టెస్లా కారు ఈ ధరలో అమ్మకానికి ఉండే అవకాశం..? ఇక జనాలు లైన్‌లో నిలబడి మరి కొనేస్తారు!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్ ఇప్పుడు అతిపెద్ద గమ్యస్థానంగా మారింది. ఇక్కడ చాలా ఈవీ తయారీదారులు తమ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. భారత్‌లో తయారైన కార్లను లోకల్ ప్రజలకు విక్రయిస్తూనే, అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయడానికి వాహన తయారీదారులు కీలకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో ఎంతో ప్రసిద్ధి చెందిన దిగ్గజ కంపెనీ టెస్లా(Tesla) చాలా కాలంగా భారత్‌లో అడుగుపెట్టాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. గతంలో ఇండియాలోకి తమ కార్లను తీసుకురావడంపై పన్నుల విషయంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మినహాయింపులు కోరడంతో కేంద్రం అందుకు ససేమిరా అనడంతో టెస్లా ఈవీ కార్లు భారత్‌లోకి రావడం నిలిచిపోయింది. కానీ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఈవీ నిబంధనలు టెస్లాకు కొంత అనుకూలంగా ఉండటంతో ఇక్కడ అడుగుపెట్టడానికి మార్గం సుగమం అయింది.

ఈ నేపథ్యంలో భారత్‌లో తన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి టెస్లా స్థలం ఎంపిక విషయంలో తర్జన భర్జన పడుతుంది. దీనిపై అతి త్వరలోనే ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కంపెనీ కార్ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన పనులు చూస్తూనే ఇక్కడ లోకల్ ఉద్యోగులను కూడా నియమించే పనిని సైతం చేపట్టింది. మొదటగా కంపెనీకి కీలకంగా వ్యవహరించే టాప్ పొజిషన్ ఉద్యోగులను నియమించుకుంటుంది.

Tesla Electric Car Will Launch Soon India

ఆ తర్వాత మిగిలిన ఉద్యోగుల నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. ఆ రెండు పనులను నిర్వహిస్తూనే మరోవైపు భారతదేశంలో కార్ల ఉత్పత్తిని ప్రారంభించక ముందే తన కార్ల అమ్మకాలను మొదలుపెట్టాలని చూస్తున్నట్లు మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ప్రపంచవ్యాప్తంగా టెస్లాకు కీలక ప్రాంతాల్లో కార్ల తయారీ ప్లాంట్‌లు ఉన్నాయి. వాటిలో నుంచి ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకోవాలని చూస్తుంది.

ప్రధానంగా జర్మనీలో పనిచేస్తున్న టెస్లా ప్లాంట్ నుంచి కార్లను భారత్‌లోకి దిగుమతి చేసి ఇక్కడి కస్టమర్లకు విక్రయిస్తారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఇదే సమయంలో భారత్‌లోకి కార్లను తీసుకొచ్చినట్లయితే ఎంత ధరకు వాటిని విక్రయిస్తారో అని చాలా కాలంగా అందరి మదిలో ఉన్న డౌట్. తాజాగా దీనికి సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఇది అధికారికమైనది కానప్పటికి ఇదే రేంజ్‌లో ఉండవచ్చని తెలుస్తుంది.

Modi And Elon Musk Tesla

నివేదికల ప్రకారం, టెస్లా తన ఎలక్ట్రిక్ కార్లను భారత్‌లో రూ.21 లక్షల ధరకు విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. టెస్లా ధర గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం ఇది నివేదికల సమాచారం మాత్రమే అని గమనించాలి. కానీ ఈ ధర గురించి ఇప్పుడు పుకార్లు ఎక్కువ అయ్యాయి. భారతదేశంలో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసే పని ఇంకా స్టార్టింగ్ దశలోనే ఉంది.

కాబట్టి ప్లాంట్‌లను ప్రారంభించి ఉత్పత్తిని మొదలుపెట్టడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోపే టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఇవే అని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కంపెనీ ప్రపంచ మార్కెట్లో మోడల్ 2 టెస్లా కారును 25,000 US డాలర్లకు విక్రయిస్తుంది. ఈ లెక్కన భారతదేశంలో దీని ఉత్పత్తి మొదలయితే కారు ధర రూ. 21 లక్షలలోపు ఉంటుందని అంచనా. త్వరలోనే దీనిపై మరింత సమాచారం వెలువడనుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

Article Published On: Friday, February 21, 2025, 9:10 [IST]
English summary
Tesla electric car will launch soon india starting price may be at rs 21 lakh
Read more on: #tesla #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+