టాటా నుంచి పవర్‌ఫుల్ కారు.. 500 కిలోమీటర్ల రేంజ్‌తో అత్యాధునిక ఫీచర్స్ దీని సొంతం.. లాంచ్ ఎప్పుడంటే?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో తయారీదారులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇటీవలి కాలంలో వరుసగా కొత్త ఈవీ కార్లను విడుదల చేస్తున్నారు. ప్రజలు కూడా వీటిని స్వీకరిస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా గత కొంత కాలంగా ఈవీ అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఇప్పటికి ఈ విభాగంలో ముందుడుగు వేసిన దేశీయ ప్రసిద్ధ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ టియాగో EV, టిగోర్ EV, పంచ్ EV, నెక్సాన్ EV లాంటి పాపులర్ మోడళ్లను విజయవంతంగా మార్కెట్‌లో నిలబెట్టింది. ఇప్పుడు మరొక శక్తివంతమైన ఎలక్ట్రిక్ SUVను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. టాటా తదుపరి ఎలక్ట్రిక్ కారుగా హారియర్ EV త్వరలో మార్కెట్లోకి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం, ఈ కొత్త మోడల్ వచ్చే నెలలోనే లాంచ్ అయ్యే అవకాశముంది. ఇది టాటా ప్రీమియం సెగ్మెంట్‌లోకి ఎలక్ట్రిక్ వెర్షన్‌గా వచ్చే తొలి మోడల్ కావడం విశేషం. అంతేకాదు, డిజైన్ పరంగా కూడా ఇది టాటా మోటార్స్ ఫ్యూచరిస్టిక్ EV డిజైన్ దిశగా తీసుకున్న ముందడుగు అనొచ్చు. హారియర్ EV గురించి ఇంకా అధికారికంగా ఏ ప్రకటన వెలువడనప్పటికీ, దీనికి సంబంధించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో లో హారియర్ EV కాన్సెప్ట్‌ను ప్రదర్శించగా, దానిపైనే ఈ ఉత్పత్తి మోడల్ ఆధారపడే అవకాశం ఉంది. మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న హారియర్ స్థిరమైన ఫ్యాన్ బేస్‌ను బట్టి చూస్తే, EV వెర్షన్‌కు కూడా మంచి స్పందన లభించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
టాటా హారియర్ EV లాంచ్‌కు ముందు దాని గూర్చిన అంచనాలు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి.
ఈ ఎలక్ట్రిక్ SUV, టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ విభాగంలో ఓ శక్తివంతమైన మోడల్‌గా మారనుంది. ఇందుకు కారణం, దీనిలో అందించబోతున్న అధిక సామర్థ్యం కలిగిన పవర్‌ట్రెయిన్. ఈ హారియర్ EVలో 75 కిలోవాట్-గంటల (kWh) కెపాసిటీ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వుండనుందని తెలుస్తుంది. ఈ భారీ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత, దాదాపు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని అందిస్తుంది.

ఇది కేవలం టాటా కార్లకే కాదు, దేశీయంగా లభ్యమవుతున్న చాలా ఎలక్ట్రిక్ SUVలకు ఒక గట్టి పోటీగా నిలుస్తుంది. అంతేకాకుండా, ఈ SUV మరింత అధిక హార్స్‌పవర్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, అంటే ఇది వేగవంతమైన ప్రయాణాన్ని అందించగలదని అంటున్నారు. ఫీచర్ల పరంగా కూడా టాటా ఈ మోడల్‌ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దనుంది. కారులో పెద్దదైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది.
ఇంకా, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ముందుభాగంలో వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్, విశాలమైన సన్‌రూఫ్ లాంటి ఫీచర్లు ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే, హారియర్ EV ప్రీమియం వినియోగదారుల అభిరుచులకు పూర్తి సమాధానంగా నిలిచేలా ఉంది. ఎక్స్‌టీరియర్ లుక్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉండనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








