బడ్జెట్‌లో బెస్ట్ మైలేజ్ కార్లు ఇవే.. ఇవి రోడ్డు మీద వెళ్తుంటే అందరి దృష్టి మీ మీదే ఉంటుంది
కొత్త కారు కొనాలని చాలా మంది ఎప్పటి నుంచో కలలు కంటుంటారు. అయితే, కొనుగోలుదారులకు ఏ కారు లో మెయింటెనెన్స్ ఖర్చును కలిగి ఉంటుంది.. ఎక్కువ మైలేజ్‌ను ఇస్తుంది. ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుందా అనే సందేహం ఉంటుంది. అందుబాటు ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టొయోటా టైసర్, మారుతి సుజుకి డిజైర్, హ్యుండాయ్ వెన్యూ, టొయోటా హైరైడర్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara): ఇది పాపులర్ SUV. దీని ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్), 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. లీటరుకు19.38 నుండి 27.97కిమీ వరకు, CNG వేరియంట్‌లు కిలోకు 26.6 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తాయి.

ఈ గ్రాండ్ విటారా కారు బయటి భాగంలో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది వివిధ రంగులలో కూడా అందుబాటులో ఉంది. ఇందులో 5 సీట్లు ఉంటాయి. ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను పొందుపరిచారు.
టొయోటా అర్బన్ క్రూజర్ టైసర్ (Toyota Urban Cruiser Taisor): ఈ SUV ధర రూ. 7 లక్షల నుంచి రూ. 13 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్ & 1.2-లీటర్ CNG ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్‌లు లీటరుకు19.8 నుండి 22.79కిమీ వరకు, CNGవేరియంట్‌లు కిలోకు 28.5 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తాయి.

కొత్త అర్బన్ క్రూజర్ టైసర్ కారు 5 సీట్ల ఆఫ్షన్లతో వస్తుంది. ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చొని ప్రయాణించవచ్చు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.
మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire): ఇది ఒక ప్రసిద్ధ సెడాన్, దీని ధర రూ. 6 లక్షల నుండి రూ. 10లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)ఉంటుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్‌ను కలిగి ఉంది. దీని పెట్రోల్ వేరియంట్‌లు లీటరుకు 24.79నుండి 25.71కిమీ వరకు, CNG వేరియంట్‌లు కిలోకు 33.73 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తాయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది.

హ్యుండాయ్ వెన్యూ (Hyundai Venue): ఈ SUV ధర రూ. 8 లక్షల నుండి రూ. 13 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. ఇది లీటరుకు 17 నుండి 22.7కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఈ కారులో కూడా 5 సీట్లు ఉంటాయి, ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చు.
టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder): ఇది ఒక ప్రసిద్ధ SUV. దీని ధర రూ. 11 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 1.5-లీటర్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) , CNG ఇంజన్‌ను కలిగి ఉంది, ఇది లీటరుకు 19.39 నుండి 27.97కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








