ఎలక్ట్రిక్ కార్లలో ఈ రెండు కంపెనీలకు గట్టి పోటీ తప్పేలా లేదు.. వీటిలో ఏది కొంటే బెటరో తెలుసా?
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల సందడి కొనసాగుతోంది. స్టార్టప్ సంస్థల నుంచి మొదలుకొని.. విదేశీ దిగ్గజ సంస్థల వరకు అన్ని వాహన తయారీ సంస్థలు ఈవీలతో మార్కెట్లో పోటీ పెంచుతున్నాయి. ఇక దేశీయ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ నుంచి అతి తక్కువ ధరలో వచ్చిన ఎలక్ట్రిక్ కారు మోడల్ టాటా టియాగో ఈవీ. మరోవైపు విదేశీ సంస్థ విన్‌ఫాస్ట్ సంస్థ నుంచి VF3 ఎలక్ట్రిక్ కారు త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. ఈ రెండు కారు మోడల్స్ ఒక దానికి ఒకటి గట్టి పోటీ నిచ్చేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు కార్ల మధ్య ఉన్న తేడాలు పోలికలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
అప్పీయరెన్స్: లుక్ విషయంలో ఈ రెండు కార్లు వేటికవే విభిన్నమైనవి. విన్‌ఫాస్ట్ VF3 కారు పాత, కొత్త మేళవింపు తయారు చేశారు. దీని upright box-shaped అప్పీయరెన్స్ కారణంగా ఈ కారు సైజు పరంగా చిన్నగా ఉంటుంది. ఇక టాటా టియాగో ఈవీ విషయానికి వస్తే.. ఇది ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ కారు కోసం డిజైన్ చేసినట్లుగా ఉండదు. ఇది కాస్త పెద్దదిగా కనిపిస్తుంది.

ఇంటీరియర్ ఫీచర్స్: విన్‌ఫాస్ట్ VF3 కారులో ఆండ్రాయిడ్ ఆటో, కార్‌ప్లే ఫ్లాట్ స్టీరింగ్ వీల్, rotary dials for HVAC, 10 అంగుళాల ఫ్రీ స్టాండింగ్ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ చార్జర్, కీ లెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇందులో 285 లీటర్ల బూట్ స్పేస్, పవర్ విండోస్‌తో వస్తుంది.
టాటా టియాగో ఈవీ కారు ఇంటీరియర్ ఫీచర్స్‌ను పరిశీలిస్తే ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, LED DRLs, రెయిన్- సెన్సింగ్ వైపర్స్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ రిలీజ్, 4-ట్విటర్ ఆడియో సిస్టం విత్ 4- స్పీకర్స్, అడ్వాన్స్ డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి.
పవర్ ట్రైయిన్: విన్‌ఫాస్ట్ VF3 ఎలక్ట్రిక్ కారు.. 18.64kWh లిథియం-అయాన్ బ్యాటరీతో ఉంటుంది. ఇది ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 210 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. టియాగో ఈవీ కారు లిథియం-ఐరన్-ఫాస్పేట్ బ్యాటరీతో 19.2 kWh, 24 kWh బ్యాటరీ ఆప్షన్లతో ఉంటుంది. ఇది వరుసగా 223, 293 కిలోమీటర్ల రేంజ్ అందించగలదు.
ధర: విన్‌ఫాస్ట్ సంస్థ భారత మార్కెట్లోకి తొలిసారిగా తీసుకురాబోతున్న ఈ VF3 ఎలక్ట్రిక్ కారు ధరను ఇంకా వెల్లడించలేదు. టాటా టియాగో ఈవీ రెండు వేరియంట్లలో ఉంటుంది. దీని ప్రస్తుత ధర రూ.7.99 లక్షల నుంచి రూ. 11.14 లక్షల మధ్య ఉంది. టాటా టియాగో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో తక్కువ ధరలో లభిస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: విదేశాల్లో మంచి పేరు దక్కించుకున్న విన్‌ఫాస్ట్ సంస్థ ఈ VF3 కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారుతో భారత మార్కెట్‌లోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. అయితే తక్కువ ధరలో లభించే టాటా టియాగో ఈవీతో ఇది ఎంత మేరకు పోటీ పడగలదో వేచి చూడాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








