టాటా, టెస్లా కలిసి మహీంద్రాను దెబ్బ తీస్తాయా.. ఫ్యూచర్ పరిస్థితి ఏంటి ?

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి రెడీ అవుతోంది. ఈ సారి టెస్లాకు భారతీయ దిగ్గజం టాటా మోటార్స్ తోడైంది. టెస్లా, టాటా మోటార్స్ భాగస్వామ్యం భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పెను మార్పులకు నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రారంభంలో టాటా టెక్నాలజీస్ టెస్లాకు ఎండ్-టు-ఎండ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్‌ను అందించనుంది. టెస్లా వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, మోటార్ కంట్రోలర్ యూనిట్స్, డోర్ కంట్రోల్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీస్ వంటి కీలక సాంకేతిక పరిజ్ణానాన్ని టాటా ఎలక్ట్రానిక్స్ స్థానికంగా అందించబోతుంది.

Tesla Showroom

టెస్లా మహారాష్ట్రలోని పూణేలో తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆసక్తిని కనబరుస్తుంది. దీనికి ప్రధాన కారణం పూణేలో టాటాకు ఇప్పటికే కార్యాలయాలు, సరఫరా వ్యవస్థ ఉండటమే. అంతేకాకుండా, పూణే ఆ పట్టణ పరిసర ప్రాంతాలు దేశంలో ప్రధాన ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా మారుతున్నాయి.

అలాగే చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని టెస్లా కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం టెస్లాకు అతిపెద్ద తయారీ కేంద్రం చైనాలోని షాంఘై నగరంలో ఉంది. ఇక్కడి ప్లాంట్ ఏడాదికి 7,50,000 కార్లను తయారు చేయగల కెపాసిటీని కలిగి ఉంది.

Tata Join India

టెస్లా రాక భారతీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అతి పెద్ద మార్పులకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. టెస్లా, టాటా చేతులు కలపడం వల్ల ఈ ఇద్దరి పార్టనర్ షిప్ తిరుగులేని శక్తిగా మారుతుందని భావిస్తున్నారు. మహీంద్రా వంటి ఇతర ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఈ భాగస్వామ్యం గట్టి పోటీని ఇవ్వనుంది.

మరోవైపు, టాటా మోటార్స్ తమ ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ మోడల్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ మోడల్‌లో ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Tesla Tata

ప్రస్తుతం ఆల్ట్రోజ్ బంపర్ దిగువ భాగంలో డీఆర్ఎల్‌లు ఉన్నాయి. అయితే, ఫేస్‌లిఫ్ట్‌లో ఇవి పైకి మార్చబడే అవకాశం ఉంది. హెడ్‌లైట్ల స్వెప్ట్‌బ్యాక్ డిజైన్ అలాగే ఉంటుంది. ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను కిందకు మార్చి, బంపర్‌కు మరింత షార్ప్ లుక్ ఇవ్వనుంది టాటా కంపెనీ.

సైడ్ ప్రొఫైల్‌లో కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి. వెనుక భాగంలో స్లిమ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ మెయిన్ ఎట్రాక్షన్ గా నిలువనున్నాయి. ఫేస్‌లిఫ్ట్ ఆల్ట్రోజ్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది.

భవిష్యత్తులో టెస్లా, టాటా భాగస్వామ్యం భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. మహీంద్రా వంటి ఇతర ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇది గట్టి పోటీని ఇవ్వనుంది. టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల కూడా భారతీయ మార్కెట్లో హాట్ టాపిక్ కానుంది.

Tesla Car

టెస్లా దేశంలోని ప్రధాన నగరాల్లో షోరూమ్‌లను తెరవడానికి యోచిస్తోంది. ఢిల్లీ, ముంబైలో షోరూమ్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది అని కథనాలు వస్తున్నాయి. టెస్లా కార్ల విక్రయాలు ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమవుతాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. భారతదేశంలో టెస్లా కార్ల ధరలు ఇతర కంపెనీలకు పోటీగా ఉండేలా చూడాలని కంపెనీ భావిస్తోంది.

రూ. 22 లక్షల లోపు విద్యుత్ కార్లను భారత్‌లో విక్రయించేందుకు సంస్థ నిర్ణయించింది అని కొన్ని వార్తా కథనాలు చెబుతున్నాయి. అయితే, నివేదికల ప్రకారం టెస్లా కార్ల ధరలు రూ. 35-40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. భారత ప్రభుత్వ EV పాలసీల ప్రకారం, టెస్లా ఇండియాలోతయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే దిగుమతి సుంకాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 26, 2025, 6:10 [IST]
English summary
Tesla and tata join forces for a game changing ev partnership in india puts pressure on mahindra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+