సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన టెస్లా.. ఒక్క రూపాయి పెంచకుండానే మోడల్ వై రేంజ్ అమాంతం పెంచేసింది

ప్రపంచంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla), భారత మార్కెట్‌లో ఇటీవల తన అమ్మకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి మోడల్‌గా విడుదలైన టెస్లా మోడల్ వై (Model Y) కార్లకు సరైన ఆదరణ లభించకపోవడంతో, సంస్థ కేవలం డెలివరీలు ప్రారంభించిన ఒక్క నెలలోనే ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

అదేంటంటే, ధర పెంచకుండానే టెస్లా మోడల్ వై లాంగ్ రేంజ్ వేరియంట్ డ్రైవింగ్ రేంజ్‌ను గణనీయంగా పెంచింది. ఈ అప్‌డేట్ కారణంగా కస్టమర్‌కు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే 39 కిలోమీటర్ల అధిక రేంజ్ లభించనుంది. ఈ అప్‌డేట్ వివరాలు, కొత్త రేంజ్, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Tesla Model Y Gets Range Boost in India at Same Price Long Range Variant Now Offers 661 km

టెస్లా సంస్థ భారతదేశంలో జూలైలో అమ్మకాలు ప్రారంభించి, సెప్టెంబర్ 5 నుంచి టెస్లా మోడల్ వై డెలివరీలను ప్రారంభించింది. అయితే, డెలివరీలు ప్రారంభించిన నెల రోజుల్లోనే కంపెనీ ఈ కార్లలో ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. గతంలో టెస్లా మోడల్ వై లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ 622 కిలోమీటర్ల (WLTP సర్టిఫైడ్) రేంజ్ అందించేది.

ఇప్పుడు అదే వేరియంట్ ఎలాంటి ధర పెంపు లేకుండా 661 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తోంది. అంటే, కస్టమర్‌లకు అదనంగా 39 కిలోమీటర్ల రేంజ్ లభిస్తోంది. టెస్లా మోడల్ వై రేంజ్ పెరగడానికి ప్రధాన కారణం అందులో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్ ను అప్‌గ్రేడ్ చేయడమే.

ఇప్పటివరకు మోడల్ వై కార్లలో 79 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించగా, ఇప్పుడు దానిని 84.2 kWh బ్యాటరీ ప్యాక్‌గా మార్చారు. ఈ కొత్త బ్యాటరీలో LG సెల్స్ ను అందించారు, ఇవి మునుపటి కంటే ఎక్కువ శక్తిని, సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి.

Tesla Model Y Gets Range Boost in India at Same Price Long Range Variant Now Offers 661 km

లాంగ్ రేంజ్ వేరియంట్‌లో మోటారులో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ కారు కేవలం 5.6 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా 201 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 250 kW ఛార్జర్‌తో ఈ కారును కేవలం 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 267 కిలోమీటర్లు ప్రయాణించే రేంజ్ లభిస్తుంది.

ఈ రేంజ్ పెంపు, బ్యాటరీ అప్‌డేట్ కేవలం లాంగ్ రేంజ్ వేరియంట్‌కు మాత్రమే పరిమితం. స్టాండర్డ్ రియర్ వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇది 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 0-100 కి.మీ వేగాన్ని అందుకోవడానికి 5.9 సెకన్లు పడుతుంది. 201 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

Tesla Model Y Gets Range Boost in India at Same Price Long Range Variant Now Offers 661 km

175kW ఛార్జర్‌తో 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 238 కి.మీ వరకు రేంజ్ లభిస్తుంది. టెస్లా మోడల్ వై కారు ముంబై, ఢిల్లీ డీలర్‌షిప్‌ల ద్వారా, ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.59.89 లక్షలు, లాంగ్ రేంజ్ వేరియంట్ ధర రూ.67.89 లక్షలు. (రెండు ఎక్స్-షోరూమ్ ధరలు).

19 అంగుళాల క్రాస్‌ఫ్లో వీల్స్, 15.4 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 అంగుళాల వెనుక స్క్రీన్, వెంటిలేటెడ్, హీటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యం కావాలంటే అదనంగా రూ.6 లక్షలు ఖర్చు అవుతుంది.

More from DriveSpark

Article Published On: Sunday, October 12, 2025, 12:15 [IST]
English summary
Tesla model y gets range boost in india at same price long range variant now offers 661 km
Read more on: #tesla #electric car #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+