ఒక్కసారి చూడండి.. త్వరలో రోడ్లపై రాబోతున్న బెస్ట్ 5 న్యూ కార్స్.. పండగ సీజన్‌లో వరుసగా లాంచ్‌లు
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లలో ఒకటి. ముఖ్యంగా కార్ల విభాగంలో ఇక్కడి డిమాండ్ ప్రపంచంలోని చాలా దేశాలతో పోల్చుకుంటే ఎంతో ముందంజలో ఉంటుంది. రోడ్లపై పెరుగుతున్న వాహనాల సంఖ్య, పెరుగుతున్న మధ్యతరగతి కుటుంబాల అవసరాలు, కొత్త టెక్నాలజీలపై ఆసక్తి ఇవన్నీ కలిపి భారతదేశాన్ని ఒక అతిపెద్ద ఆటోమోటివ్ కేంద్రంగా నిలబెట్టాయి. 2025 సంవత్సరం ఈ మార్కెట్‌కు మరింత ఉత్సాహాన్ని తెచ్చేలా ఉంది. ఎందుకంటే ఈ ఏడాదిలో అనేక ఆటోమేకర్లు తమ అత్యంత ప్రతిష్టాత్మక మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. భారతీయ కస్టమర్లు ఎప్పుడూ కొత్త మోడళ్లకు, ఆకర్షణీయమైన డిజైన్‌లకు, సరికొత్త టెక్నాలజీకి ఆసక్తి చూపుతుంటారు. అందుకే ఈసారి రాబోతున్న లాంచ్‌లు మరింత ఆసక్తికరంగా మారాయి.
దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీలు రానున్న రోజుల్లో కొన్ని కార్లను ప్రజల కోసం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో టాటా సియెర్రా, మారుతి సుజుకి ఇ-విటారా, రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్, అలాగే, అంతేకాకుండా, వియత్నాం ఆటోమేకర్ విన్‌ఫాస్ట్ కూడా భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. దాని VF6, VF7 మోడళ్లు ఈ ఏడాదిలోనే విడుదల కాబోతున్నాయి. వాటి గురించి ఈ కథనంలో చూద్దాం.

Tata Sierra: ఒకప్పుడు భారతీయ SUV మార్కెట్‌లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన టాటా సియెర్రా ఇప్పుడు కొత్త అవతారంలో రాబోతోంది. ఈసారి కేవలం డిజైన్‌లోనే కాదు, పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. కొత్త సియెర్రా ఇంధన ఆధారిత మోడల్స్‌ను టాటా ఈ అక్టోబర్‌లో దసరా పండుగ సందర్భంగా లాంచ్ చేయనుంది. ధర సుమారు రూ.10 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉండే అవకాశం ఉంది.
పెట్రోల్ మోడల్‌లో శక్తివంతమైన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. డీజిల్ వెర్షన్‌లో 2 లీటర్ ఇంజిన్ శక్తిని అందిస్తుంది. 2026లో రాబోయే సియెర్రా EV మరింత సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. దీని ధర రూ.25 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చని అంచనా.ఇందులో 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉంటాయి. పూర్తి ఛార్జ్ చేస్తే 538 నుంచి 627 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని టాటా చెబుతోంది.
Maruti Suzuki e-Vitara: ఎలక్ట్రిక్ SUVల మార్కెట్ వేడెక్కుతున్న తరుణంలో, మారుతి తన మొదటి ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఎలక్ట్రిక్ SUVతో బరిలోకి దిగుతోంది. సెప్టెంబర్ 3న విడుదల కానున్న ఇ-విటారా ఇప్పటికే భారీ అంచనాలను సృష్టిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ SUV ధర రూ. 17 లక్షల నుండి రూ. 22.50 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. ఇ-విటారాలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు 49 kWh, 61 kWhలు ఉంటాయి.

Renault Kiger: రెనాల్ట్ భారత మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కంపెనీ తన ప్రాచుర్యం పొందిన SUV కిగర్‌ను కొత్త రూపంలో, అంటే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్గా తీసుకొస్తోంది. ఈ కొత్త కిగర్ ఆగస్టు 24న అధికారికంగా అమ్మకానికి రానుంది. ధర రూ. 6.50 లక్షల నుండి రూ. 11.23 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉండబోతుందని చెబుతున్నారు. ఈ ధరలో తన సెగ్మెంట్‌లోని ఇతర SUVలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.
Vinfast VF6, VF7: VF6 ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVగా రానుంది. దీని ధర రూ.18 లక్షల నుండి రూ.24 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. VF7 మరింత ప్రీమియం లుక్, ఫీల్ కలిగిన SUV. ఇది కూడా సెప్టెంబర్‌లోనే లాంచ్ కానుంది. దీని ధర రూ. 23 లక్షల నుండి రూ. 25 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఇది కూడా సెప్టెంబర్‌లోనే అమ్మకానికి రానుంది.



Click it and Unblock the Notifications








