టెస్లా మాస్టర్ ప్లాన్.. నెమ్మదిగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న షోరూంలు.. మూడో షోరూం ఎక్కడంటే ?
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న టెస్లా ఇప్పుడు భారత్‌లో వేగంగా తన అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముంబైలో మొదటి షోరూమ్ ప్రారంభించిన టెస్లా, ఢిల్లీలో రెండో షోరూమ్ తెరవడానికి సిద్ధంగా ఉంది.. ఇక ఇప్పుడు మూడో షోరూమ్‌కు కూడా స్థలాన్ని ఎంపిక చేసుకుంది. ఈ కొత్త షోరూమ్ ఎక్కడ వస్తుంది, దానికి అద్దె ఎంత అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టెస్లా తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో తమ మొదటి షోరూమ్‌ను ప్రారంభించిన టెస్లా, త్వరలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర ఉన్న ఏరో సిటీలో రెండో షోరూమ్‌ను షోరూమ్‌ను ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ షోరూమ్ ఆగస్టు 11న ఓపెన్ కానుంది.

దీని తర్వాత మూడో షోరూమ్‌ను కూడా సిద్ధం చేయడం విశేషం. మూడో షోరూమ్ కోసం గురుగ్రామ్‌లోని సోహ్నా రోడ్‌లో ఉన్న ఆర్కిడ్ బిజినెస్ పార్క్లో ఒక స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ షోరూమ్ కోసం సుమారు 51,000 చదరపు అడుగుల స్థలం తీసుకున్నారు. ఈ స్థలం కోసం కంపెనీ ఏకంగా 9 సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకుంది.
ఇది కేవలం షోరూమ్ మాత్రమే కాకుండా సర్వీస్ సెంటర్, డెలివరీ హబ్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఈ స్థలానికి టెస్లా నెలకు దాదాపు రూ.40 లక్షల అద్దె చెల్లించనుంది. అంతేకాకుండా, రూ.2.41 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించింది. ఈ అద్దెలో 51 పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. లీజు ఒప్పందం జూలై 15 నుంచి అమల్లోకి వచ్చింది.

ప్రతి నెల 7వ తేదీన అద్దె చెల్లించే విధంగా ఒప్పంద పత్రాలు సిద్ధం చేశారు. డాక్యుమెంట్ల కోసం రూ.20.69 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఈ ఒప్పందం సన్‌సిటీ రియల్ ఎస్టేట్ ఎల్‌ఎల్‌పి, ఆర్కిడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గర్వాల్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలతో జరిగింది.
టెస్లా గురుగ్రామ్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం అది ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా ఉండటమే. ఈ ప్రాంతంలో వ్యాపార సంస్థలు, టెస్లా కార్లను కొనుగోలు చేయగలిగే సంపన్న కస్టమర్లు ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతం ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలో ఉండటం వల్ల కూడా టెస్లాకు ఎక్కువ మంది కస్టమర్లకు చేరువయ్యే అవకాశం లభిస్తుంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ప్రస్తుతం టాటాదే పైచేయి. కానీ, టెస్లా లాంటి అంతర్జాతీయ దిగ్గజం భారతదేశంలోకి రావడం టాటాకు పెద్ద సవాల్‌గా మారనుంది. గురుగ్రామ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం, అది ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా ఉండటమే. ఈ వేగవంతమైన విస్తరణను బట్టి చూస్తే, టెస్లా భవిష్యత్తులో భారతదేశంలో పెద్ద మార్కెట్‌ను కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని అర్థమవుతోంది. ఇది ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు శుభవార్తే.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, టెస్లా ఈ వ్యూహాత్మక కదలికలతో మార్కెట్‌లో తన పట్టును పెంచుకోవాలని చూస్తోంది. ఇది టాటా మోటార్స్ వంటి దేశీయ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగలదని అంచనా.


Click it and Unblock the Notifications








