కిర్రాక్ కాంబో.. లో బడ్జెట్.. హై సెక్యూరిటీ.. ఈ కార్లు మీ ఫ్యామిలీకి సూపర్ సేఫ్టీ!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ తక్కువగా ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్! తక్కువ ధరలోనే అత్యుత్తమ భద్రతా ఫీచర్లతో వస్తున్న టాప్-3 కార్ల గురించి తెలుసుకుందాం. ఇవి మీ ప్రాణాలకు రక్షణ కవచంలా నిలుస్తాయి. గ్లోబల్ NCAP, భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో ఈ కార్లు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలో సేఫ్టీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. వినియోగదారులు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఇతర ముఖ్యమైన భద్రతా ఫీచర్లను కలిగి ఉన్న కార్లను కోరుకుంటున్నారు. తక్కువ ధరలో మంచి భద్రతను అందించే మూడు ప్రముఖ కార్ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Tata Curvv

1. మహీంద్రా XUV 3XO: మహీంద్రా XUV 3XO సబ్-కాంపాక్ట్ SUV క్రాష్ టెస్ట్‌లో అద్భుతమైన భద్రతా రేటింగ్‌ను సొంతం చేసుకుంది. వయోజన ప్రయాణికుల రక్షణలో 32కి 29.36 పాయింట్లు, పిల్లల ప్రయాణికుల రక్షణలో 49కి 43 పాయింట్లు సాధించి మొత్తం 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది.

కొత్త మహీంద్రా XUV 3XO సబ్-కాంపాక్ట్ SUV ధర రూ. 7.79 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ SUV అదనపు భద్రత కోసం బెల్ట్ ప్రిటెన్షనర్‌లు, బెల్ట్ లోడ్-లిమిటర్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పాదచారుల రక్షణ, సీట్ బెల్ట్ రిమైండర్‌లను కలిగి ఉంది.

Mahindra Xuv

2. టాటా కర్వ్: కొత్త టాటా కర్వ్ కారు కూడా 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందింది. ఈ కొత్త SUV భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్ NCAP) ద్వారా అత్యంత సురక్షితమైన కారుగా గుర్తింపు పొందింది. క్రాష్ టెస్ట్‌లో వయోజన ప్రయాణికుల రక్షణలో 32కి 29.5 పాయింట్లు, పిల్లల రక్షణలో 49కి 43.66 పాయింట్లు సాధించింది.

మొత్తం మీద ఈ కారు పూర్తి 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందింది. టాటా కర్వ్ SUV బెస్ట్ డ్రైవింగ్ ఎక్సీపీరియన్స్ కోసం సౌకర్యం, పర్ఫామెన్స్ రెండింటికీ ప్రాధాన్యతనిస్తూ రూపొందించబడింది. ఈ కారు ప్రస్తుతం రూ. 10 లక్షల నుండి ప్రారంభమై రూ. 19.20 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధరలు) అందుబాటులో ఉంది.

Maruti Dzire

3. మారుతి డిజైర్: మారుతి సుజుకి డిజైర్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా గ్లోబల్ NCAP నిర్వహించిన సేఫ్టీ టెస్టులో వయోజన ప్రయాణికుల రక్షణ విభాగంలో 34కి 31.24 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్ పొందింది. అలాగే పిల్లల రక్షణ విభాగంలో 42కి 39.20 పాయింట్లు సాధించి అత్యధిక భద్రత కలిగిన కారుగా నిలిచింది.

భారతదేశంలో మారుతి డిజైర్ ప్రారంభ ధర రూ. 6.84 లక్షల నుండి రూ. 10.19 లక్షల వరకు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) ఉంది. మారుతి సుజుకి డిజైర్ లోపలి భాగంలో డ్యూయల్-టోన్ బీజ్ (పైభాగం, డాష్, సీట్లు, బ్లాక్ (డాష్, డోర్ కార్డ్‌లు, కింది భాగాలు) థీమ్‌ను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 9, 2025, 17:15 [IST]
English summary
Top 3 safest budget cars in india with 5 star safety ratings
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+