ధర పెంచకుండానే లీటరుకు 23కి.మీ. ఇచ్చే 8సీటర్ కారుకు అదిరిపోయే సేఫ్టీ ఫీచర్ యాడ్ చేసిన టయోటా..అదేంటంటే ?
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా మోటార్స్ విడుదల చేసే కార్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. మన దేశంలో కూడా ఈ కార్లు రోడ్ల మీద ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిలో ఇన్నోవా కారు అంటే తెలియని వారుండదు. అప్పట్లో అంబాసిడర్ ఏ విధంగా వాడే వారో ప్రస్తుత ఇన్నోవాను కూడా స్టేటస్ సింబల్ గా వాడుతున్నారు. దీని మంచి లుక్, పికప్, ఎక్కువ మంది ప్రయాణించే వీలు ఉండడంతో దీని విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇన్నోవా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటారు షో (ఐఐఎంఎస్)లో ఈ కారును ప్రదర్శించింది. మనోళ్లుకు ఇన్నోవా కారు అంటే అదో అనుభూతి. ప్రతి ఒక్కరూ ఈ కారు సొంతం చేసుకోవాలని కోరుకుంటారు. అద్భుతమైన రైడింగ్ సౌకర్యం, ఎక్కువ ఫీచర్ల కారణంగా ఈ కారుకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. టయోటా ఎంపీవీ ఇప్పటికే మూడు తరాలను పూర్తి చేసుకుంది. ఈ మూడు ఒకదానికొకటి మెరుగ్గా ఉన్నాయి. ఈ కారుకు సెకండ్ హ్యాండ్ మార్కెట్ కూడా మంచి డిమాండ్ ఉంది.

జపాన్ కు చెందిన టయోటా కంపెనీ రెండో తరం క్రిస్టా మోడల్ ఉపసంహరించుకోవడానికి రెడీగా లేదు. ఇన్నోవాలోని డీజిల్ ఇంజిన్‌ను అకస్మాత్తుగా తొలగిస్తే కలిగే గందరగోళం ఏర్పడుతుందని ఆ బ్రాండ్‌కు బాగా తెలుసు. అందుకే కంపెనీ తాజా ఇన్నోవా హైక్రాస్‌తో పాటు డీజిల్ ఇంజిన్ ఆఫ్షన్ తో ఇన్నోవా క్రిస్టాను రిలీజ్ చేసింది. హైక్రాస్ కాలంతో పాటు అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇన్నోవా స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ADAS టెక్నాలజీతో ఇప్పటి కాలానికి అనుగుణంగా ఉంటుంది.
ఇప్పుడు టయోటా ప్రీమియం ఎంపీవీకి కొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇప్పుడు అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్(AVAS) అనే ఫీచర్ ను కలిగి ఉంది. ఈ ఫీచరర్ కేవలం హైబ్రిడ్ వెర్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. AVAS ఫీచర్ ప్రస్తుతం ఇన్నోవా హైక్రాస్ VX, VX (O), ZX, ZX (O) వేరియంట్లలో అందుబాటులో ఉంది.

సాధారణంగా ఈవీలు, హైబ్రిడ్‌లలో మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఈవీ వాహనాలు శబ్ధం లేకుండా ప్రయాణిస్తాయి. AVAS సిస్టమ్ వాహనం నడిచేటప్పుడు సౌండ్ చేస్తుంది. తద్వారా పాదచారులు, సైక్లిస్టులు వాహనం సమీపిస్తున్నట్లు తెలుసుకుంటారు. ఈ ఫీచర్ లక్ష్యం వాహనం చుట్టూ ఉన్న వినియోగదారులను హెచ్చరించడం. తద్వారా ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించడం.
కొత్త సెక్యూరిటీ ఫీచర్ యాడ్ చేసినప్పటికీ టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) హైక్రాస్ ధరను పెంచలేదు. ఇది కాకుండా, టయోటా ఎంపీవీకి ఇతర మార్పులను అమలు చేయలేదు. ఈ వెహికల్ తాజా ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 19.94 లక్షల నుండి రూ. 31.34 లక్షల వరకు ఉన్నాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆరు వేరియంట్లలో లభిస్తుంది. GX, GX(O), VX, VX(O), ZX,, ZX(O). ఈ ప్రీమియం ఎంపీవీ బ్లాక్‌లిష్ అగేహా గ్లాస్ ఫ్లేక్, సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, సిల్వర్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, స్పార్కింగ్ బ్లాక్ పెర్ల్ క్రిస్టల్ షైన్, అవంట్ గార్డ్ బ్రాంజ్ మెటాలిక్ వంటి కలర్ ఆఫ్షన్లలో కూడా అందుబాటులో ఉంటుంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ 2.0-లీటర్, 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 2.0-లీటర్, 4-సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ e-CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. టయోటా హైక్రాస్ మైలేజ్ లీటరుకు 23.24 కి.మీ. ఇస్తుంది. నవంబర్ 2022లో అమ్మకానికి వచ్చిన ఇన్నోవా హైక్రాస్ ఇటీవలే 1 లక్ష యూనిట్ అమ్మకాల మైలురాయిని దాటింది. ప్రస్తుతం రెండు ఇంజిన్ ఆఫ్షన్లను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో మాత్రమే కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








