ఒక్కసారి పెట్రోల్-డీజిల్ ఖర్చు లెక్క వేసుకుంటే.. ఈ CNG కార్లే బెస్ట్ అంటారు! రూ.10 లక్షల లోపు టాప్ మెడళ్లు
ఇటీవలి కాలంలో, భారతీయ ఆటోమోటివ్ మార్కెట్‌లో CNG కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే, ఈ కార్లు ఎక్కువ మైలేజీ, తక్కువ ఇంధన ఖర్చుతో ఒనర్లకు తక్కువ మెయింటనెన్స్ ఖర్చును ఇస్తాయి. పైగా ఇవి పర్యావరణ అనుకూలమైనవి. దీంతో ఈ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, CNG కార్లలో ప్రయాణం 'స్మార్ట్' ఆప్షన్ గా మారింది. ఈ కార్లు ఒక క్యూబిక్ మీటర్ గ్యాస్‌తో పెట్రోల్ కార్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి.
ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా వాహన తయారీదారులు సైతం ఈ కిట్‌తో కూడిన కార్లను ఎక్కువగా విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ కార్లతో సమానమైన ఫీచర్లతో ఈ కార్లను అందిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్న టాప్ 4 CNG కార్లను కింది కథనంలో అందించాం. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Maruti Suzuki Dzire: భారతీయ కార్ మార్కెట్లో CNG వాహనాల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, మారుతీ సుజుకీ డిజైర్ CNG తన ప్రీమియం ఫీచర్లు, అత్యుత్తమ భద్రత, అధిక మైలేజీతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. దేశంలో తక్కువ ధరకు లభించే అత్యంత ప్రీమియం CNG కార్లలో ఇది ఒకటిగా ఉంది. డిజైర్ ZXI ట్రిమ్ అత్యంత ప్రీమియం CNG మోడల్. దీని ధర వచ్చేసి రూ.9.89 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది.
ఈ మోడల్ అద్భుతమైన ఫీచర్లు, అత్యుత్తమ భద్రత, మైలేజ్ పరంగా వినియోగదారులను ఆకర్షిస్తుంది. ప్రీమియం ఫీచర్లను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణి్కుల రక్షణకు సంబంధించి మెరుగైన సేఫ్టీ ప్రమాణాలను కలిగి ఉంది. ఇది రక్షణకు సంబంధించి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఈ రోజుల్లో, CNG మైలేజ్ కలిగిన కార్ మంచి పెట్టుబడి కారణంగా డిజైర్ అందరికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

ఇది లగ్జరీ ఫీచర్లతో అదిరిపోయే డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. పవర్డ్ ORVMలను, డ్రైవర్ సీటు ఎత్తు అడ్జస్ట్ చేసుకోగల ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఆటోమేటిక్ AC, వెనుక AC వెంట్లు, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, రివర్స్ పార్కింగ్, వైర్‌లెస్ సెల్ ఫోన్ ఛార్జర్ వంటివి ఉన్నాయి. ఇది కిలో ఇంధనానికి 33.73 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.
Maruti Suzuki Swift: తక్కువ ధరలో హై-ఎండ్ ప్రీమియం ఫీచర్లతో ఎక్కువ మైలేజ్ అందించే కారు కోసం చూస్తున్న వారికి మారుతీ స్విఫ్ట్ కారు బాగా సెట్ అవుతుంది. దీని CNG (ZXI ట్రిమ్) మార్కెట్లో రూ.9.20 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది సేఫ్టీ + లగ్జరీ + ఎకానమీ కలిపిన బెస్ట్ మోడల్. స్విఫ్ట్ ఎప్పుడూ స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్‌గా పేరు తెచ్చుకుంది.
ఈ కారు అధునాతన ప్రీమియం ఫీచర్స్‌ను చాలా కలిగి ఉంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, కీలెస్ స్టార్ట్ & స్టాప్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 6-స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, వెనుక AC వెంట్స్, కంఫర్టబుల్ సీట్లు వంటి పలు అంశాలు ఉన్నాయి. ఇది స్పోర్టీ గ్రిల్, స్వీప్ట్ LED DRLs, డ్యుయల్-టోన్ ఫినిష్ వంటి అప్‌గ్రేడ్‌లతో మరింత ఆకర్షణీయంగా ఉంది.

ఇంకా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, క్యాబిన్‌ల్ డ్రైవర్లకు అలాగే, ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండే పలు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పెట్రోల్ ధరలు భారీగా ఉన్న నేపథ్యంలో ఈ మోడల్ ఇంధన ఖర్చులను చాలా వరకు ఆదా చేయడానికి ఉపయోపడుతుంది. ఇది కిలో CNGతో 32.50 కి.మీల అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. స్టైల్, మైలేజ్, కంఫర్ట్ అన్నీ కలిసిన మోడల్ కావాలంటేనే అందరికి బెస్ట్ అంటే మారుతీ స్విఫ్ట్ మాత్రమే.
Tata Punch CNG: ప్రముఖ కార్ల తయారీదారు టాటా మోటార్స్‌కు చెందిన పంచ్ మోడల్ ఇండియాలో బాగా డిమాండ్ ఉన్న కారు. కంపెనీ దీన్ని సేఫ్టీ, స్టైల్, స్మార్ట్ టెక్నాలజీ కలయికతో ఓ చిన్న బుల్లెట్‌లా డిజైన్ చేసింది. ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి దేశంలో బెస్ట కారుగా పంచ్ సీఎన్‌జీ మోడల్ ఉంది. మంచి లుక్, అదిరిపోయే ఫీచర్లు, ఇంకా సూపర్ మైలేజ్ కావాలనుకునే వారికి పంచ్ బెస్ట్ ఆప్షన్.

టాటా పంచ్‌కి బోల్డ్, స్పోర్టీ లుక్ కలిగి ఉంది. హైవేలు, సిటీ స్ట్రీట్‌లు, గ్రామీణ రోడ్లపై ఎక్కడైనా ధైర్యంగా డ్రైవ్ చేయవచ్చు. ఎక్స్‌టీరియర్ అందాన్ని పెంచడంలో పవర్‌ఫుల్ హెడ్‌లాంప్స్, అల్లాయ్ వీల్స్, LED DRLs ఆకట్టుకుంటాయి. కంపెనీ ఈ కారులో అనేక ప్రీమియం ఫీచర్లను అందించింది. వర్షం సమయంలో ఆటోమేటిక్ వైపర్లు, బయటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి సన్‌రూఫ్ వంటి అంశాలు ఉన్నాయి.
కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, మ్యూజిక్ లవర్స్ కోసం అదిరిపోయే 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కలిగి ఉంది. టాటా పంచ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగి ఉంది. ఇది కిలో ఇంధనానికి 25 నుండి 27 కి.మీ/కి.మీ మైలేజీని అందిస్తుంది. దీని ధర వచ్చేసి రూ. 10 లక్షలు ఇది కేవలం ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే, ఆన్‌రోడ్ వచ్చేసి స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది.
Tata Tigor:భారతీయ కార్ మార్కెట్లో CNG వాహనాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, టాటా టిగోర్ CNG, మారుతీ సుజుకీ స్విఫ్ట్ తర్వాత ప్రీమియం ధరలో లభించే మోడల్. XZ ప్లస్ లక్స్ ట్రిమ్ ధర రూ. 9.50 లక్షలు. ఇది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే. అనుకూల ధర, అధునాతన ఫీచర్లతో ఈ కారు భారత్‌లోనే ప్రత్యేకమైన AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికతో గుర్తింపు పొందింది.
ప్రధానంగా ఈ గేర్‌బాక్స్ ఫీచర్ మరే ఇతర CNG కారులోనూ అందుబాటులో లేదు. మిగతా సీఎన్‌జీ కార్లతో పోలిస్తే ఇది మెరుగైన సాంకేతికత, సేఫ్టీ ఫీచర్లు కలిగి ఉండటంతో మార్కెట్లో తనదైన ముద్ర వేసుకుంది. ఇది కిలో ఇంధనానికి దాదాపు 24 కి.మీ నుండి 26 కి.మీల మైలేజ్ ఇస్తుంది. ఇది అధునాతన ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌తో వచ్చింది.
ఇంకా ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, సాయంత్రం, రాత్రి కూడా స్పోర్టీ లుక్ కోసం ED DRLs,స్టైలిష్ లైట్లు, వర్షంలో ఆటోమేటిక్ ఆన్ అయ్యే వైపర్లు, పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, మ్యూజిక్ లవర్స్ కోసం అదిరిపోయే 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా వంటి పలు ఆప్షన్లు దీనిలో ఉన్నాయి. ఈ కారు సిటీ ట్రాఫిక్‌లో కూడా డ్రైవింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








