పెద్ద ఫ్యామిలీకి ఫర్ ఫెక్ట్ ఛాయిస్.. రూ. 15 లక్షల లోపు టాప్-5 బెస్ట్ 7-సీటర్ కార్లు ఇవే

పెద్ద ఫ్యామిలీకి రూ. 15 లక్షల బడ్జెట్‌లో ఒక స్టైలిష్, సౌకర్యవంతమైన, దూర ప్రయాణాలకు అనుగుణంగా ఉండే 7-సీటర్ కారు కొనాలని చూస్తున్నారా? భారతదేశంలో ఈ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ స్పేస్, సౌలభ్యం, మంచి పర్ఫామెన్స్ లభిస్తాయి. ఈ జాబితాలో, ఎంపీవీ, ఎస్యూవీ రెండు రకాల కార్లు ఉన్నాయి. మరి, భారతదేశంలో లభించే అత్యంత సరసమైన టాప్-5 బెస్ట్ 7-సీటర్ కార్లు ఏంటో ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.

1. రెనాల్ట్ ట్రైబర్ : రెనాల్ట్ ట్రైబర్ ఈ జాబితాలో ఉన్న 7-సీటర్ కార్లలో కెల్లా అత్యంత చవకైనది. దీని ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే, దీనిలోని రెండో వరుస సీట్లను స్లైడ్ చేసుకోవచ్చు.. ఫోల్డ్ చేసుకోవచ్చు. మూడో వరుస సీట్లను పూర్తిగా తీసివేయవచ్చు. దీనివల్ల ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి వీలవుతుంది.

Renault Triber

అలాగే, దీనిలో మంచి AC వెంటిలేషన్ కవరేజ్ కూడా ఉంది. చిన్న కుటుంబాలకు, పట్టణాల్లో వాడే వారికి ఇది చాలా మంచి ఆప్షన్. దీని ధర రూ. 6.3 లక్షలు నుంచి రూ. 9.17 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

2. మారుతి ఎర్టిగా : మారుతి ఎర్టిగా తన సెగ్మెంట్‌లో కింగ్‎గా ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనికి పెద్ద కిటికీలు, సౌకర్యవంతమైన సీట్లు, స్లైడ్, వంగి ఉండే మధ్య వరుస సీట్లు, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి. దీని డ్రైవింగ్ అనుభవం చాలా బాగుంటుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు దీనికి అదనపు ఆకర్షణ. దీని ధర రూ. 9.12 లక్షల నుంచి రూ. 13.41 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

Maruti Ertiga

3. మహీంద్రా బొలెరో : మహీంద్రా బొలెరో ఒక స్ట్రాంగ్ SUV. ఇది గ్రామీణ ప్రాంతాల్లో, కఠినమైన రోడ్ల మీద అద్భుతంగా పని చేస్తుంది. అయితే, దీనిలో సిట్టింగ్ కంఫర్ట్, ఇంటీరియర్ క్వాలిటీ కొంచెం పాతదిగా అనిపించవచ్చు. దీని మూడో వరుస సీట్లు పక్కకు తిరిగి ఉంటాయి. అవి పిల్లలకు ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. దీని ధర రూ. 9.81 లక్షలు నుంచి రూ. 10.93 లక్షలు ఉంటుంది.

4. మహీంద్రా బొలెరో నియో : మహీంద్రా బొలెరో నియో అనేది మహీంద్రా బొలెరో లేటెస్ట్ వెర్షణ్. బొలెరో నియోలో కుషన్ ఉన్న సీట్లు, మెరుగైన ఇంటీరియర్, ఆర్మ్‌రెస్ట్‌లు వంటి సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే, మూడో వరుస సీట్లు ఇప్పటికీ పక్కకు తిరిగి ఉంటాయి. లగేజ్ స్థలం కోసం వాటిని మడవవచ్చు. దీని ధర రూ. 9.97 లక్షల నుంచి రూ. 12.18 లక్షలు ఉంటుంది.

Mahindra Bolero

5. టయోటా రూమియన్ : టయోటా రూమియన్ నిజానికి మారుతి ఎర్టిగా రీ-బ్రాండెడ్ వెర్షన్, కానీ ఇది టయోటా బ్రాండ్‌తో వస్తుంది. ఇందులో ఎర్టిగా లాగే అద్భుతమైన స్పేస్, కూర్చునే సౌలభ్యం, క్వాలిటీ ఇంటీరియర్ ఉంటుంది. కొన్నిసార్లు దీని వెయిటింగ్ పీరియడ్ ఎర్టిగా కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి డెలివరీ త్వరగా పొందవచ్చు. దీని ధర రూ. 10.67 లక్షల నుంచి రూ. 13.96 లక్షలు ఉంటుంది.

Toyota

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం : మీ ఫ్యామిలీ పెద్దదైతే ఈ 7-సీటర్ కార్లు రూ. 15 లక్షల బడ్జెట్‌లో చాలా మంచి ఆప్షన్. ప్రతి కారుకు దాని ఓన్ స్పెషాలిటీ ఉన్నాయి. మీ అవసరాలు, బడ్జెట్, ప్రాధాన్యతలను బట్టి మీకు సరిపోయే కారును ఎంచుకోవచ్చు. సుదీర్ఘ ప్రయాణాలను ఆనందంగా మార్చుకోవడానికి ఈ కార్లు మీకు బాగా ఉపయోగపడతాయి.

Article Published On: Friday, July 25, 2025, 12:29 [IST]
English summary
Top 5 best 7 seater cars under rs 15 lakh perfect choice for your large family
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+