ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది.. టెస్లా నుంచి చౌక కారు వచ్చేసింది.. గెట్ రెడీ బాయ్స్

ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా. ఈ కార్లు కొనాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలనే అపవాద ఉంది. దీంతో తన ఉత్పత్తులను ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే టెస్లా కార్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ అయిన మోడల్ Y(Model Y)లో మోడల్ Y స్టాండర్డ్ అనే కొత్త, చౌకైన వేరియంట్‌ను గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది.

ఈ కొత్త మోడల్ ధర 41,630డాలర్లు (మన కరెన్సీలో రూ.34.7లక్షలు)గా నిర్ణయించారు. ఇది పాత మోడల్ ధర కంటే సుమారు 5,000డాలర్లు(రూ.4.2 లక్షలు) వరకు తక్కువ. ఈ ధర తగ్గింపు వల్ల టెస్లా ముఖ్యంగా చైనాకు చెందిన అయిన BYD లాంటి కంపెనీల నుండి వస్తున్న తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.

Tesla Launches Cheaper Model Y Standard Price Starts at 41 630 with Key Design Changes

డిజైన్, క్యాబిన్ ఫీచర్లలో మార్పులు
కొత్త మోడల్ Y స్టాండర్డ్ ధరను అదుపులో ఉంచేందుకు టెస్లా డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లలో కొన్ని కీలక మార్పులు చేసింది. బయట నుంచి చూస్తే ఈ కారు పాత మోడల్ లాగే లేటెస్ట్ లుక్‌ను కొనసాగిస్తుంది.

రూఫ్, సీట్లు: పాత మోడల్లో ఉన్న పనోరమిక్ గ్లాస్ రూఫ్‌కు బదులుగా, ఈ కొత్త వేరియంట్‌లో సాలిడ్ మెటల్ రూఫ్‌ను అమర్చారు. ఇది లోపల టెంపరేచర్ కంట్రోల్ (ఇన్సులేషన్) కోసం బాగా సహాయపడుతుంది. లోపల లెదర్ సీట్ల స్థానంలో ఫ్యాబ్రిక్ సీట్లను అందించారు.

కొన్ని ఫీచర్ల కోత : సౌకర్యాన్ని పెంచే కొన్ని ఫీచర్లను ఈ మోడల్లో తొలగించారు. ఇందులో స్టీరింగ్‌ను మాన్యువల్‌గా మాత్రమే అడ్జస్ట్ చేయగలగడం, ముందు సీట్లలో వెంటిలేషన్ లేకపోవడం ముఖ్యమైనవి. అలాగే, వెనుక సీట్ల హీటింగ్ ఫీచర్, వెనుక వారికి ప్రత్యేకంగా ఉండే 8.0 ఇంచుల స్క్రీన్ కూడా తీసేశారు.

Tesla Launches Cheaper Model Y Standard Price Starts at 41 630 with Key Design Changes

టెక్నాలజీ మాత్రం అదే: కొత్త మోడల్లో ఈ మార్పులు ఉన్నప్పటికీ, కారులోని మెయిన్ కంట్రోలర్ అయిన 15.4 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ అలాగే ఉంది, ఇది పూర్తి టెస్లా టెక్నాలజీ అనుభూతిని ఇస్తుంది.

పర్ఫామెన్స్, రేంజ్
ధర తక్కువగా ఉన్నప్పటికీ, టెస్లా కారు పర్ఫామెన్స్ విషయంలో రాజీ పడలేదు. ఈ మోడల్ Y స్టాండర్డ్ కూడా వేగవంతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ ఎస్‌యూవీలో సింగిల్ రియర్ మోటార్, 69.5 kWh బ్యాటరీ ఉన్నాయి. ఇది సుమారు 300 హార్స్‌పవర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది.

Tesla Launches Cheaper Model Y Standard Price Starts at 41 630 with Key Design Changes

రేంజ్, స్పీడు : టెస్లా కంపెనీ చెప్పిన దాని ప్రకారం.. ఈ కారు ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 517 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. అంతేకాకుండా, ఇది కేవలం 6.8 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ టాప్ స్పీడు అందుకుంటుంది. ఇది సాధారణ ఎస్యూవీలతో పోలిస్తే చాలా వేగవంతమైంది.

ప్రస్తుతం భారత్‌లో లభించే లాంగ్ రేంజ్ మోడల్ Y సుమారు 574 కి.మీ రేంజ్ ఇచ్చి 5.7 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అయితే, దాని ధర సుమారు రూ.71.71 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతానికి మోడల్ Y స్టాండర్డ్ గ్లోబల్ మార్కెట్‌లోనే అందుబాటులో ఉంది. ఈ చౌకైన మోడల్ భారత్‌కు వస్తుందా లేదా అనే దానిపై టెస్లా ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు.

టెస్లా అనేక సంవత్సరాల నిరీక్షణ తర్వాత అధికారికంగా జూలై 15, 2025న భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. తమ షోరూమ్‌లను ఎక్స్‌పీరియన్స్ సెంటర్లుగా వ్యవహరిస్తోంది. టెస్లా మొదటగా ముంబైలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత అతి త్వరలోనే ఢిల్లీలో రెండో షోరూమ్‌ను కూడా తెరిచింది.

ముంబైలోని ప్రముఖ వ్యాపార ప్రాంతమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‎లోని మేకర్ మ్యాక్సిటీ మాల్‌లో టెస్లా తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. మొదటిగా ఇక్కడ టెస్లా మోడల్ Y ప్రదర్శనకు ఉంచింది.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న ఏరోసిటీలోని వరల్డ్‌మార్క్ 3లో టెస్లా తన రెండవ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ షోరూమ్‌లో కస్టమర్‌ల కోసం ఛార్జింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతానికి టెస్లా తమ అమ్మకాలు, బుకింగ్‌లను ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్ నగరాలలో మొదలు పెట్టింది. ఈ రెండు ప్రధాన నగరాలతో పాటు, టెస్లా భవిష్యత్తులో హైదరాబాద్, పూణే, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్ వంటి ఇతర ముఖ్య నగరాల్లో కూడా తమ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను, షోరూమ్‌లను విస్తరించాలని యోచిస్తోంది. టెస్లా ప్రస్తుతం భారతదేశంలో దిగుమతి చేసుకున్న మోడల్ Y ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 8, 2025, 11:36 [IST]
English summary
Tesla launches cheaper model y standard price starts at 41 630 with key design changes
Read more on: #tesla #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+