ఎక్కువ మైలేజ్, చిన్న ఫ్యామిలీలకు బెస్ట్..రూ.10 లక్షల బడ్జెట్‌లో అత్యధికంగా సేల్ అయ్యే హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎస్‌యూవీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే, హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు ధరలో లభించే హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకి వాగన్ఆర్, మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి స్విఫ్ట్, టాటా టియాగో ముందున్నాయి. ఆగస్టు నెలలో ఈ కార్లకు ఎంత డిమాండ్ ఉందో వివరాలు చూద్దాం.

Top 4 Best-Selling Hatchback Cars in India Under Rs 10 Lakhs

1. మారుతి సుజుకి వాగన్ఆర్ (Maruti Suzuki WagonR)
టాల్ బాయ్ డిజైన్‌తో విశాలమైన ఇంటీరియర్, అద్భుతమైన ఫ్యూయెల్ కెపాసిటీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు వాగన్ఆర్ ప్రధాన లక్షణాలు. అందుకే చాలామంది ఈ మారుతి కారును కొనడానికి ఇష్టపడతారు. గత ఆగస్టు నెలలో భారతదేశంలో 14,552 వాగన్ఆర్ కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం వాగన్ఆర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.79 లక్షలు కాగా, గరిష్టంగా రూ.7.62 లక్షల వరకు ఉంటుంది.

Top 4 Best-Selling Hatchback Cars in India Under Rs 10 Lakhs

2. మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)
రూ.6.74 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కేటగిరీకి చెందినది. ప్రీమియం కార్లకు ఉండాల్సిన స్టైలిష్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్, ఇంధన సామర్థ్యం బాలెనో ప్రత్యేకతలు. అయితే, దీని టాప్ వేరియంట్లు రూ.10 లక్షల బడ్జెట్‌ను దాటవచ్చు. 2025 ఆగస్టు నెలలో 12,549 బాలెనో కార్లు అమ్ముడయ్యాయి. గత జూలై, 2024 ఆగస్టులో కూడా దాదాపు ఇదే సంఖ్యలో బాలెనో కార్లు అమ్ముడయ్యాయి.

Top 4 Best-Selling Hatchback Cars in India Under Rs 10 Lakhs

3. మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift)
వాగన్ఆర్ మాదిరిగానే తక్కువ ధరలో లభించే స్విఫ్ట్‌కు కూడా ప్రజల్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. స్విఫ్ట్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.49 లక్షలు. ఆగస్టు నెలలో 12,385 స్విఫ్ట్ కార్లు అమ్ముడై మారుతి సుజుకి కంపెనీకి మంచి లాభాన్ని తెచ్చిపెట్టాయి. 2024లో స్విఫ్ట్ కారులో కొత్త లుక్, మెరుగుపరిచిన జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ వచ్చింది. ఇది స్పోర్టీ డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్, అద్భుతమైన ఇంధన సామర్థ్యానికి పేరుగాంచింది.

Top 4 Best-Selling Hatchback Cars in India Under Rs 10 Lakhs

4. టాటా టియాగో (Tata Tiago)
ఈ జాబితాలో మారుతి సుజుకి కాకుండా ఉన్న ఏకైక హ్యాచ్‌బ్యాక్ కారు ఇది. కానీ, మారుతి సుజుకి కార్ల అమ్మకాలతో పోలిస్తే టియాగో అమ్మకాలు తక్కువగా ఉన్నాయని గత నెల అమ్మకాల సంఖ్యను చూస్తే తెలుస్తుంది. గత ఆగస్టు నెలలో మొత్తం 5,250 టియాగో కార్లు అమ్ముడయ్యాయి. ఈ టాటా హ్యాచ్‌బ్యాక్ కారు ధర రూ.5.00 లక్షల నుండి ప్రారంభమవుతుంది. స్ట్రాంగ్ బిల్డ్, తక్కువ ధర కారణంగా టియాగోకు మార్కెట్‌లో మంచి పేరుంది. సీఎన్‌జీ, ఈవీ వేరియంట్లలో కూడా టియాగో లభిస్తుంది. టియాగో ఈవీ ఎలక్ట్రిక్ కారు కూడా రూ.10 లక్షల లోపు ప్రారంభ ధరతో లభిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారతదేశంలో రూ.10 లక్షల లోపు ధరలో ఇంకా చాలా హ్యాచ్‌బ్యాక్ కార్లు ఉన్నాయి. అయితే వాటి అమ్మకాలు పెద్దగా లేకపోవడం వల్ల వాటిని ఈ జాబితాలో చేర్చలేదు. ఈ వార్తలో పేర్కొన్న ధరలన్నీ అంచనా వేసిన ఎక్స్-షోరూమ్ ధరలు. ఇవి కారు వేరియంట్, సిటీని బట్టి మారుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, September 19, 2025, 7:22 [IST]
English summary
Top 4 best selling hatchback cars in india under rs 10 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+