టాటా అంటే స్ట్రాంగ్ అని మరోసారి ప్రూఫ్ అయింది.. ఏకంగా టన్నుల ట్యాంక్‌ను లాగేసిన హారియర్ EV!

భారతదేశ ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ ఏదైనా కొత్త మోడల్ మార్కెట్లోకి తీసుకుని వస్తుందంటే చాలు పోటీ కంపెనీలు భయపడిపోతుంటాయి. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసే ప్రమోట్ వీడియోలు ఆ రేంజ్‎లో ఉంటాయి మరి. టాటా హారియర్ ఈవీని లాంచ్ చేయడానికి ముందు, ఈ బ్రాండ్ ఒక ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేసింది.

అందులో ఒక ఈవీ కారు కొండను ఎక్కుతుంది. దీనిని చూసిన తర్వాత అందరూ షాకయ్యారు. ఎందుకంటే కేరళలోని ఒక ఎత్తైన కొండను ఒక ఈవీ కారు ఎక్కడం అనేది అసలు ఊహించడానికి కూడా కష్టం. అలాంటిది అనమలై వంటి కొండను హారియర్ ఈవీ అవలీలగా ఎక్కేసింది.

Tata Harrier EV

తాజాగా బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో నిర్వహించిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రమోషనల్ ఈవెంట్లో టాటా హారియర్ ఈవీ 23టన్నుల బుల్లెట్ ప్రూఫ్ ట్యాంక్‌ను ఈజీగా లాగుతూ వెళ్ళిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కలిసి అభివృద్ధి చేసిన WHAP 8X8అనే 23-27టన్నుల బరువున్న ప్రోటోటైప్ ట్యాంక్‌ను హారియర్ ఈవీ అవలీలగా లాగేయడం వీడియోలో చూడవచ్చు.

టాటా హారియర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రూ.21.49 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చింది. అయితే, ఇది బేసిక్ ప్రైస్ మాత్రమేనని, తర్వాత మారే అవకాశం ఉందని కంపెనీ స్పష్టంగా తెలిపింది. acti.ev ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించిన ఈ ఈవీకి ఆల్‌వీల్ డ్రైవ్ ఫీచర్ కూడా ఉంది. టాటా వెహికల్స్ చాలా కాలం తర్వాత ఈ ఫీచర్ మళ్లీ రావడం విశేషం.

Tata Harrier EV

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బుకింగ్‌లు జూలై 2 నుంచి ప్రారంభమవుతాయి. మహీంద్రా XUV.e9 వంటి మోడళ్లతో హారియర్ ఈవీ పోటీపడుతుంది. అంతేకాకుండా, ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో వంటి టాప్ సెల్లింగ్ మోడళ్లకు కూడా హారియర్ ఎలక్ట్రిక్ రాక ఒక పెద్ద సవాలే. డిజైన్ పరంగా, హారియర్ ఈవీ, టాటా హారియర్ డీజిల్ వెర్షన్ లాగానే కనిపిస్తుంది.

ఇది కరెంటుతో నడిచే కారు అని చెప్పడానికి ఈవీ-నిర్దిష్ట డిజైన్ వివరాలు కూడా ఎక్స్‌టీరియర్‌లో చూడవచ్చు. ముందు భాగంలో, ఏరోడైనమిక్ కెపాసిటీ కోసం క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్ ఉంది. దీని కింద బ్యాటరీ ప్యాక్, మోటార్‌లను కూల్ చేసేందుకు ముందు బంపర్‌లో నిలువుగా ఉండే సాటిన్ సిల్వర్ స్లాట్స్‌ ఉపయోగించారు.

Tata Harrier EV

స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, కనెక్టెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్స్ హారియర్ ఈవీ ప్రీమియం లుక్‌ను మరింత పెంచుతున్నాయి. పక్క నుంచి చూస్తే ఏరోడైనమిక్ స్టైల్‌లో ఉన్న పెద్ద 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ మెయిన్ అట్రాక్షన్. ఫ్లష్-స్టైల్ డోర్ హ్యాండిల్స్ వంటి చిన్నపాటి జిమ్మిక్కులు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో లేవు. వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్‌లైట్ సెటప్ హైలైట్‌గా చెప్పవచ్చు.

కారు ఇంటీరియర్ విషయానికి వస్తే డ్యుయల్-టోన్ ఇంటీరియర్ ఫినిష్ ప్రీమియం ఎక్స్‎పీరియన్స్ అందజేస్తుంది. సెలక్ట్ చేసుకునే వేరియంట్లను బట్టి కలర్స్ మారుతాయి. 10.25 ఇంచుల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు, కొత్త 14.5 అంగుళాల శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే , ఇన్-బిల్ట్ మ్యాప్స్‌తో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి మెయిన్ ఫీచర్స్.

నార్మల్, శాండ్, మడ్ రట్స్, స్నో/గ్రాస్, రాక్ క్రాల్, కస్టమ్ వంటి ఆరు వేర్వేరు టెర్రైన్ మోడ్‌లను ఎంచుకోవడానికి కొత్త రొటరీ డయల్ కూడా ఉంది. టాటా హారియర్ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు, రెండు మోటార్ కాన్ఫిగరేషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. హారియర్ ఈవీ తక్కువ వేరియంట్‌లు 65 kWh బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉంటాయి. టాప్ వేరియంట్‌లకు 75 kWh బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టాటా హారియర్ ఈవీ ప్రమోషనల్ స్టంట్స్, దాని అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆల్‌వీల్ డ్రైవ్ ఫీచర్, లేటెస్ట్ ఇంటీరియర్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్‌లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 23 టన్నుల ట్యాంక్‌ను లాగిన వీడియో దాని పవర్ స్పష్టంగా కనిపిస్తుంది. పోటీదారులకు ఇది నిజంగా పెద్ద సవాల్ అని చెప్పొచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, June 19, 2025, 11:08 [IST]
English summary
Tatas shocking move rivals stunned harrier ev tows a 23ton tank
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+