టాటా షోరూమ్‌లో టెస్లా కారు దొరుకుతుందా? భారత ఈవీ మార్కెట్లో సంచలనం.. టాటా గ్రూప్‌తో టెస్లా భాగస్వామ్యం!

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్ టెస్లా చివరికి భారతదేశానికి రాబోతోంది. దీనిపై దేశీయ తయారీదారులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా, టాటా మాత్రం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది. అంతే కాదు, సమాచారం ప్రకారం, టాటా టెస్లాకు సాయం చేయబోతుంది. అంటే ఈ రెండు అగ్రశ్రేణి కంపెనీలు కలిసి పని చేసే చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా EV మార్కెట్‌ను శాసిస్తుండగా, భారత్‌లో టాటా మోటార్స్ మాత్రం ఈ సెగ్మెంట్‌లో దేశంలోనే టాప్ ప్లేస్‌లో ఉంది. టాటా నెక్సాన్ EV, టిగోర్ EV లాంటి మోడళ్లతో లోకల్‌గా అమ్మకాలతో దూసుకుపోతుంది. ఇలాంటి సమయంలో దిగ్గజ కంపెనీ టెస్లా తన కార్లను భారత రోడ్లపై పరిగెత్తించాలని చూస్తుంది. అయితే ఈ కీలక టైంలో ఈ రెండు కలిసి ఒక కూటమిగా ఏర్పడినట్లు సమాచారం.

ఈ కూటమి ద్వారా టెస్లా తన ఎలక్ట్రిక్ కార్లను టాటా మోటార్స్ యాజమాన్యంలోని షోరూమ్‌లలో విక్రయిస్తుందా లేదా అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, టెస్లా టాటా మోటార్స్‌తో డైరెక్ట్‌గా భాగస్వామ్యం కలిగి లేదు. బదులుగా, టాటా గ్రూప్ కింద పని చేసే ఇతర ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని ద్వారా భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలని చూస్తుంది.

Tesla partners With Tata Group

టాటా గ్రూప్ కింద పని చేసే ప్రముఖ కంపెనీలు ఆటోకాంప్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టాటా టెక్నాలజీస్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి వాటితో టెస్లా ఒప్పందాలు చేసుకుంది. దీంతో ఇవి టెస్లాకు వివిధ రకాల సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. టెస్లా దేశంలోకి వచ్చినప్పుడు లోకల్‌గా కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇక్కడి కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం ద్వారా ఎలాంటి ఉత్పన్నం అయ్యే అవకాశం ఉండదు.

భాగస్వామ్యం చేసుకోకపోతే మార్కెట్లో ఒంటరిగా మిగిలిపోతామనే ఆలోచనతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్ టెస్లా, టాటా కింద ఉన్నటువంటి పలు కంపెనీలతో చేతులు కలిపింది. రాబోయే రోజుల్లో ఈ కంపెనీలు టెస్లాకు సరఫరాదారులుగా ఉండి మరికొన్ని సేవలను అందించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టాటా గ్రూప్‌కు సరఫరా గొలుసు ఉండటంతో టెస్లా ఈ కంపెనీని ఎంచుకుంది. అలాగే, ఇక్కడి కంపెనీలతో జట్టుకట్టడం వలన భారత ప్రభుత్వం నుండి మరిన్ని రాయితీలు పొందవచ్చు.

Tesla partners With Tata Group Details

టెస్లాలో ఉపయోగించే బ్యాటరీ నిర్వహణ వ్యవస్థలు, డోర్ కంట్రోల్‌లు, మోటార్ కంట్రోలర్ యూనిట్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీలు (PCBAs) వంటి భాగాలు వంటి కీలక సాంకేతిక పరిజ్ఞానాలను స్థానికంగా టాటా ఎలక్ట్రానిక్స్ నుండి పొందాలని టెస్లా చూస్తుంది. టాటా ఆటోకాంప్ నుంచి టెస్లాకు ఈవీ విడిభాగాలను సరఫరా అయ్యే అవకాశం ఉంది. టెస్లా కోసం సాఫ్ట్‌వేర్, ఇంజినీరింగ్ సేవలను టీసీఎస్ అండ్ టాటా టెక్నాలజీస్ అందించవచ్చు.

టాటా గ్రూప్ టెస్లాకు అవసరమైన ముడిపదార్థాల సరఫరా, ఉత్పత్తి మద్దతు వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించే అవకాశముంది. టెస్లా తన ప్లాంట్‌ను మహారాష్ట్రలో ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. అయితే టెస్లా మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయబోతుందో ప్రకటించలేదు.

Tata Tesla TieUp

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Take a Poll

More from DriveSpark

Article Published On: Friday, March 21, 2025, 17:34 [IST]
English summary
Tesla partners with tata group to supply equipment for electric vehicles more details here
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+