, ఆటో-ఫోల్డింగ్ OVRMలు, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెనుక సెన్సార్లు, వైపర్లు, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది.

కొత్త టియాగో NRG హ్యాచ్‌బ్యాక్ సేఫ్టీ పరంగా ఇప్పటికే మార్కెట్లో మంచి మార్కులు సంపాదించింది. ఈ టియాగోకి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), వెనుక పార్కింగ్ సెన్సార్స్, కెమెరా ఉంటాయి. డాష్‌బోర్డ్, సీట్స్ కూడా ప్రయాణీకులకు అనుకూలంగా డిజైన్ చేశారు.

Tata Tiago NRG

ఈ కొత్త టాటా టియాగో ఎన్ఆర్జీ పవర్‌ట్రెయిన్ ఆఫ్షన్లలో మార్పులు చేయలేదు. దీని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 86 PS హార్స్‌పవర్, 113 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో 1.2-లీటర్ CNG ఇంజిన్ 73 PS హార్స్‌పవర్, 95 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది వేరియంట్‌ను బట్టి 5స్పీడ్ మాన్యువల్/5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది లీటరుకు 19.43 నుంచి 28.06కి.మీల మైలేజీని ఇస్తుంది.

ఈ టాటా టియాగో NRG హ్యాచ్‌బ్యాక్ కూడా మధ్య తరగతి ప్రజల బడ్జెట్ కు అనుగుణంగా అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 7.2 లక్షలు, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 7.75 లక్షలు. అదేవిధంగా, CNG మాన్యువల్ వేరియంట్ ధర రూ. 8.2 లక్షలు, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 8.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో ఐదుగురు హాయిగా ప్రయాణించవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 12, 2025, 16:40 [IST]
English summary
Tata tiago nrg new version launched at 7 lakh with amazing features check it out
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+