సామాన్యుడి కారు కలేనా ? భారీగా పెరగనున్న 4-స్టార్ సేఫ్టీ ఉన్న టాటా చిన్న కారు ధర
టాటా మోటార్స్ ఇండియాలో టాప్ కార్ల తయారీ కంపెనీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతీ నెల వేల సంఖ్యలో కార్లను టాటా కంపెనీ మార్కెట్‌లో అమ్ముతోంది. టాటా మోటార్స్ ఈ స్థాయిలో ఉండటానికి ముఖ్య కారణమైన కార్లలో టియాగో (Tiago) ఒకటి. టాటా మోటార్స్ తక్కువ ధరలో అందించే హ్యాచ్‌బ్యాక్ కారు టియాగో, టాటాలోనే కాదు మొత్తం ఇండియాలోనే తక్కువ ధర కలిగిన హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది.
ఇలాంటి పరిస్థితుల్లో టియాగో కార్ల ధరలు వేరియంట్‌ను బట్టి రూ.5,000 నుంచి రూ.10,000 వరకు పెరిగాయి. దీనికి ముందు 2024 చివరిలో విడుదలైన కర్వ్ (Curvv) కారు ధరలను కూడా టాటా మోటార్స్ పెంచిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు టియాగో కారు ధరల పెరుగుదల గురించిన వివరాలు అందుబాటులోకి వచ్చాయి. టాటా టియాగో కార్ల ఎక్స్-షోరూమ్ ధరలు ఇంతకుముందు రూ.5 లక్షల నుంచి రూ.8.75 లక్షల వరకు ఉండేవి. ఇందులో ప్రారంభ ధర అయిన రూ.5 లక్షలలో ఎలాంటి మార్పు లేనప్పటికీ, మిగిలిన వేరియంట్ల ధరలు పెరిగాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్స్.ఈ, ఎక్స్.ఎమ్, ఎక్స్.టి, ఎక్స్.టి.ఏ, ఎక్స్.ఇజడ్, ఎక్స్.ఇజడ్ ఎన్.ఆర్.జి, ఎక్స్.ఇజడ్.ఏ, ఎక్స్.ఇజడ్ ప్లస్, ఎక్స్.ఇజడ్.ఏ ప్లస్ అనే 9 రకాల వేరియంట్లలో టాటా టియాగో కారు అమ్ముడవుతోంది. ఇందులో ఎంట్రీ-లెవెల్ వేరియంట్ అయిన ఎక్స్.ఈ ధరలో మాత్రమే ఎలాంటి మార్పు లేదు. మిగిలిన అన్ని వేరియంట్ల ధరలు భారీగా పెరిగాయి.

ధర పెరగని ఎక్స్.ఈ వేరియంట్ పెట్రోల్, సీఎన్‌జీ (CNG) ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో పెట్రోల్ వేరియంట్‌లో టియాగో ఎక్స్.ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5 లక్షలు, సీఎన్‌జీ వేరియంట్‌లో రూ.6 లక్షలు. ఈ రెండు ధరల్లోనూ ఎలాంటి మార్పు లేదు.
మిగిలిన వేరియంట్ల ధరలు ఇదివరకే చెప్పినట్లుగా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగాయి. పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రూ.5.70 లక్షలకు లభించే ఎక్స్.ఎమ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.80 లక్షలకు పెరిగింది. చాలా మంది కొనే వేరియంట్‌గా ఉన్న దీని ధర పెరగడం టియాగో కారు అమ్మకాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

టియాగో కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. టియాగో సీఎన్‌జీ కారులో కూడా ఇదే పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. అయితే టియాగో సీఎన్‌జీ కారులో పెట్రోల్‌కు బదులుగా అధిక ఒత్తిడితో కూడిన న్యాచురల్ గ్యాస్ నింపాలి. దీని కోసం టియాగో సీఎన్‌జీ కారులో వెనుకవైపు రెండు సీఎన్‌జీ సిలిండర్లు అందించబడ్డాయి.
టియాగో కారు పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లు రెండూ మాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తాయి. కొత్త ధరల పెరుగుదల వల్ల, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో టియాగో కారు ప్రారంభ ధర ఇకపై రూ.6.90 లక్షలు అవుతుంది. ఇంతకుముందు ఈ ధర రూ.5,000 తక్కువగా రూ.6.85 లక్షలుగా ఉండేది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం : కార్ల ధరల్లో రూ.5,000 పెరుగుదల పెద్ద విషయం కాదు. ఎందుకంటే దాదాపు ప్రతి డీలర్‌షిప్ షోరూమ్‌లోనూ కార్ల ధరల్లో రూ.5,000 వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి రూ.10,000 ధర పెరిగిన టియాగో కారు వేరియంట్‌లను మనం ముఖ్యంగా గమనించాలి. ఈ కథనంలో మేము పేర్కొన్న ధరలన్నీ కారు ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








