బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు.. లీటరు పెట్రోల్ పోస్తే చాలు..ఊరంతా తిరగొచ్చు
పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలంటే మంచి మైలేజ్ ఇచ్చే కారు ఉండాల్సిందే. ఒకప్పుడు కేవలం చిన్న కార్లు మాత్రమే మైలేజ్ ఇస్తాయని అనుకునేవారు, కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. అదిరిపోయే ఎస్‌యూవీ లుక్, అది కూడా లీటరుకు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీతో మార్కెట్లోకి వచ్చేశాయి. కేవలం రూ. 5.50 లక్షల బడ్జెట్ నుంచి లభించే ఈ సూపర్ మైలేజ్ ఎస్‌యూవీల వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
1. టాటా పంచ్ (Tata Punch) : భారత మార్కెట్లో అతి తక్కువ ధరలో లభించే బెస్ట్ మైలేజ్ ఎస్‌యూవీ ఏదైనా ఉందంటే అది టాటా పంచ్. దీని ధర కేవలం రూ. 5.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచే ప్రారంభమవుతుంది.

ఇందులో 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటరుకు 20.09 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం మైలేజ్ మాత్రమే కాదు, సేఫ్టీలోనూ దీనికి 5-స్టార్ రేటింగ్ ఉంది. బడ్జెట్‌లో అదిరిపోయే లుక్,సేఫ్టీ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
2. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Grand Vitara) : ఎస్‌యూవీ విభాగంలో అత్యధిక మైలేజీ ఇచ్చే కారుగా గ్రాండ్ విటారా రికార్డు సృష్టించింది. ఇందులోని స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల లీటరుకు ఏకంగా 27.97 కి.మీ మైలేజ్ లభిస్తుంది.

సిటీలో ప్రయాణించేటప్పుడు ఇది ఎలక్ట్రిక్ పవర్‌తో నడుస్తుంది, వేగం పెరిగినప్పుడు పెట్రోల్ ఇంజిన్‌కు మారుతుంది. దీనివల్ల పెట్రోల్ వినియోగం భారీగా తగ్గుతుంది. ప్రీమియం ఫీచర్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి సౌకర్యాలు దీని అదనపు ఆకర్షణ.
3. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Hyryder) : మారుతి గ్రాండ్ విటారాకు కజిన్ లాంటిదే ఈ హైరైడర్. ఇందులో కూడా అదే 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది కూడా లీటరుకు 27.97 కి.మీ మైలేజీని అందిస్తుంది.

టయోటా బ్రాండ్ నుంచి వచ్చే ఈ కారు మెయింటెనెన్స్ తక్కువగా ఉండటం, ఎక్కువ కాలం మన్నడం దీని ప్రత్యేకత. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు చేసే వారికి ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీ ఇంధన ఖర్చును సగానికి సగం తగ్గిస్తుంది.
4. మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Fronx) : మారుతి నుంచి వస్తున్న మరో మైలేజ్ మాస్టర్ ఫ్రాంక్స్. దీని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 21.79 కి.మీ మైలేజీని ఇస్తుంది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ సహాయంతో ఇది మంచి పర్ఫార్మెన్స్‌ను చూపిస్తుంది.

కూపే లాంటి డిజైన్‌తో స్పోర్టీగా కనిపించే ఈ కారు యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం లుక్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
5. హ్యుందాయ్ ఎక్స్టర్ (Exter) : టాటా పంచ్‌కు గట్టి పోటీనిస్తున్న హ్యుందాయ్ ఎక్స్టర్ మైలేజీలో కూడా తగ్గేదేలే అంటోంది. దీని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ లీటరుకు 19.4 కి.మీ నుంచి 20 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది.

ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, డ్యాష్ క్యామ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. దీని ధర కూడా రూ.6 లక్షల రేంజ్ నుంచే ప్రారంభమవుతుంది. ఫీచర్లు, మైలేజ్ రెండూ కావాలనుకునే వారికి ఎక్స్టర్ ఒక మంచి ఎంపిక.


Click it and Unblock the Notifications








