రూ.5 లక్షల కారు, 29 కి.మీల మైలేజ్.. ఇలాంటి దాన్ని ఎవరు వద్దనుకోరు.. షోరూమ్‌ ముందు కస్టమర్ల క్యూ!

భారతీయ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఒక ముఖ్యమైన స్థానం ఉంటుంది. చూడటానికి చిన్నగా, చక్కగా ఉండే ఈ వాహనాలు రోజువారీ అవసరాలకు బాగా ఉపయోగపడుతాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వర్గానికి ఇది ప్రధాన మోడల్. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటనెన్స్‌తో నగర ట్రాఫిక్ రోడ్లపై కూడా సులభంగా రయ్ మంటూ దూసుకుపోతాయి. అందుకే హ్యాచ్‌బ్యాక్ కార్లు భారత మార్కెట్లో అత్యంత ప్రజాధారణ పొందిన వాహనాలుగా ఉన్నాయి. ఇలాంటి విభాగంలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మోడల్ టాటా టియాగో (tata tiago). దేశీయ అత్యంత సేఫ్టీ కార్లను తయారు చేసే టాటా మోటార్స్ నుంచి వచ్చిన ఈ కారు తొలిసారిగా 2016 ఏప్రిల్‌లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు, అంటే సరిగ్గా తొమ్మిదేళ్లు గడిచినా, టియాగో తన అమ్మకాలతో దూసుకుపోతుంది.

దాని బలమైన బిల్డ్ క్వాలిటీ, స్టైలిష్ డిజైన్, ఫీచర్లకు తగ్గ ధర కారణంగా ఇన్నేళ్లు తర్వాత కూడా మార్కెట్లో ఉన్న ఇతర మోడళ్లకు బలమైన పోటీగా నిలుస్తూ సేల్స్‌ను సాధిస్తుంది. తాజాగా టాటా టియాగో సేల్స్‌కు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, మార్చి 2025లో ఇది 7,946 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇది గత ఏడాది అంటే 2024 మార్చి నెలలో 6,381 యూనిట్లుగా మాత్రమే ఉంది.

Tata Tiago Sales In 2025

ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది 25 శాతం వృద్ధి చెందింది. ఇప్పటికీ భారత మార్కెట్లో టియాగోకి ఉన్న క్రేజ్ చూస్తుంటే, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఈ కారుకు ఉన్న స్థానం ఏమిటో తెలిసిపోతుంది. మారుతున్న ట్రెండ్స్‌కి అనుగుణంగా టియాగో అప్‌డేట్ అవుతూ కొత్త వేరియంట్లు, ఫీచర్లు, టెక్నాలజీతో మిలియన్ల మందికి చేరుకుంది. మార్చి 2025లో, ఇది టాటా మోటార్స్ అమ్మకాల పరంగా మూడవ అత్యధికంగా అమ్ముడైన కారు స్థానాన్ని దక్కించుకుంది.

దీనికంటే ముందు మొదటి రెండు స్థానాల్లో టాటా పంచ్, టాటా నెక్సాన్ ఉన్నాయి. టియాగో విషయానికి వస్తే, ఇది రెండు వెర్షన్లలో ICE, ఎలక్ట్రిక్‌లో కొనుగోలుకు లభిస్తుంది. ICE ఇంజిన్ వేరియంట్ ప్రారంభ ధర కేవలం రూ. 5 లక్షలుగా ఉండగా, దీని టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి రూ. 8.45 లక్షలు వరకు ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది.

Tata Tiago Sales 25 Percent Growth Its Recorded 7946 Units

ఇతర హ్యాచ్‌బ్యాక్ కార్లతో పోలిస్తే టాటా టియాగో అందించే మైలేజ్ ప్రత్యేకంగా ఉంటుంది. దీని CNG ఆటోమేటిక్ వేరియంట్ అత్యధికంగా 28.60 కి.మీ/కి.గ్రా మైలేజ్ ఇస్తుంది. ఇంధన ధరలు పెరుగుతున్న సమయంలో, ఈ మైలేజ్ వినియోగదారులకు చాలా పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది. ఇక టాటా టియాగో ఎలక్ట్రిక్ వెర్షన్ విషయానికి వస్తే, దీని ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఈ ఎలక్ట్రిక్ వేరియంట్‌కి సంబంధించిన టాప్ మోడల్ ధర రూ. 11.14 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ మోడల్ 24 kWh కెపాసిటీతో కూడిన బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు ఈ వేరియంట్ గరిష్టంగా 315 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. నగరాల ట్రాఫిక్ పరిస్థితుల్లో ఇది సరిపోయే స్థాయిలో ఎక్కువ రేంజ్ కావడం వల్ల ఇది అర్బన్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌గా బాగా పేరొందింది.

Tata Tiago Sales

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, April 12, 2025, 7:30 [IST]
English summary
Tata tiago sales 25 percent growth its recorded 7946 units in march 2025
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+