రైళ్లు, బస్సులు అవసరం లేదు.. ఈ కార్లలో మొత్తం ఫ్యామిలీ ఈజీగా వెళ్లచ్చు! 26+ కి.మీ మైలేజ్, 7 సీటింగ్..
భారతదేశంలో కుటుంబ వ్యవస్థల్లో మార్పులు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల సంఖ్య పెరుగుతుండగా, ఇదే సమయంలో చిన్న కుటుంబాల సంఖ్య కూడా అధికమవుతుంది. ఈ నేపథ్యంలో, పెద్ద కుటుంబాల కోసం అధిక సీటింగ్ సామర్థ్యం ఉన్న కార్లు కొనాలని అనేక మంది భావిస్తున్నారు. అయితే, సరైన కారు ఎంపిక చేయడం చాలామందికి పెద్ద సవాల్‌గా మారుతోంది. ఈ సమస్యను తొలగించేందుకు ప్రస్తుతం మార్కెట్లో పెద్ద కుటుంబాలకు అనువుగా ఉన్న టాటా సఫారీ, మారుతీ సుజుకీ ఎర్టిగా, రెనాల్ట్ ట్రైబర్, టయోటా రూమియన్, మహీంద్రా స్కార్పియో క్లాసిక్, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి 7-సీటర్ కార్లను హైలైట్ చేస్తూ, వాటి విశేషాలను క్లుప్తంగా వివరించాము.
Maruti Suzuki Ertiga:మారుతీ సుజుకీ ఎర్టిగా కుటుంబ ప్రయాణాలకు బెస్ట్ ఎంపిక. సౌకర్యం, భద్రత, పెరిగిన మైలేజీతో ఈ కారును ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఈ ఏంపీవీ (MPV) ధర రూ. 8.84 లక్షల నుండి రూ. 13.13 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 7 సీటర్ ఆప్షన్‌లో మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. లోపల లగేజీ స్థలం కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఇది 1.5-లీ పెట్రోల్ అలాగే CNG ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే 20.3 నుండి 26.11 kmpl వరకు ఇస్తుంది. ఈ కారు ఇంటీరియర్ క్యాబిన్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ప్యాడిల్ షిఫ్టర్లు, లోపల కూర్చున్న ప్రయాణికుల భద్రత కోసం 4 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి వాటిని కలిగి ఉంది.
Toyota Rumion: టయోటా రూమియన్ 7 సీటర్ కారు. ఈ ఎంపీవీలో కూడా పెద్ద కుటుంబం అంతా కలిసి జర్నీ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. విశాలమైన సీటింగ్, మైలేజ్, స్టైలిష్ డిజైన్‌తో మీ కుటుంబ ప్రయాణాలను మరింత సులభం చేస్తుంది. దీని ధర రూ. 10.54 లక్షల నుండి రూ. 13.83 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మైలేజ్ చూసినట్లయితే 20.11 నుండి 26.11 kmpl వరకు వస్తుంది.

ఇది డజన్ల కొద్ది ఫీచర్స్‌ను కలిగి ఉంది. క్యాబిన్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ AC, క్రూయిజ్ కంట్రోల్, ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులను రక్షించడానికి 4-ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), వెనుక పార్కింగ్ కెమెరా వీటితో పాటు మరిన్ని అదనపు సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
Tata Safari: పెద్ద ఫ్యామిలీ వినియోగదారులకు బెస్ట్ కార్లలో టాటా సఫారీ ఒకటి. ఇది 6/7 సీట్ల ఆప్షన్లలో అందుబాటులో ఉంది. విశాలమైన ఇంటీరియర్, శక్తివంతమైన ఇంజిన్, అత్యాధునిక ఫీచర్లతో, ఇది ఒక పూర్తి కుటుంబ కారుగా పేరు తెచ్చుకుంది. ఇది 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌లో లభిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జత చేశారు. ధర రూ. 15.50 లక్షల నుండి రూ. 27 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

సఫారీ కేవలం పెర్ఫార్మెన్స్ లోనే కాకుండా, ఫీచర్ల విషయంలో కూడా దూసుకెళ్తోంది. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 10-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ AC,భద్రత విషయానికి వస్తే టాటా సఫారీ అత్యాధునిక టెక్నాలజీతో నిండి ఉంది 7-ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360-డిగ్రీ కెమెరా వంటి మొదలగుని దీనిలో ఉన్నాయి.
Mahindra Scorpio Classic:భారతీయ రహదారులపై ప్రభావం చూపిన SUVలలో మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. దీని ధర రూ.13.62 లక్షల నుండి రూ. 17.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు జోడించబడింది. మైలేజ్ విషయానికి వస్తే, 16 కి.మీలుగా ఉంది. 7 సీటర్‌తో పెద్ద కుటుంబానికి బెస్ట్ మోడల్.
దృఢమైన నిర్మాణం, శక్తివంతమైన ఇంజిన్, మెరుగైన డిజైన్‌తో, స్కార్పియో క్లాసిక్ ఎప్పటికీ ట్రెండింగ్‌లో ఉండే SUV గా నిలుస్తోంది. స్కార్పియో క్లాసిక్ S,S11 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులను రక్షించడానికి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఇతర సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

Renault Triber: ఇండియాలో ప్రసిద్ధ ఎంపీవీ కార్లలో రెనాల్ట్ ట్రైబర్ ఒకటి. తక్కువ ధర, ఎక్కువ స్థలం, లేటెస్ట్ ఫీచర్లతో కుటుంబ ప్రయాణాలను మరింత ఆనందంగా మార్చే ఈ కారును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీని ధర రూ. 6 లక్షల నుండి రూ. 8.97 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 1-లీటర్ నేచురల్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది. 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జోడింంచబడింది.
రెనాల్ట్ ట్రైబర్ 18.2 నుండి 20 కి.మీ. మైలేజీని అందిస్తుంది. లాంగ్ డ్రైవ్‌లు చేసేవారికి ప్రయోజనకరం. 7-సీటర్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉండటంతో, ఇది పెద్ద కుటుంబాలకు సరైన ఎంపికగా నిలుస్తోంది. ఈ కారులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 4-ఎయిర్‌బ్యాగులు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
Toyota Innova Crysta: భారతీయ మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన MPV లలో ఒకటైన టయోటా ఇన్నోవా క్రిస్టా, కుటుంబ ప్రయాణాల కోసం ప్రీమియం ఎంపిక. విశాలమైన ఇంటీరియర్, శక్తివంతమైన ఇంజిన్, లగ్జరీ ఫీచర్లతో ఇది ప్రీమియం ఎంపీవీ సెగ్మెంట్‌లో లీడర్‌గా కొనసాగుతోంది. దీని ధర రూ. 19.99 లక్షల నుండి రూ. 26.82 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 7/8 సీటర్ కారు.
ఇది 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ను కలిగి ఉంది. మైలేజ్ పరంగా 12 kmpl వరకు ఇస్తుంది. ఇది డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో వచ్చింది. లోపల 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, AC వెంట్స్, 7 ఎయిర్‌బ్యాగులు, VSC (వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్) వంటి పలు ఫీచర్స్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








