కొత్త ఎస్‌యూవీ కొనాలనుకుంటున్నారా? అయితే పది లక్షల లోపు అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు ఇవే

ఆగస్టు 2025 నెల అమ్మకాల గణాంకాల ప్రకారం.. రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో లభించే టాప్ ఎస్‌యూవీ కార్ల జాబితాలో టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, మారుతి సుజుకి ఫ్రాంక్స్, టాటా పంచ్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వంటివి ముందున్నాయి.

ఈ అమ్మకాల వివరాలు తయారీదారులు డీలర్‌షిప్‌లకు పంపిన వాహనాల సంఖ్య ఆధారంగా రూపొందించారు. చాలా ప్రముఖ ఎస్‌యూవీ కార్ల ప్రారంభ వేరియంట్‌లు రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటి ఆగస్టు నెల అమ్మకాల వివరాలను ఇప్పుడు చూద్దాం.

Top SUVs Under Rs 10 Lakh August 2025 Sales Report

టాటా నెక్సాన్ (Tata Nexon)
టాటా మోటార్స్ కంపెనీకి చెందిన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ కారు నెక్సాన్. దీని ప్రారంభ ధర రూ.8.00 లక్షలు. ఆగస్టు నెలలో దీని మొత్తం అమ్మకాలు 14,004 యూనిట్లు. హ్యుందాయ్ క్రెటా తర్వాత గత నెలలో అత్యధికంగా అమ్ముడైన రెండో ఎస్‌యూవీ కారు ఇదే.

Top SUVs Under Rs 10 Lakh August 2025 Sales Report

మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza)
నెక్సాన్‌కు పోటీగా మారుతి సుజుకి విక్రయిస్తున్న బ్రెజ్జా కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తుతం రూ.8.69 లక్షలు. గత ఆగస్టు నెలలో దీని మొత్తం అమ్మకాలు 13,620 యూనిట్లు. మొత్తం ఎస్‌యూవీ కార్ల అమ్మకాలలో నెక్సాన్ తర్వాత మూడో స్థానంలో బ్రెజ్జా ఉంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
ఫ్రాంక్స్‌ను ఎస్‌యూవీగా చెప్పలేం, ఎందుకంటే ఇది క్రాస్‌ఓవర్ ఆకారంలో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.7.58 లక్షలు. ఆగస్టు నెలలో మొత్తం 12,422 ఫ్రాంక్స్ కార్లు అమ్ముడయ్యాయి.

Top SUVs Under Rs 10 Lakh August 2025 Sales Report

టాటా పంచ్ (Tata Punch)
టాటా మోటార్స్ తయారు చేసే ఈ చిన్న కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.00 లక్షలు. ఆగస్టు నెలలో మొత్తం 10,704 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే, 2024 ఆగస్టు నెలతో పోలిస్తే పంచ్ అమ్మకాలు సుమారు 32% తగ్గాయి.

Top SUVs Under Rs 10 Lakh August 2025 Sales Report

హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)
హ్యుందాయ్ కంపెనీకి చెందిన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ కారు వెన్యూ. దీని ప్రారంభ ధర రూ.7.94 లక్షలు. వెన్యూ ఆగస్టు నెల అమ్మకాల సంఖ్య 8,109. ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నప్పటికీ, మొత్తం ఎస్‌యూవీ కార్ల అమ్మకాలలో వెన్యూ ఎనిమిదో స్థానంలో ఉంది.

Top SUVs Under Rs 10 Lakh August 2025 Sales Report

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ (Mahindra XUV 3XO)
వెన్యూ తర్వాత తొమ్మిదో స్థానంలో ఉన్న మహీంద్రా కారు ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. గత నెలలో వెన్యూ మరియు ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కార్ల అమ్మకాలు ఒకే విధంగా ఉన్నాయి (8,109 యూనిట్లు). ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ప్రారంభ ధర రూ.7.99 లక్షలు.

డ్రైవ్ స్పాక్ అభిప్రాయం : రూ.10 లక్షల లోపు చాలా ఎస్‌యూవీ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో టాప్ అమ్మకాలు సాధించిన కార్లు మాత్రమే ఉన్నాయి. గత ఆగస్టు నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, గత ఏడాదిలో టాప్ లో ఉన్న టాటా పంచ్ అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయని తెలుస్తోంది. అదే విధంగా, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ యొక్క అన్ని వేరియంట్‌ల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టడం గమనార్హం.

More from DriveSpark

Article Published On: Wednesday, September 17, 2025, 10:18 [IST]
English summary
Top suvs under rs 10 lakh august 2025 sales report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+