దీనిని గుద్దినా ఎదుటి వాళ్లకే డేంజర్.. అంత సేఫ్టీ ఉన్న కొనడానికి ఇష్టపడని జనం
టాటా మోటార్స్ నుంచి వచ్చిన కూపే ఎస్‌యూవీ అయిన టాటా కర్వ్, డిజైన్, ఫీచర్ల పరంగా ఎంతో అద్భుతంగా ఉంది. దీన్ని చూస్తే ఒక కారుబండలా కనిపిస్తుంది. కానీ, ఈ అద్భుతమైన ఎస్‌యూవీ అమ్మకాలు మాత్రం ఇటీవల భారీగా పడిపోయాయి. సెప్టెంబర్ నెలలో కేవలం 1,566 యూనిట్లు మాత్రమే అమ్ముడవడంతో గతేడాదితో పోలిస్తే సేల్స్ ఏకంగా 67.12 శాతం తగ్గాయి. రూ. 9.66 లక్షల ప్రారంభ ధరతో అట్రాక్టివ్ లుక్, పవర్‌ట్రైన్‌లు ఉన్నప్పటికీ, ఈ కారును కొనడానికి వినియోగదారులు ఎందుకు ఆసక్తి చూపడం లేదు? ఈ కూపే ఎస్‌యూవీ అమ్మకాలు పడిపోవడానికి కారణాలు, దాని ఫీచర్లు వివరంగా తెలుసుకుందాం.
కూపే ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో విడుదలైన టాటా కర్వ్, మార్కెట్‌లో సరైన అంచనాలను అందుకోలేకపోయింది. టాటా కర్వ్ అమ్మకాలు సెప్టెంబర్ నెలలో కేవలం 1,566 యూనిట్లు మాత్రమే అయ్యాయి. 2024 సెప్టెంబర్‌తో పోలిస్తే (4,763 యూనిట్లు), ఇది ఏకంగా 67.12% పతనాన్ని సూచిస్తోంది.

కర్వ్ అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణాలుగా కొన్ని అంశాలను చెబుతున్నారు. ఈ ధర (రూ. 9.66 లక్షలు ప్రారంభం)లో ఇతర కంపెనీల నుంచి మంచి ఎస్‌యూవీలు అందుబాటులో ఉండడం కూడా ఒక కారణం. అంతేకాకుండా జీఎస్‌టీ నిబంధనలు మారడం గురించి కొనుగోలుదారులకు సరైన సమాచారం లేకపోవడం కూడా ఒక కారణంగా ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
టాటా కర్వ్ ఎస్‌యూవీ స్టాండర్డ్ (పెట్రోల్/డీజిల్) వేరియంట్, పవర్ఫుల్ ఇంజిన్‌లు, అనేక ఫీచర్లతో వచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.66 లక్షల నుండి రూ. 18.85 లక్షల వరకు ఉంది. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, ఎల్‌ఈడీ టైల్‌లైట్స్, అల్లాయ్ వీల్స్‌తో ఆకట్టుకునే డిజైన్ ఉంది. ఇది ఫ్లేమ్ రెడ్, ప్యూర్ గ్రే వంటి ఆరు రంగుల్లో లభిస్తుంది.

ఇందులో 1.2-లీ. టర్బో పెట్రోల్, 1.2-లీ. జీడీఐ టర్బో పెట్రోల్, 1.5-లీ. డీజిల్ ఇంజిన్‌ల ఆప్షన్లు ఉన్నాయి. 6-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌లు లభిస్తాయి. మైలేజ్ లీటరుకు 17.75 నుండి 19 కి.మీ వరకు ఉంది. టాప్ స్పీడ్ 204 kmph వరకు ఉంటుంది.
ఈ 5 సీటర్ ఎస్‌యూవీలో 500 లీటర్ల భారీ బూట్ స్పేస్, 208 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. 12-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 9-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏడీఏఎస్ ఫీచర్, 360-డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
కర్వ్ ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.49 లక్షల నుండి రూ. 22.24 లక్షల వరకు ఉంది. ఇది 45 kWh, 55 kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 430 కి.మీ నుండి 502 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. ఈ ఈవీ వేరియంట్‌లో కూడా 5 సీట్ల కెపాసిటీ, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








