పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతున్న టెస్లా... భారత్‌లో కింగ్ మేకర్ అయ్యేలా ప్లాన్స్!
ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా.. భారత మార్కెట్లో తమ వాహనాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య అనేక విషయాలపై చర్చలు జరిగాయి. ఇప్పుడు టెస్లా సంస్థ.. భారత్‌లో తమ కంపెనీ కోసం వివిధ ఉద్యోగాల ఆఫర్లను ప్రకటించింది. ఇది భారత్‌లో తమ ప్రస్థానాన్ని ప్రారంభించే ప్రక్రియలో ముందడుగుగా చెప్పవచ్చు. సోమవారం టెస్లా లింక్డ్‌ఇన్ పేజీలో ఈ మేరకు జాబ్ అడ్వటైజ్మెంట్స్ పోస్ట్ చేశారు. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
భారత మార్కెట్లో అధికారిక లాంచ్ కంటే ముందు స్ట్రాంగ్ సపోర్ట్, ప్రాసెసింగ్ టీమ్‌ను టెస్లా సంస్థ నిర్మించుకునే ప్రయత్నంలో ఈ జాబ్ ఆఫర్లను ప్రకటించింది. కస్టమర్-ఫేసింగ్, టెక్నికల్ పొజిషన్‌ల కోసం నియామకాలు జరుపుతోంది. దీన్నిబట్టి ఈ కంపెనీ సేల్స్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ నెట్వర్క్‌ను విస్తరించడం పై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. టెస్లా లింక్డ్‌ఇన్ పేజీలో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం 13 పొజిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఇందులో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ఆర్డర్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్, సర్వీస్ మేనేజర్, సేల్స్ అసోసియేట్ వంటి పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా సర్వీస్ టెక్నీషియన్, వివిధ కన్సల్టెంట్ పొజిషన్లు ఢిల్లీ, ముంబైలలో పనిచేసేందుకు ఆహ్వానిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే టెస్లా సంస్థ మెట్రోపాలిటన్ సిటీలలో తన అడుగు మోపాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. కస్టమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగాలు ప్రత్యేకంగా ముంబైలో మాత్రమే అన్నట్లుగా ప్రకటనలో పేర్కొంది.
భారత్‌లో టెస్లా సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడే కొత్త కాదు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ సంస్థ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ రంగం భారత్‌లో ఉన్నప్పటికీ.. భారత మార్కెట్లో అడుగు పెట్టే విషయంలో టెస్లాకు చాలా సందేహాలే ఉన్నాయి. దానికి కారణం.. అధిక దిగుమతి సుంకాలు అని చెప్పొచ్చు.

ఈ సుంకాలు టెస్లాకు పెద్ద అడ్డంకులుగా మారాయి. దీని గురించి మస్క్ గతంలో చాలా సార్లు స్పందించారు. అయితే భారత ప్రభుత్వం ఈ పన్నుల విషయంలో విషయంలో ఇప్పుడు కాస్త పట్టు సడలించినట్లు తెలుస్తోంది. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం భారీ పెట్టుబడి పెట్టే సంస్థల కోసం అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది టెస్లాకు కలిసివచ్చే అవకాశం.
2025 యూనియన్ బడ్జెట్లో.. 40,000 డాలర్ల కంటే అధిక ధర చేసే లగ్జరీ కారులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని(BCD) 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. టెస్లా వంటి ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలను ఆకర్షించే అంశంగా చెప్పవచ్చు. ఈ పన్ను తగ్గింపు టెస్లాకు భారీ ప్రయోజనం కల్పిస్తుంది. స్థానికంగా తయారు చేయడం కంటే ముందుగా కార్లను దిగుమతి చేసుకొని విక్రయించాలని టెస్లా సంస్థ భావిస్తోంది.

మోదీ-ఎలాన్ మస్క్ భేటీ జరిగిన వెంటనే ఈ జాబ్ అడ్వర్‌టైజ్మెంట్లను టెస్లా సంస్థ ప్రకటించడం ద్వారా భారత మార్కెట్లోకి ఈ సంస్థ అడుగు పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. భారత కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా.. గట్టి పునాదులు ఏర్పరచుకోవాలని టెస్లా ప్రయత్నిస్తోంది. ఈ సుంకాలను తగ్గించడం అటు టెస్లాతో పాటు భారత్‌కు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది భారత్ పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడానికి, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి తోడ్పడుతుంది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: టెస్లా భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలను చేపట్టుడుతుండడం ద్వారా భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కీలక నగరాలను ఆకర్షిస్తూ వివిధ ఆపరేషనల్ పొజీషన్ల కోసం చేపడుతున్న ఈ ప్రక్రియ ద్వారా భారత మార్కెట్లో రానున్న రోజుల్లో గట్టి ప్రభావం చూపించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








