అమెరికాలో సంచలనం! డ్రైవర్ లేకుండా ఇంటికొచ్చి డెలివరీ అయిన కారు.. ఈ అద్భుత వీడియో చూశారా?
ప్రపంచంలోని ఆటోమొబైల్ రంగంలో ఒక ఆశ్చర్యకర సంఘటన ఇటీవల చోటు చేసుకుంది. సాధారణంగా కస్టమర్లు కారును కొనుగోలు చేసిన తరువాత దాన్ని డెలివరీ తీసుకోవడానికి షోరూమ్‌కు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంతో అట్టహసంగా షోరూమ్‌లో నిర్వహిస్తారు. కానీ కానీ అమెరికాలో టెస్లా ఆ విధానాలన్నింటినీ పూర్తిగా మార్చేసింది. ఇటీవల అక్కడ ఒక వినియోగదారు డీలర్‌షిప్‌కి వెళ్లకుండా, ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో కారును బుక్ చేసుకున్నాడు. ఆ కారు అతని దగ్గరికి స్వయంగా వచ్చి చేరింది. ఇది ఎటువంటి డ్రైవర్ సాయంలేకుండా, ఆటోమెటిక్‌గా గేట్‌దాటింది, రోడ్ల మీదుగా అతని ఇంటివరకు ప్రయాణించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.
ప్రపంచపు అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా (Tesla) టెస్లా అమెరికాలో పూర్తిస్థాయి ఆటోనమస్ ఫీచర్లతో కార్లను తయారు చేస్తోంది. ఈ కార్లు సెన్సర్లు, కెమెరాలు, శక్తివంతమైన ఏఐ సిస్టమ్ల సాయంతో పరిసరాలను అంచనా వేసి, ట్రాఫిక్‌లో నడుస్తాయి. డ్రైవర్ తన గమ్యం చేరేవరకు స్టీరింగ్ పట్టే అవసరమే లేదు. ఇలా సాంకేతికత అత్యున్నతను అభివృద్ధి చేసి టెస్లా అందిరిని ఆశ్చర్యపరుస్తుంది.

ప్రస్తుతం ఆటోనమస్ ఫీచర్లతో నడిచే కార్లను అమెరికాలో విక్రయిస్తున్నారు. ఇండియాలో మాత్రం ఇవి ఇంకా అమ్మకానికి అందుబాటులోకి రాలేదు. అమెరికాలో అక్కడి రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా తయారై కస్టమర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. డెలివరీలో సైతం టెస్లా తన టెక్నాలజీని ప్రపంచానికి చూపిస్తుంది. అక్కడ కారు కొనడానికి ఎవరూ షోరూమ్‌కి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇంటి నుంచి ఆన్‌లైన్ ద్వారా కారును ఆర్డర్ చేసుకోవచ్చు.
మరింత ఆశ్చర్యకరంగా, ఆ కారు ఎవరి సాయం లేకుండా ఆటోమేటిగ్గా సొంతంగా వచ్చి వినియోగదారుడి ఇంటి దగ్గర ఆగుతుంది. ఇలాంటి ఆటోనమస్ కార్లు అమెరికాలో పెద్దగా ప్రాచుర్యం పొందుతున్నాయి. భవిష్యత్తులో రవాణా వ్యవస్థను ఇవి పూర్తిగా మార్చేస్తాయని భావిస్తున్నారు. ఆసక్తికరంగా, భారతదేశంలో కూడా త్వరలో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇండియాలో చాలా కంపెనీలు "వెర్చువల్ షోరూమ్‌లు" ఏర్పాటుచేస్తూ, డిజిటల్ మోడ్ ద్వారా కార్లు విక్రయిస్తున్నాయి.

కానీ టెస్లా తీసుకువచ్చిన ఆటోనమస్ డెలివరీ స్థాయికి ఇది ఇంకా చాలా దూరంలో ఉంది. ఒకవైపు సంప్రదాయ పద్ధతులు కొనసాగుతుంటే, మరొకవైపు సాంకేతిక పరిణామాలు ఆటోమొబైల్ పరిశ్రమను కొత్త దిశగా తీసుకెళ్తున్నాయి. టెస్లా ఒక అడుగు ముందుకేసి, ఆటోమొబైల్ పరిశ్రమను మరో మైలురాయికి తీసుకెళ్లింది. సాధారణంగా, కారు డెలివరీ ఒక డ్రైవర్ లేదా ట్రాన్స్‌పోర్ట్ వాహనం సాయంతోనే జరుగుతుంది. కానీ ఈసారి, టెస్లా ఆ మానవ ప్రమేయాన్ని పూర్తిగా తొలగించింది.
వినియోగదారుని ఇల్లు టెస్లా కర్మాగారం నుండి సుమారు 30 నిమిషాల దూరంలో ఉంది. ఆర్డర్ పూర్తయిన తర్వాత, కేవలం కొన్ని సాఫ్ట్‌వేర్ కమాండ్లతో మోడల్ Y కారు స్వయంచాలకంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎటువంటి డ్రైవర్ సహాయం లేకుండా, వేగంగా హైవేలపై దూసుకుపోయింది. మధ్యలో ఉన్న జంక్షన్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్లపై కనిపించిన అడ్డంకులను సరిగ్గా గుర్తించి, అవసరమైన చోట వాహనాన్ని ఆపుతూ మరల స్టార్ట్ అవుతూ ముందుకు సాగింది.

అంతేకాదు, కారు గమ్యస్థానం చేరుకునే సరికి వినియోగదారుడి ఇంటిని ఖచ్చితంగా గుర్తించింది. చివరగా ఆ ఇంటి ప్రాంగణంలోకి సైలెంట్‌గా ప్రవేశించి నిలిచింది. వినియోగదారు కేవలం బయటకు వచ్చి, కారు డోర్ తీయడం మాత్రమే చేశాడు. ఈ పూర్తి ప్రయాణం మొత్తం టెస్లా ఒక వీడియోగా రికార్డ్ చేసి, తన అధికారిక ట్విట్టర్ పేజీలో అప్‌లోడ్ చేసింది. వీడియో బయటకు వచ్చేసరికి అది క్షణాల్లోనే వైరల్ అయ్యింది.


Click it and Unblock the Notifications








