మహిళా ప్రపంచకప్ విజేతలకు టాటా బిగ్ గిఫ్ట్.. లాంచ్ కాక ముందే ప్రతి ఒక్కరికీ న్యూ మోడల్ కార్
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మహిళా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించి, తొలిసారిగా ప్రపంచకప్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకుని, ప్రముఖ భారతీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) మహిళా క్రికెట్ జట్టుకు భారీ బహుమతిని ప్రకటించింది.
ప్రపంచకప్ విజేతలైన జట్టులోని ప్రతి క్రీడాకారిణికి త్వరలో విడుదల కానున్న సరికొత్త టాటా సియెరా(Tata Sierra) ఎస్‌యూవీని బహుమతిగా ఇవ్వనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ కొత్త ఎస్‌యూవీ విశేషాలు, ఫీచర్లు, టాటా మోటార్స్ ప్రకటన వివరాలు తెలుసుకుందాం.

దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి, ఐసీసీ మహిళా ప్రపంచకప్(ICC Women's World Cup) కిరీటాన్ని గెలుచుకున్న భారత జట్టుకు టాటా మోటార్స్ అభినందనలు తెలిపింది. ప్రపంచకప్ విజేత జట్టులోని ప్రతి క్రీడాకారిణికి సరికొత్త టాటా సియెరా ఎస్‌యూవీని బహుమతిగా ఇవ్వనున్నట్లు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ ప్రకటించింది. విడుదల కాబోయే మొదటి బ్యాచ్‌లోని టాప్ ఎండ్ మోడల్‌లను ఈ క్రీడాకారిణులకు అందించనున్నారు.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ సీఈఓ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రదర్శన దేశం మొత్తానికి గర్వకారణమని, వారి సంకల్పం, విశ్వాసం చాలా మందికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ఈ విజేతలకు సియెరాను బహుమతిగా ఇవ్వడం తమకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

కొత్తగా రాబోతున్న టాటా సియెరా ఎస్‌యూవీ డిజైన్, ఫీచర్లలో అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ కొత్త సియెరా ఎస్‌యూవీ నవంబర్ 25న మార్కెట్‌లోకి రానుంది. దీని ధర సుమారు రూ.11 లక్షల నుంచి రూ.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఇది మొదటగా ఐసీఈ (పెట్రోల్/డీజిల్) ఇంజిన్ ఆప్షన్‌లో ఆ తర్వాత ఎలక్ట్రిక్ (EV) పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లోనూ అందుబాటులోకి వస్తుందని సమాచారం.
టీజర్ వీడియోల ద్వారా ఈ కొత్త సియెరా, ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుందని ధృవీకరించబడింది. కొత్త సియెరా ఇంటీరియర్‌లో అడ్వాన్సుడ్ టెక్నాలజీ, మెరుగైన సేఫ్టీ ఫీచర్లను పొందుతుందని అంచనా.

ఈ ఎస్‌యూవీలో అత్యంత ముఖ్యమైన ఫీచర్ ట్రిపుల్ స్క్రీన్ సెటప్ (డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్ సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యాసింజర్-సైడ్ డిస్‌ప్లే) ఉంటుంది. స్టీరింగ్ వీల్‌పై ప్రకాశవంతమైన టాటా లోగో, టచ్ బేస్డ్ క్లైమేట్ కంట్రోల్, ఆంబియంట్ లైటింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
సేఫ్టీ పరంగా ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (ABS), ఈబీడీ (EBD), ఏడీఏఎస్ (ADAS - అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), టీపీఎంఎస్ (TPMS), 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఈ కారులో 5 సీటింగ్ ఆప్షన్ ఉంటుంది.
కొత్త టాటా సియెరా మార్కెట్‌లో అనేక ఇతర ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతి సుజుకి విక్టోరిస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, మహీంద్రా స్కార్పియో క్లాసిక్, స్కోడా కుషాక్ వంటి అనేక కార్లు దీనికి ప్రధాన ప్రత్యర్థులుగా నిలవనున్నాయి.


Click it and Unblock the Notifications