మస్క్ మామ అదిరిపోయే ప్లాన్.. మెట్రో నగరాలపై టెస్లా ఓనర్ కన్ను.. త్వరలోనే రెండో షో రూమ్ ఓపెన్

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారతదేశంలో తన అడుగులను బలంగా వేస్తోంది. ఇప్పటికే ముంబైలో మొదటి షోరూమ్ ప్రారంభించిన టెస్లా, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో రెండో షోరూమ్‌ను తెరవబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. టెస్లా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ కొత్త షోరూమ్ ఎక్కడ ఉంది. ఏ మోడల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. దాని ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

టెస్లా కంపెనీ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో తమ మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు ఢిల్లీపై దృష్టి పెట్టింది. ఆగస్టు 11, 2025న టెస్లా తమ రెండో షోరూమ్‌ను ఢిల్లీలో ప్రారంభించనుంది. ఈ షోరూమ్ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఏరోసిటీలో ఉన్న వరల్డ్‌మార్క్ 3 బిల్డింగ్‌లో ఉండనుంది. ఏరోసిటీ ఢిల్లీలో ఒక లగ్జరీ కమర్షియల్ హబ్‌గా గుర్తింపు పొందింది. కంపెనీ ఇప్పటికే దీనికి సంబంధించిన ఇన్విటేషన్లు పంపడం ప్రారంభించింది.

Tesla s Second Showroom in Delhi Grand Opening on August 11

కొన్ని రోజుల క్రితం, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ ఉత్సవ్ టెక్కీ ఈ కొత్త షోరూమ్‌కు సంబంధించిన నిర్మాణ దశలోని కొన్ని ఫొటోలను షేర్ చేశారు. వాటిలో తెల్లటి ఇంటీరియర్, గాజు తలుపులు ఉన్నాయి. అయితే, కంపెనీ అధికారికంగా ఈ ఓపెనింగ్ డేట్, షోరూమ్ లొకేషన్‌ను ప్రకటించలేదు.

టెస్లా ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో తమ మోడల్ Yను విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. RWD (బేస్ వేరియంట్)..ఇందులో 60kWh/75kWh బ్యాటరీ ఆప్షన్ ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.59.89 లక్షలు.

Tesla s Second Showroom in Delhi Grand Opening on August 11

లాంగ్ రేంజ్ RWD వేరియంట్. ఇది 75kWh బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 622 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.67.89 లక్షలు. ఈ రెండు వేరియంట్లలోనూ సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది సుమారు 295hp పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఆన్-రోడ్ ధరలు రూ.61.07 లక్షల నుంచి రూ.69.15 లక్షల వరకు ఉంటాయి.

ఢిల్లీలో షోరూమ్ ప్రారంభం కాబోతుండడంతో టెస్లా అభిమానులు డెలివరీల కోసం ఎదురుచూస్తున్నారు. RWD బేస్ వేరియంట్ డెలివరీలు 2025 మూడో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో ప్రారంభమవుతాయని అంచనా. లాంగ్ రేంజ్ వేరియంట్ డెలివరీలు 2025 నాలుగో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ప్రారంభం కావచ్చు.

Tesla s Second Showroom in Delhi Grand Opening on August 11

టెస్లా ఇప్పటికే తన అధికారిక భారతీయ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇది ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్ నగరాల కస్టమర్లను రిజిస్టర్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. దీని ద్వారా మెట్రో నగరాలపై టెస్లా ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. భవిష్యత్తులో టెస్లా భారతదేశంలో అసెంబ్లీ లేదా తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 6, 2025, 10:31 [IST]
English summary
Teslas second showroom in delhi grand opening on august 11
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+