మరోసారి సత్తా చాటిన క్రెటా.. తిరుగు లేదనిపించిన స్కార్పియో.. ఈ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల జాబితా చూశారా?
దేశంలో ఎస్‌యూవీల వాడకం పెరుగుతోంది. ఎక్కువమంది ఎస్‌యూవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపెడుతుండడంతో.. వీటి సేల్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ ఎస్‌యూవీల్లో చాలా రకాలు ఉంటాయి. మైక్రో ఎస్‌యూవీలు, కాంపాక్ట్ ఎస్‌యూవీలు, మిడ్-సైజ్ ఎస్‌యూవీలు, ఫుల్ సైజ్ ఎస్‌యూవీలు అని వివిధ పేర్లతో ఉంటాయి. ఇక మిడ్-సైజ్ ఎస్‌యూవీల విషయానికి వస్తే ఇవి 4.3 మీటర్ల నుంచి 4.5 మీటర్ల పొడవుతో ఉంటాయి. అయితే ఈ జనవరి నెలలో వినియోగదారులను బాగా ఆకట్టుకున్న టాప్ -10 మిడ్-సైజ్ ఎస్‌యూవీలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
వివిధ కార్ బ్రాండ్‌ల నుంచి అనేక మోడళ్ల మిడ్-సైజ్ ఎస్‌యూవీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో హ్యుందాయ్ క్రెటా మోడల్ కారు చాలా పాపులర్ కారుగా చెప్పొచ్చు హ్యుందాయ్ నుంచి బెస్ట్ సెల్లింగ్ కారుగా ఈ క్రెటా మోడల్ ప్రస్తుతం కొనసాగుతోంది. జనవరి నెలలో హ్యుందాయ్ క్రెటా కార్లు 18,522 కార్లు అమ్ముడయ్యాయి.

2024 జనవరి నెలలో ఈ సంఖ్య 13,212 గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో 40% వృద్ధి కనబడింది. క్రెటా తర్వాత సెకండ్ బెస్ట్-సెల్లింగ్ మిడ్-సైజ్ ఎస్‌యూవీగా మారుతి సుజుకి గ్రాండ్ విటారా నిలిచింది. గత నెలలో 15,784 యూనిట్ల గ్రాండ్ విటారా కార్లు అమ్ముడయ్యాయి. అయితే 2024 జనవరిలో ఈ సంఖ్య 13,438గా మాత్రమే ఉంది.
వీటి తర్వాత మహీంద్రా సంస్థ నుంచి రెండు కార్లు వరుసగా మూడో, నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. అవి వరుసగా మహీంద్రా స్కార్పియో, మహీంద్రా XUV700 కార్లు. గత నెలలో 15,442 యూనిట్ల విక్రయాలతో మహేంద్ర స్కార్పియో మూడో స్థానంలో నిలిచింది. ఇక XUV700 కారు 8399 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానం సొంతం చేసుకుంది.
అంతకుముందు ఏడాది జనవరి నెలలో ఈ రెండు మహీంద్రా మిడ్-సైజ్ ఎస్‌యూవీల అమ్మకాలు దాదాపుగా సేమ్ ఉన్నాయి. ఇక ఈ 2025 జనవరి నెలలో 6,470 యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచిన కారు కియా సంస్థ నుంచి సెల్టోస్ మోడల్. 2024 జనవరి నెలలో ఈ కియా కారు 6,391 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
టయోటా హై రైడర్, టాటా కర్వ్ మోడల్ తర్వాతి ఆరో, ఏడో స్థానంలో నిలిచాయి. ఈ రెండు కార్లు వరుసగా 4,941 యూనిట్లు, 3,087 యూనిట్ల విక్రయాలు నమోదు చేశాయి. ఇక ఈ జాబితాలో చివరి మూడు స్థానాల్లో హోండా ఎలివేట్ (1,773), ఫోక్స్‌వ్యాగన్ Taigun (1,548), టాటా సఫారీ (1,548) వరుసగా ఉన్నాయి.
డ్రైవ్ స్పార్క్ వ్యాఖ్య: ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీల అమ్మకాల జాబితాలో మహీంద్రా, టాటా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థల నుంచి రెండేసి కార్లు చోటు దక్కించుకున్నాయి. మిగతా సంస్థలు కనీసం ఒక మిడ్ సైజ్ ఎస్‌యూవీనైనా విక్రయించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








