ఇండియన్ ఆర్మీ వాడే శక్తివంతమైన వాహనాలు.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తాయి.. సరిహద్దులో వీటిదే కీలక పాత్ర
భారత సైన్యం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఎంత శక్తివంతమైనదో అందరికి తెలిసిందే. దేశంలోని హిమాలయ పర్వతాల నుండి రాజస్థాన్ ఎడారుల దాకా, ప్రతి అంచును మన సైన్యం ఎంతో ధైర్యంగా కాపాడుతుంది. దేశంలోని ప్రతి భూభాగాన్ని రక్షించడంలో సైన్యం ఉపయోగించే వాహనాలు కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణ ప్రజలు రోజు ఉపయోగించే వాహనాలు కాకుండా దేశ రక్షణకు ప్రత్యేకత కలిగిన శక్తివంతమైన వాటిని వారు వాడుతుంటారు. ఈ దేశంలో, ప్రతి అంచును చేరుకోవాలంటే కేవలం దళసైన్యం మాత్రమే కాదు, వారికి తోడుగా ఉండే శక్తివంతమైన వాహనాలూ అవసరం. ఒక వైపు ట్యాంకులు, రాకెట్ లాంచర్లు ఉండగా, మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం ఆధునిక SUVలు, ట్రక్కులు కూడా కీలకంగా మారాయి. సైన్యంలో వాహనాల పాత్ర, ఒక గేమ్‌చేంజర్‌లా ఉంటుంది.
వీటివల్ల నిత్యం మారుతున్న యుద్ధ రంగాలలో సైనికులు తమ పటుత్వాన్ని నిలుపుకుంటారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం మేడ్ ఇన్ ఇండియా వాహనాలపై చాలా కాలంగా ఎక్కువ దృష్టి పెట్టింది. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన టాటా, మహీంద్రా కంపెనీల SUVలు కేవలం పౌర వినియోగదారులకు మాత్రమే కాదు, సైనిక అవసరాలకూ చక్కగా తగినట్లుగా రూపొందించబడ్డాయి. హిమాలయాలలో మంచుతో కప్పబడిన మార్గాల్లో, రాజస్థాన్ ఎడారుల్లో సైనిక వాహనాల అవసరం ఎంతో ఉంది.

ఇవి కేవలం గమ్యస్థానానికి చేరేందుకు మాత్రమే కాదు, అవసరమైన వస్తువుల రవాణా, మెడికల్ ఈవాక్యుయేషన్, హై కమాండ్ తిగడానికి కీలకం. వీటిలో చాలావరకు శత్రువు ఏకాగ్రత తగ్గించేందుకు ఉపయోగించే కామొఫ్లాజ్ పెయింటింగ్, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, రన్నింగ్ బోర్డ్‌లు వంటి ప్రత్యేక ఫీచర్లు ఉండటం గమనించదగ్గ విషయం. మొత్తంగా చూస్తే, భారత సాయుధ దళాలకు వాహనాలు కీలకం. ప్రస్తుతం సైన్యంలో కీలక పాత్ర పోషిస్తున్న వాహనల గురించి కింద చూద్దాం.
Force Gurkha: భారత సైన్యం తన అవసరాలకు అనుగుణంగా వాహనాలను ఎంచుకునే విషయంలో ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఫోర్స్ మోటార్స్ తయారు చేసిన గూర్ఖా SUVని పెద్దఎత్తున సైన్యం ఉపయోగిస్తుంది. కొత్తగా అప్‌డేట్ అయిన ఫోర్స్ గూర్ఖా గత సంవత్సరం 3-డోర్, 5-డోర్ వేరియంట్లలో విడుదల అయింది. దాని ధరలు ఎక్స్-షోరూమ్ స్థాయిలో వరుసగా రూ. 16.75 లక్షలు నుండి రూ. 18 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి.

దీని శక్తివంతమైన పనితీరుకు మెచ్చిన సైన్యం 2025 మార్చిలో 2,978 యూనిట్లను తన రక్షణ ఫ్లీట్‌లో చేర్చుకుంది. ఇది సాధారణ SUV కాదు, పూర్తిగా సైనిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడినట్లు అనిపిస్తుంది. గూర్ఖాలో ఉన్న ఫ్రంట్ ఇండిపెండెంట్ సస్పెన్షన్, ఫుల్ లాకింగ్ డిఫరెన్షియల్స్, 233 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ లాంటి లక్షణాలు, కఠిన భూభాగాల్లోను, దారుల్లేని దట్ట అడవులలోను, ఎత్తైన పర్వత మార్గాల్లోను నిర్బంధం లేకుండా ప్రయాణించేందుకు తోడ్పడతాయి.
అంతేకాకుండా, ఈ కారులో 35 డిగ్రీల గ్రేడబిలిటీ, 700 మిల్లీమీటర్ల వాటర్ వేడింగ్ కెపాసిటీ కలిగి ఉండటంతో, వరద ప్రాంతాలు, పొడి ఎడారులు, మంచుతో కప్పబడిన మార్గాలు అన్నీ గూర్ఖా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంది. ఇది 2.6-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో 138 bhp పవర్, 320 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది దాని శక్తివంతమైన పెర్ఫామెన్స్‌తో భారత సైన్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

Mahindra Scorpio Classic: భారత సైన్యం అవసరాలను తీర్చడంలో మహీంద్రా రూపొందించిన స్కార్పియో క్లాసిక్ SUV అత్యుత్తమైన ఆప్షన్. సాధారణ ప్రజలకు ఎంతో నచ్చిన ఈ మోడల్ సైన్యాన్ని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇది ఆలివ్ గ్రీన్ కలర్‌లో, మిలిటరీ వాతావరణానికి తగ్గట్టుగా కనిపించేలా తయారుచేయబడింది. సస్పెన్షన్, టయరింగ్, ప్రొటెక్షన్ మెషర్‌లు అన్నీ కూడా బాగా ఉంటాయి. కఠిన రోడ్లపై కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది.
దీని ఇంజిన్ విషయానికి వస్తే, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 130 bhp పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ స్పీడులో కూడా గరిష్ట శక్తిని అందించగల సామర్థ్యం దీనికుంది. ప్రత్యేకంగా రూపొందించిన 4x4 డ్రైవ్‌ట్రెయిన్, ఎలాంటి భూభాగమైనా, మడుగు మార్గాలైనా, ఇసుక ఎడారులైనా లేదా మంచుతో కప్పబడిన ట్రాక్‌లైనా, ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా వాటిని దాటుకుంటూ ముందుకు సాగుతుంది.

Maruti Suzuki Gypsy: భారత సైన్యంలో మారుతీ జిప్సీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఫోర్స్ గూర్ఖా, మహీంద్రా స్కార్పియో క్లాసిక్ వంటి లేటెస్ట్ SUVలు సైన్యంలోకి ప్రవేశించేలోపే, జిప్సీ చాలా సంవత్సరాలుగా సైనిక అవసరాలకు సేవలందిస్తూ వచ్చింది. ఇవాళ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇది విధులు నిర్వర్తిస్తూ కనిపించడం సాధారణమే. ఇది చాలా తేలికైన డిజైన్‌ను కలిగి ఉంది. 4x4 వ్యవస్థ, తక్కువ నిర్వహణ ఖర్చుతో సేవలు అందిస్తుంది.
ఈ వాహనం 1.3-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 80 bhp పవర్, 103 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది తక్కువ బరువు, మాన్యువల్ డ్రైవింగ్ మెకానిజంతో కలిపి, ఈ వాహనాన్ని క్లిష్టమైన మార్గాల్లో కూడా మెరుగ్గా నడిపిస్తుంది. సైన్యంలో మారుతీ జిప్సీని చూసినప్పుడు, ఒక ప్రత్యేకమైన గుర్తుగా మారింది. పరేడ్ మైదానాలపై సైనికులు దీనిపై నిలబడి కవాతు చేయడం, సరిహద్దుల వద్ద గస్తీ విధుల్లో తిరుగుతుంటారు.
Toyota Hilux: టయోటా హిలక్స్ భారత సైన్యంలో ఒక శక్తివంతమైన వాహనం. తన బలమైన నిర్మాణంతో, విశ్వసనీయ పనితీరుతో, రఫ్ అండ్ టఫ్ భూభాగాల్లో సులభంగా నడిచే సామర్థ్యంతో హిలక్స్, ప్రత్యేకించి సైనిక అవసరాలకు ఎంతో అనువైనదిగా నిరూపించుకుంది. ఇది బలిష్టమైన డిజైన్, అన్ని రకాల కఠిన పరిస్థితుల్లో కూడా సాఫీగా ప్రయాణిస్తుంది. సామగ్రి రవాణా, గస్తీ వంటి కార్యాల కోసం ఇది ఉపయోగపడుతోంది.
భారత సైన్యం ఇప్పటికే ఈ ట్రక్‌ను తన నౌకాదళ వినియోగంలో చేర్చింది. దీని ఇంజిన్ విషయానికి వస్తే, 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 204 bhp పవర్, 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. క్లిష్టమైన మార్గాల్లో, ఎత్తైన ప్రదేశాల్లో లేదా ఎడారుల పొడవైన మార్గాల్లో కూడా మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇంజిన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఫుల్ టైమ్ 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అందించారు.


Click it and Unblock the Notifications








