దేశంలో ప్రతి ఒక్కరు కోరుకునే బడ్జెట్ కారు.. 27 కి.మీ మైలేజీ.. దీనికోసం షోరూమ్‌లు కస్టమర్లతో నిండిపోయాయ్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తున్న ఒక పెద్ద మార్పు ఏమిటంటే, కస్టమర్లు క్రమంగా మారుతి కంటే టాటా కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీనికి వెనుక ఉన్న కారణాలు ఒక్కటి కాదు, అనేకం. నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, ఆధునిక ఫీచర్లు, అందుబాటులో ఉండే ధర.. ఈ నాలుగు అంశాలను ఒకే వేదికపై అందించగల ఆటోమేకర్‌గా టాటా మోటార్స్ సాధారణ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. టాటా కంపెనీకి చెందిన టాటా టియాగో (Tata Tiago) మోడల్ గత నెలలో అద్భుతమైన అమ్మకాలతో మార్కెట్‌లో తిరుగులేని ఫలితాలను సాధించింది. సెప్టెంబర్ 2025లో ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ మొత్తం 8,322 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన 4,225 యూనిట్లతో పోలిస్తే, ఇది దాదాపు రెట్టింపు వృద్ధి (97% పెరుగుదల).

కేవలం ఒక సంవత్సరంలో టియాగో ప్రజాదరణ రెండింతలు పెరిగింది. టాటా మోటార్స్‌కు సెప్టెంబర్ 2025 నిజంగా విజయవంతమైన నెలగా నిలిచింది. నెక్సాన్, పంచ్ తర్వాత, ఇప్పుడు టాటా టియాగో కంపెనీ లైనప్‌లో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా అవతరించింది. ఇది కేవలం టాటా బ్రాండ్‌కే కాకుండా, మొత్తం భారతీయ చిన్న కార్ల విభాగానికి ఒక కొత్త సంకేతం. ఈ సక్సెస్ మారుతి, హ్యూందాయ్ వంటి వాటికి బలమైన పోటీ అని చెప్పవచ్చు.

Tata Tiago September 2025 Sales Increased by 97 Percent Compared To Previous

తక్కువ ధరలోనూ మంచి నాణ్యత, భద్రత, ఫీచర్లు అందిస్తే ప్రజలు మారుతి కార్లకన్నా టాటాను ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని దీన్ని బట్టి తెలుస్తుంది. టియాగో ఇప్పుడు అమ్మకాల పరంగా మారుతి ఆల్టో, సెలెరియో, ఇగ్నిస్, ఎస్-ప్రెస్సో వంటి ప్రముఖ మోడళ్లను అధిగమించింది. వీటిని దాటేసి, ప్రస్తుతం టియాగో కంటే ముందు ఉన్నవి కేవలం మారుతి స్విఫ్ట్, వ్యాగన్‌ఆర్ మాత్రమే.

పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని టాటా మోటార్స్ తమ ప్రజాదరణ పొందిన హాచ్‌బ్యాక్ టియాగోపై భారీ ఆఫర్లను ప్రకటించింది. కొత్తగా కారు కొనాలనుకునేవారికి రూ. 1.20 లక్షల వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. ఇందులో రూ.75,000 వరకు ఎక్స్-షోరూమ్ ధర తగ్గింపు, అలాగే రూ.45,000 వరకు అదనపు క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నారు. GST 2.0 తర్వాత టియాగో రూ.4.57 లక్షల నుండి, టాప్ ఎండ్ వేరియంట్ రూ.7.82 లక్షల వరకు ఉంటుంది.

Tata Tiago September 2025 Sales Increased by 97 Percent Compared To Previous

పర్ఫార్మెన్స్ పరంగా టియాగోలోని 1.2 లీటర్, 3 సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ 6,000 rpm వద్ద 84 bhp పవర్, 3,300 rpm వద్ద 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కి 5-స్పీడ్ మాన్యువల్, AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మైలేజ్ పరంగా హైలైట్‌గానే ఉంది. పెట్రోల్ వేరియంట్‌లో 19-20.09 km/l, అలాగే CNG ఆప్షన్‌లో 26.49 km/kg వరకు మైలేజ్ లభిస్తుంది.

టాటా టియాగో ఎలక్ట్రిక్ వెర్షన్ (Tiago EV)లో కూడా అందుబాటులో ఉంది. ఈ వెర్షన్ 295 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే, నగర ప్రయాణాల్లో చార్జ్ చేసుకునే సౌకర్యంతోనే దీని పరిధి చాలా పెద్దదని చెప్పవచ్చు. Tiago EVలోని బలమైన బ్యాటరీ, ఇంధన ఖర్చుల తక్కువ స్థాయి, తక్కువ నిర్వహణ ఖర్చులు, ఈ కారును ప్యూర్లీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కోసం చాలా ఆకర్షణీయమైన ఎంపికగా మార్చాయి.

Tata Tiago September 2025 Sales Increased by 97 Percent Compared To Previous

టాటా టియాగో కారులో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. ఇది 10.25-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్తో వస్తుంది, ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. ప్రయాణికుల అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా, ఇంటర్‌కనెక్ట్ చేయదగ్గ విధంగా చేస్తుంది. LED హెడ్‌లైట్లు కారు ముందు భాగాన్ని ఆకర్షణీయంగా మార్చడమే కాక, రాత్రి లేదా తక్కువ దృశ్య సందర్భాల్లో భద్రతను కూడా పెంచుతాయి.

More from DriveSpark

Article Published On: Thursday, October 16, 2025, 12:54 [IST]
English summary
Tata tiago september 2025 sales increased by 97 percent compared to previous
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+