ప్రపంచాన్ని గడగడలాడించిన టెస్లాకు షాక్ ఇచ్చిన భారతీయులు.. కేవలం 600 మాత్రమే!
భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం అతిపెద్ద గమ్యస్థానంగా మారిపోతోంది. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, పర్యావరణ కాలుష్యం అదుపులో ఉంచే అవసరం పెరిగిన నేపథ్యంలో, ఈవీలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. దేశీయ కంపెనీలు అయిన టాటా, మహీంద్రా మొదలైనవి ఇప్పటికే తమ ఫోకస్‌ను ఎలక్ట్రిక్ వాహనాలపైకి మళ్లించాయి. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈవీ కంపెనీలు కూడా భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రత్యేకంగా టెస్లా కంపెనీపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రాచుర్యం పొందేలా చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఇప్పుడు భారత మార్కెట్‌పై దృష్టి సారించారు.
టెస్లా కార్లు ఇండియాలో విజయవంతం కావడానికి తగిన ప్రణాళికలతో ముందుకు వస్తోంది. అయితే తాజాగా వచ్చిన బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ప్రకారం, జూలై మధ్యలో భారతదేశంలో అధికారికంగా అమ్మకాలు ప్రారంభించినప్పటి నుండి కంపెనీ ఇప్పటివరకు 600కి పైగా కార్లకు ఆర్డర్లు స్వీకరించింది. అయితే, ఈ సంఖ్య టెస్లా అంచనాలకు పూర్తిగా సరిపోలేదని సమాచారం. కంపెనీ మొదట అనుకున్నంతగా ఆర్డర్లు రాకపోవడం గమనార్హం.

టెస్లా ఈ ఏడాది 350 నుండి 500 కార్లను భారతదేశానికి రవాణా చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. వీటిలో తొలి బ్యాచ్ సెప్టెంబర్ ప్రారంభంలో చైనాలోని షాంఘై ఫ్యాక్టరీ నుండి ఇండియాకు చేరుకోనుంది. మొదటి దశలో డెలివరీలు ముంబై, ఢిల్లీ, పూణే, గురుగ్రామ్ నగరాలకు మాత్రమే పరిమితం కానున్నాయి. ఈ నగరాల్లో మౌలిక సదుపాయాలు, ఛార్జింగ్ స్టేషన్లు కొంతవరకు సిద్ధంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సాధారణంగా టెస్లా ప్రపంచవ్యాప్తంగా కేవలం నాలుగు గంటల్లోనే 600 కార్లను విక్రయిస్తుంది. కానీ, భారత్‌లో ఒకటిన్నర నెల గడిచినా అదే సంఖ్యలో బుకింగ్స్ రావడం మార్కెట్ వైఖరిని స్పష్టంగా చూపిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం, టెస్లా భారత్‌లో విజయవంతం కావాలంటే ధరలు అందుబాటులో ఉండడం, విస్తృతంగా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి రావడం అత్యవసరం. లేకపోతే మొదటి దశలో వచ్చిన ఈ తగ్గిన స్పందన భవిష్యత్ అమ్మకాలపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, టెస్లా తన మోడల్ Y ఎలక్ట్రిక్ SUVని రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. మోడల్ Y స్టాండర్డ్ RWD వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్ రేంజ్ RWD వేరియంట్ ధర రూ. 67.89 లక్షలుగా నిర్ణయించారు. అయితే, ఈ భారీ ధరలే ప్రస్తుతం భారత వినియోగదారులను కొంత వెనక్కి నెడుతున్న ముఖ్య కారణంగా భావిస్తున్నారు.
ఈ SUVలో రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లు 60 kWh, 75 kWh ఉన్నాయి. వీటితో పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు, మోడల్ Y 500 కి.మీ నుండి గరిష్టంగా 622 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఇది WLTC ప్రమాణాల ప్రకారం ప్రకటించబడిన రేంజ్, అంటే ప్రాక్టికల్ యూజ్‌లో కూడా డ్రైవర్స్‌కు తగినంత సౌకర్యం కలిగే అవకాశం ఉంది. టెస్లా ప్రత్యేకంగా ట్యూన్ చేసిన శక్తివంతమైన మోటార్లతో ఈ SUV వస్తోంది.

ఇది గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. కేవలం 6.9 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. ఈ పరఫార్మెన్స్ స్థాయిలో ఇది కొన్ని స్పోర్ట్స్ కార్లను కూడా తలదన్నగలదు. డిజైన్, టెక్నాలజీ పరంగా మోడల్ Y ఎలాంటి సందేహం లేకుండా బెస్ట్. అయితే, దాని అధిక ధరలు, భారత్‌లో ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని EV ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారణంగా వినియోగదారులు కొంత ఆలోచనలో పడుతున్నారు.


Click it and Unblock the Notifications








