బ్రెజ్జాకు చుక్కలు చూపించే కార్లు ఇవే.. ఫీచర్లు తెలిస్తే ఫిదా అయిపోవాల్సిందే!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి బ్రెజ్జా(Maruti Suzuki Brezza) ఒక పాపులర్ SUVగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇది రూ. 8.69 లక్షల నుండి రూ. 14.14 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది. దీనిలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. అలాగే CNG ఇంజన్ ఆప్షన్‌లతో కూడా లభిస్తుంది.
మారుతి బ్రెజ్జా లీటరుకు 17.38 నుండి 25.51 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. దీనిలో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉన్న ఈ కారులో ఐదుగురు హాయిగా ప్రయాణించవచ్చు. అయితే, బ్రెజ్జాకు ప్రత్యామ్నాయంగా కొనుగోలుదారులకు ఆల్టర్నేటివ్గా 3 అద్భుతమైన కార్లు కూడా మార్కెట్‌లో ఉన్నాయి. వాటి ధర, ఫీచర్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

1. టాటా పంచ్ (Tata Punch): ఇది ఒక మైక్రో SUVగా గుర్తింపు పొందింది. ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయే మోడల్. దీని ధర రూ. 6.20 లక్షల నుండి రూ. 10.32 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, CNG ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. ఇది లీటరుకు18.8 నుండి 26.99 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఈ కారులో కూడా ఐదుగురు ప్రయాణించవచ్చు.
కొత్త టాటా పంచ్ అనేక లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, సన్‌రూఫ్, రియర్ ఏసీ వెంట్స్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను కూడా అందించారు.

2. హ్యుందాయ్ వెన్యూ(Hyundai Venue): ఈ SUV కొనుగోలుదారులకు రూ. 7.94లక్షల నుండి రూ. 13.62లక్షల(ఎక్స్-షోరూమ్)ధరకు అందుబాటులో ఉంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. ఇది లీటరుకు 17 నుండి 22.7 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఇది ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉంది. టైటాన్ గ్రే, డెనిమ్ బ్లూ, ఫైరీ రెడ్, అట్లాస్ వైట్ రంగులలో లభిస్తుంది.
కొత్త హ్యుందాయ్ వెన్యూ కారులో ఐదుగురు హాయిగా ప్రయాణించవచ్చు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, సన్‌రూఫ్, పుష్-బటన్ స్టార్ట్, కీ ఎంట్రీ వంటి వివిధ ఫీచర్లను కలిగి ఉంది. ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా కలిగి ఉంది.

3. కియా సోనెట్ (Kia Sonet): ఈ కారు ధర రూ. 8 లక్షల నుండి రూ. 15.60 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 1-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. ఇది లీటరుకు 18.6 నుండి 22.3 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఈ కారులో కూడా ఐదుగురు హాయిగా ప్రయాణించవచ్చు.
కొత్త కియా సోనెట్ SUV టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360-డిగ్రీ కెమెరాను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








