ఒక్కో కారుకు ఒక్కో ప్రత్యేకత.. పెద్ద ఫ్యామిలీ కలిసి సరదాగా ట్రిప్‌కు వెళ్లడానికి బెస్ట్.. త్వరలోనే రాక

భారతదేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో అట్టహసంగా జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో వాహన తయారీదారులు తమ కొత్త మోడళ్లను ప్రపంచానికి పరిచయం చేశారు. వీటిలో కొన్నింటిని ఇప్పుడే మార్కెట్లోకి విడుదల చేయగా, మరికొన్నింటిని కాన్సెప్ట్ మోడల్‌గా ఆవిష్కరించారు. జనవరి 17న భారత మండపంలో మొదలైన కార్యక్రమం 22వ తేదీ వరకు జరిగింది. అనేక కొత్త మోడళ్లు వాహన ప్రియులను ఎంతో ఆకట్టుకున్నాయి. చిత్ర విచిత్రమైన వాహనాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఈవెంట్‌లో ముఖ్యంగా ఫ్యామిలీ కార్స్ అధునాతన డిజైన్, ఫీచర్స్‌తో అలరించాయి. 2025 ఆటో ఎక్స్‌పో కార్యక్రమంలో పెద్ద కుటుంబాలకు అనువుగా ఉండే 7 సీటర్ కార్లను కొన్ని కంపెనీలు ప్రదర్శనకు ఉంచాయి. వాటిలో కొన్నింటి గురించి క్రింది కథనంలో చూద్దాం.

Hyundai Ioniq 9: హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐయోనిక్ 9 ఎలక్ట్రిక్ SUV ఆటో ఎక్స్‌పోలో సందర్శకులను కనువిందు చేసింది. ఇది 6, 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. ఈ కారులో 110.3kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌తో ఇది ఏకంగా 620 కి.మీల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది అద్బుతమైన డిజైన్‌తో కనిపిస్తుంది. మూడు వరుసల సీట్లతో పెద్ద కుటుంబం ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది.

Hyundai Ioniq 9 In Auto Expo

ఈ కారు ఇంటీరియర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 12-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్,ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ సెటప్‌, ప్రయాణికుల సేఫ్టీ కోసం 10 ఎయిర్‌బ్యాగ్‌లు, సెన్సార్‌లతో ADAS సూట్, హైవే డ్రైవింగ్ అసిస్ట్-2 ఫీచర్, ABS, EBD, రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్స్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి పలు ఫీచర్స్ ఉన్నాయి.

Skoda kodiaq:స్కోడా కంపెనీ 2025 ఆటో ఎక్స్‌పోలో పలు మోడళ్లను ప్రదర్శించింది. అయితే వాటిలో రెండు కుటుంబాలు కూర్చోడానికి అనుకూలంగా ఉండే 7 సీటర్ ఆప్షన్‌లో కోడియాక్ (kodiaq)ను ఆవిష్కరించింది. ఇది 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 190 bhp పవర్, 370 Nm టార్క్‌ను ఇంజిన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన 4X4 డ్రైవ్‌ట్రెయిన్ కలిగి ఉంది.

2025 Skoda Kodiaq

ఈ కారులో అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. క్యాబిన్ థీమ్ ఆకర్షణీయంగా అనిపిస్తుంది. కొత్త కోడియాక్‌లో 13-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12-స్పీకర్ సౌండ్ సిస్టం, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10-కలర్ యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, స్టాండర్డ్‌గా తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), చుట్టు చూడటానికి 360 డిగ్రీల కెమెరా వంటి పలు ఫీచర్స్ ఉన్నాయి.

MG Majestor: ఎంజీ మోటార్స్‌కు చెందినటువంటి మేజిస్టర్ కొత్త మోడల్ 2025 ఆటో ఎక్స్‌పో ఈవెంట్‌లో ప్రదర్శించబడింది. ఇది అతి త్వరలోనే మార్కెట్లోకి విడుదల కాబోతుంది. ఇది 7 సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. లాంచ్ గురించి కంపెనీ కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. అయితే ఈ ఏడాదిలోనే ఇది లాంచ్ అవుతుందని మాత్రం తెలుస్తుంది. ఇది 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. మార్కెట్లో ఫార్చ్యూనర్‌కు పోటీ ఇస్తుంది.

Top 7 Seater Mg Majestor Car In Auto Expo

MG M9: 2025 ఆటో ఎక్స్‌పోలో 7, 8 సీట్ల ఆప్షన్లలో MPV విభాగంలో అందరినీ ఆకట్టుకున్న మోడల్ ఎంజీ ఎం9 సరికొత్త ఫీచర్స్‌తో విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్‌లు ఇప్పుడు ఓపెన్ చేశారు. ఏప్రిల్‌లో డెలివరీ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 90kWh లిథియం-అయాన్ బ్యాటరీని అందించారు. రెండు కుటుంబాలకు ఈ కారు సరిపోతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 23, 2025, 9:10 [IST]
English summary
Top 7 seater suv mpv cars skoda kodiaq hyundai ioniq 9 mg majestor m9 showcased at auto expo 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+