ఫిబ్రవరిలో భారీగా పడిపోయిన టాటా నంబర్ వన్ మోడల్ అమ్మకాలు.. ఫస్ట్ ప్లేస్‎కు చేరుకుంది ఏదో తెలుసా ?

టాటా మోటార్స్ కార్లకు దేశీయంగా మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ సాయంతో కార్లను మార్కెట్లోకి వదులుతుంది. దేశంలో సబ్ ఫోర్ మీటర్ లేదా కాంపాక్ట్ ఎస్ యూవీలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అందుకనే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్ని విభాగాలను వది ఈ సెగ్మెంట్లో తమ లేటెస్ట్ కార్లను భారత మార్కెట్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. కస్టమర్లు కూడా అలాంటి కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. టాటా కూడా తన మైక్రో ఎస్ యూవీ పంచ్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ కారుకు ఎలాంటి ప్రజాదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ టాటా పంచ్ మారుతీ సుజుకీ వాహనాలను అధిగమించి.. 2024 లో బెస్ట్​ సెల్లింగ్​ కారుగా నిలిచింది. దీంతో మారుతి సుజుకీ కూడా సెకండ్ ప్లేస్‎కు పడిపోయింది. ఇలా జరగడం మారుతి సుజుకీ హిస్టరీలో అదే తొలిసారి. అయితే ఇటీవల ఫిబ్రవరి కార్ల అమ్మకాల గణాంకాలను ఆటోమొబైల్ తయారీ కంపెనీలు విడుదల చేశాయి.

Tata Nexon

ఈ గణాంకాల్లో టాటా మోటార్స్ ఆశాజనకమైన ఫలితాలు వెల్లడించలేదు. ఫిబ్రవరిలో టాటా మోటార్స్ విక్రయించిన కార్ల సంఖ్య 46,435. గతేడాది ఫిబ్రవరిలో అమ్ముడైన 51,267 కార్లతో పోలిస్తే ఇది 9.43 శాతం తగ్గుదల. ఇప్పటివరకు హ్యుందాయ్ రెండో స్థానానికి సవాల్ విసిరిన టాటా.. మహీంద్రా కంటే కూడా వెనుకబడిపోయింది. మహీంద్రా ఫిబ్రవరిలో హ్యుందాయ్‌ను అధిగమించి సెకండ్ ప్లేసులో నిలిచింది. ఫిబ్రవరిలో టాటా మోడల్ వారీగా అమ్మకాలను ఓ సారి చూద్దాం.

2024లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు టాటా పంచ్. ఎలక్ట్రిక్ వెర్షన్ విడుదల కావడంతో మైక్రో SUV దేశంలో ఒక నెలకు పైగా నంబర్ 1గా ఈ మోడల్ నిలిచింది. ఇటీవల పంచ్ అమ్మకాలు స్వల్పంగా తగ్గుతున్నాయి. దీనితో నెక్సాన్ మరోసారి బ్రాండ్ బెస్ట్ సెల్లర్‌గా మారిపోయింది. ఫిబ్రవరి 2025లో పంచ్‌ను అధిగమించి ఫస్ట్ ప్లేస్ కు చేరుకుంది. ఫిబ్రవరిలో కంపెనీ మొత్తం కార్ల అమ్మకాలకు టాటా నెక్సాన్ దోహదపడింది.

Tata Punch Model

ఫిబ్రవరిలో 15,349 యూనిట్ల నెక్సాన్ SUVలను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే 6.63 శాతం వృద్ధిని సాధించింది. ఫిబ్రవరి 2024లో 4 మీటర్లలోపు SUVల అమ్మకాలు 14,395 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి 2025లో మొదటి స్థానంలో ఉన్న పంచ్ ఫిబ్రవరిలో రెండవ స్థానానికి పడిపోయింది. ఫిబ్రవరిలో టాటా ఎలక్ట్రిక్ వాహనాలతో సహా 14,569 యూనిట్ల పంచ్ కార్లను విక్రయించింది. గతేడాది ఫిబ్రవరిలో పంచ్ విక్రయాలు 18,438యూనిట్లు. గతేడాదితో పోలిస్తే 21.04శాతం తగ్గాయి.

టాటా మూడవ బెస్ట్ సెల్లింగ్ మోడల్ టియాగో. ఈ కాలంలో టాటా టియాగో మొత్తం 6,954 యూనిట్లు విక్రయించింది. ఈ అమ్మకాలతో టియాగో 0.10 శాతం వృద్ధి నమోదు చేసింది. ఫిబ్రవరి 2024తో పోలిస్తే 7 యూనిట్లు ఎక్కువగా విక్రయించింది. టాటా కర్వ్ అమ్మకాల్లో నాల్గవ స్థానంలో ఉంది. ఫిబ్రవరి 2025లో టాటా కర్వ్ SUV కూపే 3,483 యూనిట్లను అమ్మింది. గతేడాది ఆ కారు మార్కెట్లోకి రాలేదు.

Tata s Top Selling Model

ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 1604 కొత్త కస్టమర్లను సంపాదించుకుని ఈ జాబితాలో ఐదో బెస్ట్ సెల్లింగ్ టాటా కారుగా అవతరించింది. ఏడాది క్రితం 4,568 యూనిట్లు అమ్ముడైన ఆల్ట్రోజ్ 64.89 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ అమ్మకాల జాబితాలో టాటా సఫారీ ఆరో స్థానంలో ఉంది. ఈ కాలంలో టాటా సఫారీ మొత్తం 1,562 యూనిట్ల SUVలను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 41శాతం తగ్గుదల అన్నట్లు.

ఈ అమ్మకాల జాబితాలో టాటా టిగోర్ ఏడో స్థానంలో ఉంది. ఈ కాలంలో టాటా టిగోర్ మొత్తం 1,550 యూనిట్లను విక్రయించింది. కాంపాక్ట్ సెడాన్ల అమ్మకాలు 9.46శాతం తగ్గాయి. హారియర్ SUV జాబితాలో అట్టడుగున ఉంది. టాటా ఫిబ్రవరిలో 46.29 శాతం క్షీణతతో 1376 హారియర్స్‎ను మాత్రమే అమ్మగలిగింది.

భారత మార్కెట్లో టాటా నెక్సాన్ ప్రారంభ ఎక్స్-షోరూం ధర రూ.8లక్షల నుంచి రూ.14.70లక్షల వరకు ఉంటుంది. మన దేశంలో నాలుగు పవర్ ట్రెయిన్ ఆఫ్షన్లలో కొనుగోలు చేయగల ఏకైక కారు టాటా నెక్సాన్ మాత్రమే. ఈ కారు పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఆఫ్షన్లలో లభిస్తుంది. గతేడాది టాటా భారత్ మొట్టమొదటి టర్బో-CNG కారు అయిన నెక్సాన్ సీఎన్జీని విడుదల చేసింది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 11, 2025, 13:40 [IST]
English summary
Tatas nexon overtakes punch as best selling model in february a surprising shift in sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+