రాజులా సింహాసనంపై కూర్చున్న ఫీలింగ్ ఇచ్చే కార్లు! ఫ్యామిలీ టూర్ ఈ కార్లలో అయితే ఖచ్చితంగా మర్చిపోలేనిది!
ప్రస్తుతం భారతదేశంలో కుటుంబ కార్లకు ఉన్న డిమాండ్ మరింత గట్టిగా ఉంది. ఏడు లేదా ఎనిమిది మంది కూర్చోగలిగే కార్లు ఇప్పుడు కుటుంబ ప్రయాణాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందరు కలిసి ఒకే కారులో ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే ఆ మజాయే వేరు. సాధారణంగా సౌకర్యవంతమైన 3-వరుసల సీటింగ్ కార్లు పెద్ద కటుంబం కలిగిన వారికి బాగా అనుకూలంగా ఉంటాయి. మధ్య వరుస సీట్ల ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఎందుకంటే కుటుంబంతో కలిసి ట్రావెల్ చేసే సమయంలో వీటి సీటింగ్ చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. మధ్య సీట్లు ఎక్కువగా పెద్ద వయస్సు గల వారు ఎక్కువగా కూర్చోడానికి అనుకూలంగా ఉంటాయి. అందుకే అందరూ ఈ మధ్య వరుస సీట్లను బెంచ్ సీట్లకు బదులుగా కెప్టెన్ సీట్లుగా మార్చాలని కోరుకుంటున్నారు.
సాధారణ బెంచ్ సీట్లకు భిన్నంగా, కెప్టెన్ సీట్లు వ్యక్తిగత స్పేస్, ఆర్మ్ రెట్లు, మెరుగైన లెగ్‌రూమ్‌ను అందిస్తాయి. ఇది కేవలం లగ్జరీకి మాత్రమే కాకుండా పెద్దలు క్షేమంగా, వారి కంఫర్ట్‌కు బాగా సెట్ అవుతాయి. ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా మిడిల్ శ్రేణి కార్లు కూడా కెప్టెన్ సీట్లను కలిగి ఉంటున్నాయి. అలాంటి మోడళ్ళు చాలా ఉన్నాయి. వాటి గురించి కింది కథనంలో తెలుసుకుందాం.

Kia Carens: కియా కారెన్స్‌కు చెందిన మిడ్-వేరియంట్ ప్రెస్టీజ్ (O), టాప్-వేరియంట్ లగ్జరీ ప్లస్‌లలో రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇది మార్కెట్లో రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ప్రెస్టీజ్ (O) వేరియంట్ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌లో లభిస్తుంది. ఇది 115 bhp పవర్, 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఈ ఇంజిన్‌కు జోడించారు.
లగ్జరీ ప్లస్‌లోని 1.5-లీటర్ టర్బో డీజిల్ వేరియంట్ 116 bhp పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. మరో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 bhp పవర్, 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్‌ను దీనికి జత చేశారు. ప్రారంభ ధర రూ.11.99 లక్షల నుండి టాప్ వేరియంట్ రూ.19.49 లక్షల వరకు ఉంది.

Maruti XL6: మారుతీ ఎక్స్‌ఎల్6 ప్రీమియం అనుభూతిని అందించడంలో ముందుంటుంది. ఇది ఫ్యామిలీ ఒక స్మార్ట్ ఎంపికగా నిలుస్తోంది. రెండవ వరుసలో కెప్టెన్ సీట్లను అందించడం XL6 ప్రత్యేకత. ఇది ప్రయాణికులకు అదనపు సౌకర్యాన్ని, వ్యక్తిగత ఖాళీని కల్పిస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు సౌకర్యంగా ఉంటుంది. XL6 లో 1.5 లీటర్ పెట్రోల్ మోటార్ ఉంది, ఇది 103 bhp పవర్, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంది. XL6 CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది మిగతా వాటితో పోలిస్తే మరింత ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడే ఈ mpv కారు ప్రీమియం టచ్ కలిగి ఉంటుంది. ధరల పరంగా చూస్తే, XL6 ధర ప్రారంభంలో రూ.11.71 లక్షల నుండి రూ.14.87 లక్షల(ఎక్స్‌షోరూమ్) వరకు ఉంది.

MG Hector Plus: ఎంజీ హెక్టర్ ప్లస్ భారతీయ వినియోగదారులు అత్యంత ప్రీమియం లుక్‌ను కలిగించే మోడల్. ఇది అన్ని వేరియంట్లలో కెప్టెన్ సీట్లను కలిగి ఉంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కెప్టెన్ సీట్లు, ప్రయాణికులకు ప్రీమియం కార్ అనుభూతిని అందిస్తాయి. ఫ్రీగా అనిపించే లెగ్రూమ్, వ్యక్తిగత స్పేస్, రిలాక్స్డ్ పోజిషనింగ్ ఇవన్నీ ప్రయాణాలను మరింత హాయిగా మారుస్తాయి. దీన్ని పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 143 bhp పవర్, 550 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ 170 bhp పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ డీజిల్ వేరియంట్ ప్రస్తుతం మాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే అందుబాటులో ఉంది. ధర రూ. 17.50 లక్షల నుండి రూ. 23.87 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది.

Mahindra Scorpio Classic: కెప్టెన్ సీట్ల వేరియంట్‌ను మహీంద్రా ప్రత్యేకంగా స్కార్పియో క్లాసిక్ S11 ట్రిమ్‌లో అందిస్తోంది. ఇవి రెండవ వరుసలో కూర్చునే వారికి అదనపు వెసులుబాటుతో పాటు, వ్యక్తిగత స్పేస్‌ను అందించేటటువంటి డిజైన్‌తో రూపొందించబడ్డాయి. ఇది 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో 130 bhp పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.
ధర విషయంలో చూస్తే, S11 ట్రిమ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.17.35 లక్షలు. ఈ ధరకు ఒక దృఢమైన SUV బాడీ, పవర్‌ఫుల్ ఇంజిన్, కెప్టెన్ సీట్ల సౌకర్యంతో లభించడం కారణంగా దీనికి బాగా డిమాండ్ ఏర్పడింది. ఇది రఫ్ అండ్ టఫ్ డ్రైవింగ్‌కు అనువైన పనితీరుతో SUV ప్రేమికులకు బాగా ఇష్టమైన మోడల్‌గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆఫ్-రోడ్ ట్రిప్స్, హైవే మార్గాల్లో కూడా ఇది కంఫర్ట్ డ్రైవింగ్‌ను అందిస్తుంది.
Tata Safari: టాటా సఫారీ రోడ్ల మీద దూసుకుపోయే విప్లవాత్మక డిజైన్ మాత్రమే కాదు, అందులో ఉండే సదుపాయాలతో కూడా ఆకట్టుకుంటుంది. అకంప్లిష్ ప్లస్‌లో ప్రత్యేకతగా రెండవ వరుసలో కెప్టెన్‌ను అందించారు. ఇది 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో 170 bhp పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సఫారీ అకంప్లిష్ ప్రారంభ ధర రూ. 25.1 లక్షల నుండి రూ. 27.25 లక్షల(ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.
Toyota Innova Crysta: టయోటా ఇన్నోవా క్రిస్టా MPV అన్ని వేరియంట్లలో కెప్టెన్ సీటు అందించారు. ప్రస్తుతం, ఇది డీజిల్ ఇంజిన్ ఎంపికతో మాత్రమే అమ్మకానికి ఉంది. 2.4-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ 150 bhp పవర్, 343 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. దీని G వేరియంట్ ధర రూ.19.99 లక్షల నుండి రూ.26.82 లక్షల(ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.


Click it and Unblock the Notifications








