ఇండియాలో మొదటి టెస్లా మోడల్ Y గురించి మీరు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి మారుపేరు అయిన టెస్లా (Tesla), ఎట్టకేలకు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ యాజమాన్యంలో నడుస్తున్న ఈ కంపెనీ, భారతదేశానికి తన తొలి అడుగును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వేసింది. ముంబై నగరంలో ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని మాక్స్‌సిటీ మాల్‌లో, టెస్లా తమ దేశంలోనే మొదటి కార్ షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ ప్రారంభ కార్యక్రమం ఎంతో సందడిగా సాగింది. ఈ సందర్భంగా, టెస్లా భారత్ మార్కెట్లో అమ్మకానికి తీసుకొచ్చిన మొదటి కారు మోడల్ Y (Model Y) ఎలక్ట్రిక్ SUV. ఈ మోడల్ Y ఎలక్ట్రిక్ SUV ధర, ఫీచర్లు,ఇతర స్పెసిఫికేషన్లకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను కంపెనీ వెల్లడించింది. ఆయా వివరాలను ఈ కథణంలో చూద్దాం.

ధర: టెస్లా మోడల్ Y భారత మార్కెట్‌లో మొదటి అడుగును ప్రీమియం క్లాస్ ఎలక్ట్రిక్ SUVగా వేసింది. కారును రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టాండర్డ్ RWD వేరియంట్‌ రూ. 59.89 లక్షలు కాగా, లాంగ్ రేంజ్ RWD వేరియంట్‌కి రూ. 67.89 లక్షలుగా నిర్ణయించారు. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. స్టాండర్డ్ వేరియంట్‌ ప్రీమియంగా కనిపిస్తుంటే, లాంగ్ రేంజ్ మోడల్‌ లాంగ్-డ్రైవ్ లవర్స్‌కు మరింత అనుకూలంగా ఉంటుంది.

Tesla India Model Y Launch

బ్యాటరీ అండ్ పనితీరు: మోడల్ Y ఎలక్ట్రిక్ SUV నిజంగా అధునాతనంగా రూపొందించబడింది. కేవలం ఆకర్షణీయమైన డిజైన్ మాత్రమే కాదు, శక్తివంతమైన పవర్‌ట్రెయిన్, బ్యాటరీ కాంబినేషన్‌ను కలిగి ఉండటంతో, దీని పనితీరు టాప్ క్లాస్ స్థాయిలో ఉంటుంది. ఈ కారులో 60 kWh, 75 kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్‌లు అందించబడతాయి. ఈ రెండు వేరియంట్లలో శక్తివంతమైన పవర్ అందే విధంగా ట్యూన్ చేయబడిన మోటార్లు ఉంటాయి.

పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే, ఈ SUV 500 కి.మీ నుండి 622 కి.మీ వరకు ప్రయాణించగలదు, ఇది WLTC ప్రమాణాల ప్రకారం ప్రకటన. స్పీడ్ పరంగా చూస్తే, టెస్లా మోడల్ Y గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. అంతే కాకుండా, ఇది కేవలం 6.9 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగం అందుకుంటుంది, ఇది పెర్ఫామెన్స్ పరంగా స్పోర్ట్స్ కార్లను తలపించే స్థాయిలో ఉంది.

Tesla India Model Y In Mumbai

సీటింగ్ కెపాసిటీ: టెస్లా మోడల్ Y, తన క్లాస్‌లోనే అత్యుత్తమ అనుభూతిని అందించే విధంగా డిజైన్ చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ SUV విశాలమైన 5 సీటర్ల కాన్ఫిగరేషన్‌తో వస్తుంది, ఇది కేవలం డైలీ ప్రయాణాలకు మాత్రమే కాకుండా, లాంగ్ ట్రిప్స్ కోసం కూడా ప్రయాణికులకు పూర్తి సౌకర్యాన్ని అందిస్తుంది.ఇంటీరియర్ స్పేస్ ఎక్కువగా ఉండటంతో, ప్రతి సీటులో కూర్చునే వారికి తగినంత లెగ్‌రూమ్, హెడ్రూమ్ లభిస్తుంది.

బూట్ స్పేస్: ఇది 854 లీటర్ల భారీ బూట్ సామర్థ్యాన్ని అందిస్తుంది, దీని ద్వారా వారాంతపు టూర్స్, లాంగ్ జెర్నీలు, లేదా సెలవుల్లో ఎక్కువ లగేజీ తీసుకెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫ్యామిలీ ట్రావెల్ కోసం, లేదా స్నేహితులతో వెకేషన్ ప్లాన్‌ కోసం ఇదొక అద్భుతమైన ఎంపికగా మారుతుంది. పర్యటనలో మీరు వెంట తీసుకెళ్లే సామాన్లను హాయింగా వెనక పెట్టుకోవచ్చు.

Tesla India Model Y Showroom

ఫీచర్స్: ఈ కారులో డజన్ల కొద్ది అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉంటాయి. లోపల 15.4 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా కారులోని అన్ని ఫంక్షన్‌లను నావిగేషన్, మీడియా, కార్ సెట్టింగులు మొదలైనవి నియంత్రించవచ్చు. అలాగే, టెస్లా ప్రత్యేకత అయిన ఆటోపైలట్ సిస్టమ్ కూడా ఇందులో లభిస్తుంది. ఇది డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా, తెలివిగా మారుస్తుంది. రెగ్యులర్‌గా వచ్చే ఓవర్-ది-ఎయిర్(OTA) అప్‌డేట్‌లు ద్వారా కార్ ఫీచర్లు మెరుగవుతూనే ఉంటాయి.

అంటే కొనుగోలు చేసిన తరువాత కూడా కొత్త ఫీచర్లు మీ కార్‌లోకి వస్తూనే ఉంటాయి. ఇంకా వెంటిలేటెడ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, 9-స్పీకర్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, AQI మానిటరింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఆధునిక టెక్నాలజీలు ప్రయాణాన్ని మరింత స్మార్ట్‌గా మార్చేస్తాయి. కేవలం ట్రాన్స్‌పోర్ట్ మాధ్యమంగా కాకుండా, ఒక ఇంటెలిజెంట్ మొబిలిటీ హబ్ లాగా ఇది ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 15, 2025, 18:38 [IST]
English summary
Tesla india model y electric car all top things full details inside
Read more on: #tesla #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+