బంగారానికి ఉన్నంత డిమాండ్ ఉంది.. థార్ రాక్స్ మీ సొంతం కావాలంటే ఏకంగా 1.5 సంవత్సరాలు ఆగాల్సిందే
ఇండియాలో ప్రస్తుతం మహీంద్రా (Mahindra) కంపెనీకి చెందిన థార్ (Thar) మోడల్ ఒక సంచలనమైన కారుగా ఉంది. దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న స్టైలిష్ ఎస్‌యూవీలలో ఇది టాప్ ప్లేస్‌లో ఉంటుంది. మార్కెట్లోకి విడుదల అయిన అతి తక్కువ కాలంలోనే ఇది ఇతర మోడళ్లకు అందనంత ప్రజాధారణ పొందింది. మొదటగా 3 డోర్ థార్‌ను మహీంద్రా విడుదల చేసింది. బుకింగ్స్‌లలో ఇది సునామీ సృష్టించింది. దీని ఆకట్టుకునే రూపం, ఇంజిన్ పనితీరు కారణంగా భారతీయ వినియోగదారులకు ఈ కారును ఎగబడి మరి కొనుగోలు చేశారు. ఈ మోడల్‌కు భారీ డిమాండ్ రావడంతో మహీంద్రా దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతూ 5-డోర్ల వెర్షన్ రాక్స్‌ను(Thar Roxx) విడుదల చేసింది. దీన్ని ఆగస్టు 2024లో ఘనంగా లాంచ్ చేసింది. థార్‌తో పోలిస్తే రాక్స్ మరింత పొడుగ్గా ఉంటుంది.
ఈ మోడల్ బుకింగ్స్ ఓపెన్ చేసిన ఒక గంటలో ఏకంగా 1 లక్షకు పైగా బుకింగ్స్ సాధించి అత్యంత డిమాండ్ ఉన్న మోడల్‌గా నిలిచింది. చాలా మంది కస్టమర్లు 5-డోర్ల వెర్షన్ థార్ రాక్స్‌ను కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో భారీ డిమాండ్ కారణంగా వేగంగా డెలివరీ చేయడానికి ఈ Suv ఉత్పత్తిని వేగవంతం చేసింది. రెండు మోడళ్లను కలిపి ఉత్పత్తిని 9,000 యూనిట్లకు పెంచినట్లు తెలుస్తోంది.

బుకింగ్ చేసుకున్న కస్టమర్ల చేతికి కారును అందించడానికి థార్ 3-డోర్ అలాగే, 5-డోర్ మోడళ్లను 30:70 నిష్పత్తిలో తన ప్లాంట్‌లలో ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం థార్ రాక్స్‌కు మరింత డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా దీని ఉత్పత్తిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. తయారీనీ పెంచినప్పటికి బుకింగ్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కారును పొందాలంటే కస్లమర్లు దాదాపు 1.5 ఏళ్ళు (18 నెలల) వరకు వేచి ఉండాల్సి వస్తుంది.
అదిరిపోయూ థార్ రాక్స్‌ను వీలైనంత తొందరగా డ్రైవింగ్ చేయాలని అనుకుంటున్న వారికి ఇది కొంచెం బాధ కలిగించే వార్త. దీనికి అసాధారణ రితీలో డిమాండ్ రావడం వలన బుకింగ్ ప్రాధాన్యత వారీగా కారును డెలివరీ చేస్తారు. ఇక, మహీంద్రా థార్ రాక్స్ పూర్తి వివరాల్లోకి వెళితే, ఇది పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభిస్తుంది. ఈ రెండు కూడా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో ఉన్నాయి.

దాని బేస్ వేరియంట్ థార్ రాక్స్ MX1 ధర రూ. 12.99 లక్షల నుంచి మొదలుకుని రూ. 13.99 లక్షల మధ్య ఉంది. ఈ మోడల్‌కు అత్యధికంగా 18 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. అలాగే, డీజిల్-మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభించే థార్ రాక్స్ AX7L 4x4 వేరియంట్లకు కూడా 18 నెలల సమయం పడుతుంది. దీని ధర రూ.21.59 లక్షల నుండి రూ.23.09 లక్షల వరకు ఉంది.
ఇంకా, థార్ రాక్స్ మిడ్ వేరియంట్ MX3 ధర రూ.14.99 లక్షల నుంచి రూ.17.49 లక్షల వరకు, MX5 రూ. 16.49 లక్షల నుంచి రూ. 19.09 లక్షల వరకు, AX3L ధర రూ.16.99 లక్షల నుండి రూ.19.09 లక్షల వరకు, AX5L వేరియంట్ రూ. 18.99 లక్షల నుంచి రూ.21.09 లక్షలు వరకు ఉంది. ఈ మోడల్‌కు మాత్రం వెయిటింగ్ పీరియడ్ దాదాపు 6 నెలల వరకు ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








