ట్రంప్ శాపం మస్క్‎కు గట్టిగానే తగిలినట్లుంది.. కొత్త మోడల్స్ వచ్చినా పాతాళానికి పడిపోయిన టెస్లా సేల్స్

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన దిగ్గజమైన టెస్లా యజమాని ఎలోన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వివాదం సోషల్ మీడియా, వార్తా మాధ్యమాల్లో ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా కొత్త పార్టీని స్థాపిస్తానని మస్క్ చెప్పగా, ట్రంప్ కూడా "మర్యాదగా ఉండకపోతే బయట పడేస్తాను" అని అన్నారు.

ట్రంప్‌ను సవాలు చేయడం వల్లనా లేదో తెలియదు కానీ కంపెనీ 2025 రెండవ త్రైమాసికంలో అమ్మకాలు భారీగా పడిపోయాయి. కొత్త మోడళ్లను ప్రవేశపెట్టినా అమ్మకాల్లో నిలదొక్కుకోలేకపోయింది. కొద్దిపాటి వృద్ధిని చూపిస్తున్నప్పటికీ టెస్లా భారీ పోటీని ఎదుర్కొంటోంది. టెస్లా రెండవ త్రైమాసికపు అమ్మకాల్లో దాని మాస్-మార్కెట్ మోడల్స్ అయిన మోడల్ 3 సెడాన్, మోడల్ Y ఎస్‌యూవీలు ప్రధానంగా దోహదపడ్డాయి.

Tesla Sales

ఈ రెండు మోడల్స్ కలిసి 3,73,728 డెలివరీలు లేదా ప్రపంచవ్యాప్త మొత్తం అమ్మకాల్లో 97.3 శాతాన్ని కలిగి ఉన్నాయి. టెస్లాలో అత్యంత సరసమైన వాహనం టెస్లా మోడల్ Y. ఇది రియర్-వీల్-డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్-వీల్-డ్రైవ్ వెహికల్‎గా లభిస్తుంది. ఇది 60 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారు సుమారు 415 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

ఇది మొత్తం 283 పీఎస్ పవర్, 420 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.1 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టెస్లా భారతదేశంలోకి రావాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఇది ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. మోడల్ Y మన రోడ్లపై టెస్ట్ రన్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tesla Sales

ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు కూడా మోడల్ Y. ఈ కారు ధర భారత కరెన్సీలో సుమారు రూ.27 లక్షల వరకు ఉంటుంది. టెస్లా ఇండియాలో ఒక ప్లాంట్‌ను స్థాపించడానికి ఇంకా ఒప్పందం కుదుర్చుకోకపోతే, ప్రస్తుతం దిగుమతి చేసుకునే కార్లపై 70 శాతం పన్ను విధించబడుతుంది. అలాంటప్పుడు రూ.21 లక్షల పన్ను చెల్లించాల్సి వస్తుంది.

40,000డాలర్ల కంటే తక్కువ ధర కలిగిన పూర్తిగా దిగుమతి చేసుకున్న కార్లపై భారతదేశం 70% టారిఫ్, సర్చార్జి ప్రకారం ఈ ట్యాక్స్ ఉంటుంది. పన్నులు , ఇన్సురెన్స్‎ తర్వాత ఈ మోడల్ $56,000(సుమారు రూ.48.48 లక్షలు) కంటే ఎక్కువ ధరకు అమ్ముతారని చెబుతున్నారు.

Tesla Sales

అయితే, టెస్లా తన తుది ధరను తన మార్జిన్లు, పొజిషనింగ్ వ్యూహం ఆధారంగా నిర్ణయిస్తుంది. భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుంటే, అధిక ధర పెట్టడం టెస్లా ప్రణాళికలకు ప్రధాన అడ్డంకి అవుతుంది. భారతదేశంలో కొత్త ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో ఈవీల వాటా 5 శాతం కంటే తక్కువ. ప్రీమియం కార్లు అయితే మార్కెట్‌లో 2 శాతం కంటే తక్కువగా ఉన్నాయి.

భారతదేశంలో ప్లాంట్‌ను స్థాపించడానికి కొన్ని నిబంధనలు పాటిస్తే, కంపెనీకి తక్కువ ధరలకు నిర్ణీత సంఖ్యలో వాహనాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతించే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని తర్వాతే టెస్లా తమ కార్లను భారతదేశంలోకి తీసుకురావాలని చూస్తోంది. ఢిల్లీ, ముంబైలలో కంపెనీ షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 9, 2025, 14:36 [IST]
English summary
Tesla sales plummet is it the trump curse new models fail to boost numbers
Read more on: #tesla #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+