టయోటా కొత్త కారు చూస్తే హార్ట్ బీట్ పెరిగిపోతుంది.. అదిరిపోతున్న డిజైన్ చూస్తే ఫిదా కావాల్సిందే

టయోటా బ్రాండ్ గురించి తెలియని వారు ఉండరు. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రముఖమైన కార్లను విడుదల చేస్తూ మెరుగైన అమ్మకాలను నమోదు చేస్తుంది. ఆకట్టుకునే డిజైన్, క్లాస్-లీడింగ్ టెక్నాలజీ, మంచి పనితీరు కలిగిన వాహనాలను విడుదల చేయడంలో టయోటా బ్రాండ్‌కు మంచి గుర్తింపు ఉంది. కంపెనీ తన విలువను పెంచుకోవడానికి టయోటా తాజాగా యూరోపియన్ మార్కెట్‌ కోసం తన ప్రసిద్ధ కాంపాక్ట్ SUV కరోల్లా క్రాస్ (corolla cross) ను 2025 ఫేస్‌లిఫ్ట్ రూపంలో పరిచయం చేసింది. అయితే ఇది భారత మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో లేదు. మన మార్కెట్లో లాంచ్‌పై కంపెనీ నుంచి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ కొత్త కరోల్లా క్రాస్ 2025 ఫేస్‌లిఫ్ట్ తన రూపాన్ని పూర్తిగా కొత్తగా సంతరించుకుంది.

దీని డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. ముందుభాగంలో కొత్త డిజైన్‌తో కూడిన గ్రిల్, మరింత అగ్రెస్సివ్‌గా తీర్చిదిద్దిన బంపర్, లేటెస్ట్ ఆడాప్టివ్ LED హెడ్ల్యాంప్ యూనిట్లు, ముఖ్యంగా L-ఆకారపు డే టైమ్ రన్నింగ్ లైట్లు దీని ముందు భాగాన్ని ఆకట్టుకునే విధంగా మార్చాయి. వెనుక భాగం మరింత శక్తివంతంగా మెరుగుపరచబడింది. కొత్తగా రూపొందించిన టెయిల్ లైట్లు ఇప్పుడు C-ఆకారపు LED సిగ్నేచర్‌‌తో వస్తున్నాయి.

Toyota 2025 Corolla Cross Facelift

వీటికి తోడుగా ఉన్న ఏరో ఫిన్స్ ఫంక్షనాలిటీతో పాటు స్పోర్టీ లుక్‌ను కూడా కలిగిస్తాయి. కొత్తగా ప్రవేశపెట్టిన 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా కారు స్టాన్స్‌ను మరింత గంభీరంగా మార్చుతాయి. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రూపకల్పనలో మాత్రమే కాదు, లోపల ఉన్న టెక్నాలజీ, సురక్షితత ప్రమాణాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ మోడల్‌ను భారత్‌లో కూడా విడుదల చేయాలని చాలా మంది టయోట అభిమానులు భావిస్తున్నారు.

టయోటా 2025 కరోల్లా క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌ లో ఇంటీరియర్‌ కూడా అందంగా ఉంటుంది. ఈ కొత్త మోడల్‌లో ప్రయాణం అనేది కేవలం ప్రయాణంగా కాక, ఒక స్మార్ట్ అనుభూతిగా మారేలా తీర్చిదిద్దబడింది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, USB-C పోర్టులు, వైరలెస్ ఫోన్ ఛార్జర్, స్లైడింగ్ స్టోరేజ్ బాక్స్, అప్‌డేటెడ్ కప్ హోల్డర్‌లు వంటి అత్యాధునిక సౌకర్యాలు ఈ కారులో ఉండనున్నాయి.

Toyota 2025 Corolla Cross Facelift Launch

ఇన్ఫొటైన్‌మెంట్ టెక్నాలజీలో టయోటా స్మార్ట్ కనెక్ట్ సిస్టమ్ కింద 10.5-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 12.3-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్టాండర్డ్‌గా లభించాయి. ఇవి వాహనంలో సమాచారాన్ని, ఎంటర్టైన్‌మెంట్‌ను క్లియర్‌గా, శక్తివంతంగా అందించడంలో సహాయపడతాయి. అంతేగాక, టయోటా ఇంటీరియర్‌లో వాయిస్ ఇన్సులేషన్ కూడా ఉంది. ఇది కేబిన్‌లో సౌండ్‌ను గణనీయంగా తగ్గించి, ప్రయాణాన్ని మరింత ప్రశాంతంగా మార్చుతుంది.

యూరోపియన్ మార్కెట్ కోసం విడుదలైన టయోటా కరోల్లా క్రాస్ 2025 ఫేస్‌లిఫ్ట్ మోడల్, సాంకేతికతతో పాటు పనితీరు పరంగా కూడా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ కారు ప్రత్యేకంగా హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తోనే అందించబడుతోంది. రెండు వేరియంట్లు 1.8 లీటర్ హైబ్రిడ్ 140, 2.0 లీటర్ హైబ్రిడ్ 200 మధ్య ఎంపిక చేసే అవకాశం వినియోగదారులకు లభిస్తుంది. ఇది సవాళ్లతో కూడిన వాతావరణం లేదా రఫ్ రోడ్లపై కూడా మంచి గ్రిప్‌తో దూసుకుపోతుంది.

Toyota 2025 Corolla Cross Facelift Unveiled In Europe

అలాగే, ఈ మోడల్‌లో మరొక ముఖ్యమైనది GR స్పోర్ట్ ఎడిషన్. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, డిజౌన్ పరంగా కారును మరింత రేసీ లుక్‌ తో తీర్చిదిద్దింది. GR స్పోర్ట్ ఎడిషన్‌లో ప్రత్యేకమైన 19 అంగుళాల Y-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఇవ్వబడ్డాయి, ఇవి కేవలం దృష్టికి హర్షకంగా కాక, కారు స్పోర్టీ పనితీరుకు కూడా తోడ్పడతాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఈ స్పోర్ట్ వేరియంట్ నిజంగా బాగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 14, 2025, 17:20 [IST]
English summary
Toyota 2025 corolla cross facelift unveiled in europe here design and all details
Read more on: #toyota motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+