ఇది ప్రత్యేకమైన మోడల్.. మంచి స్పేస్, అధునాతన ఫీచర్లు.. టయోటా-సుజుకీ నుంచి స్పెషల్ వ్యాన్!

కరోనా తర్వాత కాలంలో మొత్తం కుటుంబం అంతా కలిసి ప్రయాణాలు చేయడం బాగా పెరిగింది. దీంతో వాహన తయారీదారులు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ఎక్కువ సీటింగ్ కలిగిన కార్లను విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దేశీయ దిగ్గజ కంపెనీల నుంచి మొదలుకుని అంతర్జాతీయంగా బాగా ప్రసిద్ధి చెందిన కార్ల తయారీదారులు పోటా పోటీగా పలు మోడళ్లను లాంచ్ చేస్తున్నారు. ఇదే సమయంలో వాణిజ్య అవసరాల కోసం కూడా ఉపయోగపడే వ్యాన్ తరహా మోడళ్లకు కూడా డిమాండ్ బాగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు దిగ్గజ కంపెనీలు కలిసి ఇలాంటి వ్యాన్‌ను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాయని ఒక నివేదిక పేర్కొంది. సుజుకీ (Suzuki), టయోటా (toyota) కంపెనీలు సంయుక్తంగా వ్యాన్‌ను తయారు చేయనున్నాయి.

దీనిని మొదట వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే విధంగా తయారు చేసి తరువాత ప్రయాణికుల రవాణాకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. సుజుకీ, టయోటా తయారు చేస్తున్న కొత్త వ్యాన్‌ పేరు ఇ-ఎవ్రీ (e Every). పూర్తిగా విద్యుత్తుతో నడిచే వెర్షన్‌. సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో "ఎవ్రీ" ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) వాహనాన్ని విక్రయిస్తుంది. జపాన్, పాకిస్తాన్ వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

E Every Electric Van

ఫోటోలకు మూలం bestcarweb.ఈ ప్రసిద్ధ "ఎవ్రీ" వాణిజ్య వాహనం, త్వరలోనే పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కాన్సెప్ట్ మోడల్‌గా వివిధ ఆటోమోటివ్ ప్రదర్శనలలో ప్రదర్శించబడుతున్న ఈ విద్యుత్ వ్యాన్, ప్రపంచం కోసం ఉత్పత్తికి దాదాపుగా సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇప్పటికే ఉన్న "ఎవ్రీ" మోడల్ పోలి ఉంటుంది, కానీ కొన్నిలేటెస్ట్ ఫీచర్స్‌ను జోడించారు.

పెరుగుతున్న ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకుని, చిన్న-మధ్య తరహా వ్యాపారాలకు అనువుగా ఉండే విధంగా ఇ-ఎవ్రీ వ్యాన్ వస్తుంది. ప్రస్తుతం వెలువడుతున్న సమాచారం ప్రకారం, ఇది సంవత్సరం చివరి నాటికి లేదా వేసవి చివరిలోపు మార్కెట్లోకి రావచ్చని అంచనా వేయబడింది. విద్యుత్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ కొత్త మోడల్‌ను తీసుకువస్తున్నారు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత, చిన్న వ్యాపారాలకు వ్యక్తిగత వినియోగదారులకు ఈ వ్యాన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహనం మొదట జపాన్ మార్కెట్లో అడుగుపెట్టనుంది, ఆ తర్వాత పాకిస్తాన్ వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించనుంది. మొదట్లో ఇది వాణిజ్య విభాగంలో, ముఖ్యంగా లోడ్ మోసే వాహనం, ఫుట్ టాక్సీ సేవల కోసం అందుబాటులో ఉంటుంది. వ్యాపార అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ వాహనం, సమర్థవంతమైన అనుకూల రవాణా పరిష్కారాన్ని అందిస్తుంది. ఇ-ఎవ్రీ భారతదేశంలో లాంచ్ అవుతుందా లేదా అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

అయితే, ఒకవేళ భారతీయ మార్కెట్లోకి ప్రవేశిస్తే, ప్రస్తుతం మారుతి సుజుకీ పోర్ట్‌ఫోలియోలో ఈకో ఆక్రమించిన స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. ఈకో మాదిరిగానే, ఇది విశాలమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. సుజుకీ బ్రాండ్ కింద మాత్రమే కాకుండా, ఇ-ఎవ్రీ టయోటా బ్రాండ్ కింద కూడా రీ-బ్యాడ్జింగ్ చేయబడి ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడుతుంది. ఈ వ్యూహం రెండు కంపెనీలకు విస్తృత మార్కెట్‌ను చేరుకోవడానికి, వాటి ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

ఖచ్చితమైన లాంచ్ తేదీ, ధరల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించబడతాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. దీని గురించి ఇంకా ఎలాంటి కీలక వివరాలు విడుదల కాలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ మోడల్ సింగిల్ ఛార్జ్‌తో 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని తెలుస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటారు 64 PS పవర్‌తో నడుస్తుందని సమాచారం.

More from DriveSpark

Article Published On: Monday, March 31, 2025, 7:30 [IST]
English summary
Toyota and suzuki jointly develop e every electric van with 200 km range more details
Read more on: #suzuki #toyota #electric car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+