రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మీ ప్రాణాలను కాపాడే 5స్టార్ సేఫ్టీ కార్లు ఇవే!
మనదేశంలో వాహనాల భద్రతా ప్రమాణాలను పరీక్షించే సంస్థగా భారత్ NCAP (భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) గుర్తింపు పొందింది. ఇది వివిధ ప్రమాణాల ఆధారంగా కార్లకు సేఫ్టీ రేంటింగ్ ఇస్తుంది. తాజాగా, దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని కార్లను అత్యంత సురక్షితమైనవిగా భారత్ NCAP ప్రకటించింది.
టాటా పంచ్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ, కియా సైరస్, స్కోడా కైలాక్, మహీంద్రా థార్ రాక్స్, టాటా సఫారి ఈ జాబితాలో ఉన్నాయి. వీటి సేఫ్టీ ఫీచర్స్, రేటింగ్స్, ధరల గురించి మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా పంచ్ ఈవీ (Tata Punch EV): ఈ కారు భారత్ NCAP ద్వారా అత్యంత సురక్షితమైన కారుగా గుర్తింపు పొందింది. పెద్దల భద్రత (Adult Occupant Protection) విభాగంలో 32కి 31.46 పాయింట్లు, పిల్లల ప్రయాణీకుల భద్రత (Child Occupant Protection) విభాగంలో 49కి 45 పాయింట్లు సాధించి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఒక ఫుల్ ఛార్జ్‌పై 315 నుండి 421 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.
ఈ టాటా పంచ్ ఈవీలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), TPMS (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్), హిల్ హోల్డ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ డిసెంట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 14.44 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 25 kWh, 35 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో వస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ (Mahindra XUV400 EV): ఈ కారు కూడా సేఫ్టీకి మారుపేరుగా నిలిచింది. భారత్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఇది వయోజన ప్రయాణీకుల భద్రతలో 32కి 30.38 పాయింట్లు, పిల్లల ప్రయాణీకుల భద్రతలో 49కి 43 పాయింట్లు సాధించింది. కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ కారు ప్రయాణీకులకు గరిష్ట రక్షణను అందిస్తుంది.
సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, TPMS, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర రూ. 16.74 లక్షల నుండి రూ. 17.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 34.5 kWh, 39.5 kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఒక ఫుల్ ఛార్జ్‌పై 375 నుండి 456 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇస్తుంది.

కియా సైరస్ (Kia Syros): ఈ కారు కూడా భారత్ NCAP పరీక్షలో సురక్షితమైన కారుగా నిరూపించుకుంది. ఇది పెద్దల భద్రత విషయంలో 32కి 30.21 పాయింట్లు, పిల్లల ప్రయాణీకుల భద్రతలో 49కి 44.42 పాయింట్లు సాధించి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. కొత్త కియా సైరస్ SUV గరిష్ట సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.
6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), HSA (హిల్ స్టార్ట్ అసిస్ట్), VSM (వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటివి ఇందులో ఉన్నాయి. దీని ధర రూ. 8.99 లక్షల నుండి రూ. 17.80 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

స్కోడా కైలాక్ (Skoda Kylaq): ఇది ఒక ప్రసిద్ధ SUV, భారత్ NCAP పరీక్షలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఇది పెద్దల భద్రతలో 32కి 30.38 పాయింట్లు, పిల్లల ప్రయాణీకుల భద్రతలో 49కి 43 పాయింట్లు సాధించింది. ఈ స్కోడా కైలాక్ ప్రయాణీకులకు అత్యుత్తమ రక్షణను అందిస్తుంది.
సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESC, చైల్డ్ సీట్ మౌంట్‌లు, హిల్ హోల్డ్ కంట్రోల్, EDS (ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్), MSR (మోటార్ స్లిప్ రెగ్యులేషన్), రోల్ ఓవర్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

టాటా సఫారి (Tata Safari): ఇది శక్తివంతమైన SUV, భారత్ NCAP పెద్దల భద్రత విభాగంలో 32కి 30.08 పాయింట్లు, పిల్లల ప్రయాణీకుల భద్రత విభాగంలో 49కి 44.54 పాయింట్లు సాధించి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. కొత్త టాటా సఫారి భద్రతకు కూడా పేరుగాంచింది.
ప్రయాణీకుల రక్షణ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, TPMS, రెండవ వరుసలో ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్, ADAS, హిల్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర రూ. 15.50 లక్షల నుండి రూ. 27.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 14.50 నుండి 16.30 kmpl వరకు మైలేజ్‌ను అందిస్తుంది.

మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx): ఇది ఒక SUV, భారత్ NCAP నిర్వహించిన సేఫ్టీ టెస్టులో పెద్దల ప్రయాణీకుల భద్రత విభాగంలో 32కి 31.09 పాయింట్లు, పిల్లల ప్రయాణీకుల భద్రత విభాగంలో 49కి 45 పాయింట్లు సాధించి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.
ఈ మహీంద్రా థార్ రాక్స్ భద్రతకు కూడా ప్రసిద్ధి చెందింది. ప్రయాణీకుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, TPMS, లెవెల్-2 ADAS, 4 డిస్క్ బ్రేక్‌లు, ESP, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీని ధర రూ. 12.99 లక్షల నుండి రూ. 23.09 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








