ఒకేసారి 24 ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కారు.. ఇదే ప్రపంచంలో అత్యంత ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కారు
ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో క్రొయేషియాకు చెందిన రిమాక్ అనే చిన్న కంపెనీ ఇప్పుడు ఒక సంచలనం సృష్టించింది. వారి కొత్త హైపర్‌కార్ అయిన రిమాక్ నెవెరా R కేవలం మూడు రోజుల్లో ఏకంగా 24 కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించింది. ఇది కేవలం స్పీడుతోనే కాదు, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో కూడా ఆటోమొబైల్ ప్రపంచానికి ఒక కొత్త దిశను చూపించింది. ఈ కారు ఏయే రికార్డులను సాధించింది, దాని స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఈ హైపర్ ఎలక్ట్రిక్ కారు జర్మనీలోని ఆటోమోటివ్ టెస్టింగ్ పెప్పెన్‌బర్గ్ ట్రాక్‌పై జూలై 5 నుంచి 8 మధ్య ఈ అద్భుతాలు చేసింది. ఈ కారు సాధించిన కొన్ని ముఖ్యమైన రికార్డులు ఇక్కడ ఉన్నాయి. ఈ కారు కేవలం 1.72 సెకన్లలో ఈ కారు 100 కి.మీ./గం వేగాన్ని అందుకుంది. ఇది ప్రపంచంలో ఏ ఎలక్ట్రిక్ కారు కూడా ఇంత వేగంగా చేరుకోలేదు.

ఇది కేవలం 25.79 సెకన్లలో 400 కి.మీ./గం వేగాన్ని చేరుకొని, తిరిగి సున్నా వేగానికి వచ్చింది. ఈ రికార్డును కోయినిగ్సెగ్ జెస్‌కో అబ్‌సోల్యూట్ కారు కంటే 2.04 సెకన్లు వేగంగా బద్దలు కొట్టింది. ఈ కారు టాప్ స్పీడ్ 431.45 కి.మీ./గం (268.2 మైళ్లు/గం). ఇది ఏ ఎలక్ట్రిక్ కారు కూడా ఇంత వేగంతో ప్రయాణించలేదు. ఈ కారు క్వార్టర్ మైలు దూరాన్ని కేవలం 7.90 సెకన్లలో పూర్తి చేసింది.
ఈ కారుకు ఇంత అద్భుతమైన పర్ఫామెన్స్ అందించే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. రిమాక్ నెవెరా R మొత్తం 2,017 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మునుపటి నెవెరా మోడల్ కంటే 103 hp ఎక్కువ.

ఈ కారులో కొత్త 108 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీ కెపాసిటీ మునుపటి మోడల్ కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, దీనిలో మెరుగైన బ్యాటరీ కెమిస్ట్రీ, తక్కువ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మరింత పవర్‌ను త్వరగా అందిస్తుంది. ఇది కారు వేగంగా వెళ్ళినప్పుడు కూడా బ్యాటరీ వేడెక్కకుండా చూసుకుంటుంది.
కారులోని ఫోర్ వీల్స్‌కు నాలుగు వేర్వేరు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. దీనివల్ల ప్రతి వీల్కు పవర్‌ను నిమిషానికి 100 సార్లు డిస్ట్రిబ్యూట్ చేయగలదు. ఇది కారు గ్రిప్, పట్టు, వేగాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ కారులో కొత్త ఏరోడైనమిక్ ప్యాకేజీ ఉంది. ఇందులో కొత్త డిఫ్యూజర్, పెద్ద స్థిరమైన వెనుక వింగ్ ఉన్నాయి. ఇది కారును రోడ్డుకు గట్టిగా అంటిపెట్టుకొని ఉండటానికి సహాయపడుతుంది, గాలి నిరోధకతను తగ్గిస్తుంది, వేగాన్ని పెంచుతుంది.
ఈ రికార్డుల ద్వారా రిమాక్ నెవెరా R భవిష్యత్తు ఎలక్ట్రిక్ కార్లదే అని నిరూపించింది. ఈవీలు కేవలం పర్యావరణానికి అనుకూలమైనవి మాత్రమే కాకుండా, పెట్రోల్ ఆధారిత హైపర్‌కార్ల కంటే కూడా వేగంగా, పవర్ ఫుల్‌గా ఉండగలవని ఈ కారు నిరూపించింది.
అయితే, కొన్ని అంశాలలో ఇది ఇంకా పెట్రోల్ కార్ల కంటే వెనుకబడి ఉంది. ఉదాహరణకు, దీని టాప్ స్పీడ్ 431.45 కి.మీ./గం, అయితే బుగట్టి చిరోన్ సూపర్ స్పోర్ట్ టాప్ స్పీడు 490 కి.మీ./గం. కానీ ఎలక్ట్రిక్ కార్లలో ఫాస్ట్ రేసు ఇప్పుడు మొదలైంది. భవిష్యత్తులో ఈ రికార్డులు కూడా బద్దలవడం ఖాయం.


Click it and Unblock the Notifications








