కొత్త కారు కొనాలనుకుంటున్నారా?.. 2025లో దుమ్మురేపిన కార్లు ఇవే.. మీ బడ్జెట్‌లో ఏది బెస్టో చెక్ చేయండి
మనదేశంలోని ఆటోమొబైల్ పరిశ్రమ గత ఆర్థిక సంవత్సరంలో ఊహించని వృద్ధిని సాధించింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026 ప్రారంభమైన నేపథ్యంలో గతేడాది అత్యధికంగా అమ్ముడు పోయిన కార్ల జాబితా విడుదల అయింది. ఈసారి కూడా మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. మరి గతేడాది టాప్ 10లో ఉన్న కార్లు ఏవో చూద్దాం. కొత్త కారు కొనాలనుకునే వారికి ఈ లిస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే: 10వ స్థానంలో మహీంద్రా స్కార్పియో ఎన్ నిలిచింది. ఇది ఈ జాబితాలో ఉన్న ఏకైక లాడర్ ఫ్రేమ్ SUV. దీని ధర రూ. 13.99 లక్షల నుంచి రూ. 24.89 లక్షల వరకు ఉంది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లు, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది. 4X4, ఆఫ్-రోడ్ ఫీచర్లు దీని ప్రత్యేకత. గత ఏడాది 1,64,842యూనిట్లు అమ్ముడయ్యాయి.

9వ స్థానంలో మారుతి డిజైర్ ఉంది. గత ఏడాది 1,65,021 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 నవంబర్‌లో న్యూ జనరేషన్ మోడల్ విడుదల కావడం దీని అమ్మకాలకు కలిసొచ్చింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే ఈ కారు ధర రూ. 6.84 లక్షల నుండి రూ. 10.19 లక్షల వరకు ఉంది. టాప్ వేరియంట్‌లో కొన్ని ఫీచర్లు లేకపోవడం ఒక లోపం.
8వ స్థానంలో మారుతి ఫ్రాంక్స్ ఉంది. గత ఏడాది 1,66,216 యూనిట్లు అమ్ముడయ్యాయి. విశాలమైన ఇంటీరియర్, మంచి ఫీచర్లు దీని ప్లస్ పాయింట్లు. దీని ధర రూ. 7.52 లక్షల నుంచి రూ. 12.88 లక్షల వరకు ఉంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది.

తదుపరి 7వ స్థానంలో మారుతి బాలెనో ఉంది. గత ఏడాది 1,67,162 యూనిట్లు అమ్ముడయ్యాయి. టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20 లకు ఇది పోటీదారు. దీని ధర రూ. 6.70 లక్షల నుండి రూ. 9.92 లక్షల వరకు ఉంది. AMT గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంది.
6వ స్థానంలో మారుతి స్విఫ్ట్ ఉంది. గత ఏడాది 1,79,641 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని డ్రైవింగ్ కంట్రోల్ చాలా బాగుంటుంది. మంచి మైలేజ్ కూడా దీనికి కలిసొచ్చింది. దీని ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.50 లక్షల వరకు ఉంది.

5వ స్థానంలో మారుతి బ్రెజ్జా ఉంది. గత ఏడాది 1,89,163 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రాక్టికల్ ఫీచర్లు, మంచి అద్భుతమైన ఇంటీరియర్ దీని స్పెషాలిటీ. దీని ధర రూ. 8.69 లక్షల నుంచి రూ. 14.14 లక్షల వరకు ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.
4వ స్థానంలో మారుతి ఎర్టిగా ఉంది. ఇది ఈ లిస్ట్‌లో ఉన్న ఏకైక MPV. గత ఏడాది 1.9లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ మాత్రమే ఉంది. దీని ధర రూ. 8.97 లక్షల నుండి రూ.13.26 లక్షల వరకు ఉంది. తర్వాత 3వ స్థానంలో హ్యుందాయ్ క్రెటా ఉంది. గత ఏడాది 1.95లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా దీని అమ్మకాలకు కలిసొచ్చింది.

2వ స్థానంలో టాటా పంచ్ ఉంది. గత ఏడాది 1.96లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని ధర రూ.6.20లక్షల నుంచి రూ.10.32లక్షల వరకు ఉంది. మొదటి స్థానంలో మారుతి వ్యాగన్ఆర్ ఉంది. గత ఏడాది 1.98 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఎక్కువ మైలేజ్, తక్కువ ధర మరియు నిర్వహణ ఖర్చు దీనికి బాగా కలిసొచ్చాయి. దీని ధర రూ.5.65లక్షల నుండి రూ.7.48లక్షల వరకు ఉంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: గత ఆర్థిక సంవత్సరం ఆటోమొబైల్ రంగంలో మంచి వృద్ధి కనిపించింది. చాలా కార్లు మంచి అమ్మకాలు సాధించాయి. ఈ ఏడాది ఈ సంఖ్యలు మారే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








