తక్కువ బడ్జెట్‌లో 7-సీటర్ కారు కావాలా? రూ.10 లక్షల లోపే దొరికే ఇండియా బెస్ట్ కార్లు ఇవే!
ఇండియాలో కుటుంబంతో చేసే ప్రయాణాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. చిన్నా-పెద్దా అందరూ ఒకే కారులో కలిసి ప్రయాణిస్తే వచ్చే ఆనందం, కలిసికట్టుగా గడిపే ఆ క్షణాల విలువ చెప్పలేనిదే. అలాంటి ఫ్యామిలీ ట్రిప్స్‌కి వెళ్తుంటే స్పేస్ ఉన్న కారు ఎంత అవసరం అవుతుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే మార్కెట్‌లో 7-సీటర్ లేదా అంతకంటే ఎక్కువ సీటింగ్ ఆప్షన్‌తో వచ్చే కార్లకు డిమాండ్ పెరుగుతోంది. కంఫర్ట్, స్పేస్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ అనుభవం ఇవన్నీ కలిపి ఇలాంటి కార్లను చాలా మంది మొదటి ఎంపికగా తీసుకుంటున్నారు. అక్టోబర్ నెలలో కూడా ఎంపీవీ కార్లు మెరుగైన గణంకాలను నమోదు చేశాయి. గత నెలలో అమ్మకాల్లో టాప్‌లో నిలిచిన రూ. 10 లక్షల లోపు ధరలో అత్యధికంగా అమ్ముడైన MPV మోడళ్లను ఈ కింది కథనంలో చూద్దాం.
Maruti Suzuki Ertiga: మారుతి సుజుకి ఎర్టిగా భారతీయ కుటుంబాల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న MPV. అక్టోబర్ 2025లో మారుతి కొత్తగా అప్‌డేట్ చేసిన ఎర్టిగాను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.8.80 లక్షలు ఉండటం, ఫీచర్ల దృష్ట్యా ఇది మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే బెస్ట్ MPVగా మారింది. ఇందులోని విశాలమైన ఇంటీరియర్, అందంగా డిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్ ఉంటాయి.

ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో చెప్పాలంటే, అక్టోబర్ నెలలోనే 20,087 ఎర్టిగా కార్లు అమ్ముడవడం ఉదాహరణ. మూడు వరుసలుగా ఉన్న ఏడు సీట్లు ప్రతి ప్రయాణాన్ని కుటుంబమంతా కలిసి అనుభవించేలా చేస్తాయి. CNG వేరియంట్‌కి మార్కెట్‌లో ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. పెద్ద కుటుంబం కలిగి ఉన్నవారైనా, తరచుగా ప్రయాణాలు చేసే వారైనా, సౌకర్యవంతమైన, నమ్మకమైన 7-సీటర్ కారు కోసం చూస్తే ఎర్టిగా ఇప్పటికీ మొదటి ఎంపికగానే ఉంటుంది.
Mahindra Bolero/Bolero Neo: మహీంద్రా బొలెరో మరియు బొలెరో నియో.. పేర్లు దగ్గరగా ఉన్నా, స్టైల్, డిజైన్, రోడ్డు ప్రెజెన్స్ విషయాలకి వస్తే రెండూ తమతమ ప్రత్యేకతలతో నిలిచే మోడల్స్. అక్టోబర్ 2025లో ఇవి మొత్తం 14,343 యూనిట్ల అమ్మకాలను సాధించాయి. ఇది గత నెలతో పోల్చితే పెద్ద ఎత్తున పెరుగుదల. ఈ సంఖ్యలు ఇప్పటికీ బొలెరో సిరీస్‌కి భారతీయ మార్కెట్‌లో ఉన్న బలం ఎంత ఉందో స్పష్టంగా చెబుతున్నాయి.

ధర విషయానికి వస్తే, బొలెరోని దాదాపు రూ.7.99 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో కొనొచ్దుచు. అందుబాటులో ఉండే ధర, నమ్మకమైన బిల్డ్ క్వాలిటీ, లోడ్లు మోయగలిగే శక్తి వంటి కారణాల వల్ల గ్రామీణ మార్కెట్‌లో ప్రత్యేక ఆదరణ పొందుతోంది. ఇక 20 సంవత్సరాలకు పైగా అమ్మకాల్లో కొనసాగుతున్న బొలెరో తన శక్తివంతమైన ఇంజిన్, దీర్ఘకాలికత, మెరుగైన రీపేర్ అండ్ మెయింటెనెన్స్ అనుభవాలతో ఇప్పటికీ మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది
Maruti Suzuki Eeco: మారుతి సుజుకి ఈకో భారత రోడ్లపై కనిపించే అత్యంత వినియోగదారులకు అనువైన వాహనాలలో ఒకటి. ఇది సాధారణంగా కార్గో రవాణా కోసం విస్తృతంగా ఉపయోగించబడుతున్నప్పటికీ, ప్యాసింజర్ వ్యాన్‌గా కూడా సమానమైన డిమాండ్ అందుకుంటోంది. 5-సీటర్, 6-సీటర్ ఆప్షన్లలో లభించే ఈకో, పెట్రోల్‌తో పాటు CNG వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉండటం వల్ల మరింత ఆర్థిక ప్రయోజనాన్ని ఇస్తుంది.

అక్టోబర్ 2025లో మొత్తం 13,537 యూనిట్లు అమ్ముడవడం, దేశవ్యాప్తంగా ఈ మోడల్‌కు ఉన్న విస్తృత ప్రజాదరణకు నిదర్శనం. నగరాల్లో చిన్న వ్యాపారాలకైనా, గ్రామీణ ప్రాంతాల్లో డైలీ ట్రాన్స్‌పోర్ట్ అవసరాలకైనా, కుటుంబం కోసం సులభంగా ప్రయాణించేందుకు అయినా, ఈకో తన వినియోగంతో అందరికీ పనికొచ్చే వాహనంగా నిలుస్తోంది. అదనంగా, దాదాపు రూ.5.21 లక్షల ప్రారంభ ధర ఉండటం దీన్ని అత్యంత అందుబాటులో ఉన్న, ఆర్థికమైన ఎంపికగా మారుస్తుంది.
Renault Triber: రెనాల్ట్ ట్రైబర్ భారత మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కాంపాక్ట్ MPV. ఇందులో ఏడు సీట్ల సౌకర్యం లభించడం ఈ సెగ్మెంట్‌లో దాదాపు విభిన్నమైన కాన్సెప్ట్. దాదాపు రూ.5.76 లక్షల ప్రారంభ ధరతో లభించే ట్రైబర్, బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉన్న కుటుంబాలకు మంచి విలువను అందిస్తుంది. అక్టోబర్ 2025 నాటికి 3,170 ట్రైబర్ యూనిట్లు అమ్ముడవడం, దీని స్థిరమైన డిమాండ్ కొనసాగుతున్నదని స్పష్టంగా చూపిస్తుంది.


Click it and Unblock the Notifications








