టయోటా కార్లపై సంచలన ఆఫర్‌.. మెగా సమ్మర్ సెలబ్రేషన్‌ను మిస్ చేసుకోకండి!

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) భారత ఆటోమొబైల్ మార్కెట్లో నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచింది. టయోటా వాహనాన్ని ఒకసారి ఉపయోగించిన వినియోగదారు, మళ్లీ మరొక బ్రాండ్‌ వైపు చూడడంలేదు అన్నదే సాధారణంగా వినిపించే అభిప్రాయం. ఇప్పుడు, టయోటా తమ కస్టమర్లను మరోసారి ఆకట్టుకునేలా, వేసవి కాలానికి అనుగుణంగా ఓ ప్రత్యేకమైన ప్రచారాన్ని ప్రారంభించనుంది. మెగా సమ్మర్ సెలబ్రేషన్ పేరిట టయోటా కిర్లోస్కర్ మోటార్ దక్షిణ భారతదేశంలోని అన్ని అధీకృత డీలర్‌షిప్‌లలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ఇందులో భాగంగా, ప్రస్తుతం టయోటా కార్లను ఉపయోగిస్తున్న వినియోగదారులకు మే, జూన్ 2025లో ప్రత్యేక ప్రయోజనాలు, ఆఫర్లు, డిస్కౌంట్లు అందించబోతున్నారు.

ఈ ప్రచారం కేవలం ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే కాకుండా, తమ కస్టమర్లపై టయోటా చూపుతున్న కృతజ్ఞతకు నిదర్శనం. కారు సర్వీసింగ్, మరమ్మత్తులు, స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్‌ మీద ప్రత్యేక తగ్గింపులు లభించే అవకాశం ఉంది. ఇది వాహన యజమానుల కోసం ఒక మంచి అవకాశంగా మారనుంది. వేసవి కాలంలో తక్కువ ఖర్చుతో తమ వాహనాలను మెయింటెన్ చేసుకునేందుకు ఇది సరైన సమయం.

Toyota Announced Summer Special Offers On Car Service

వాస్తవానికి, టయోటా ఈ మెగా సమ్మర్ సెలబ్రేషన్ ద్వారా కేవలం అమ్మకాల పరంగా కాకుండా, వినియోగదారులతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. ఈ ప్రత్యేక సమ్మర్ క్యాంపేన్ కింద కొత్త కార్ల కొనుగోళ్ల డీల్స్, వాహన సర్వీసింగ్‌పై ప్రత్యేక డిస్కౌంట్లు, నమ్మకమైన టయోటా సర్టిఫైడ్ యూజ్డ్ కార్లు, అలాగే శ్యాక్సెసరీస్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను వినియోగదారులు పొందవచ్చు. ఈ ప్రయోజనాలన్నీ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినవే.

ప్రస్తుతం ఈ ప్రచారం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని టయోటా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. ఇది ప్రాంతీయ వినియోగదారులకు మరింత చేరువయ్యే ప్రయత్నంగా చెప్పవచ్చు. టయోటా "కస్టమర్-ఫస్ట్" ను బలపరిచే విధంగా, ఈ ప్రచారంలో భాగంగా యజమానులకు ప్రత్యేక బహుమతులు, ప్రయోజనాలు కూడా అందించబోతున్నారు. ఈ వేసవిని మరింత లాభదాయకంగా మార్చే ఈ అవకాశాన్ని వినియోగదారులు తప్పకుండా ఉపయోగించుకోవాలని టయోటా ఆశిస్తోంది.

Summer Special Offers On Car Service

ఈ వేసవిని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు టయోటా కిర్లోస్కర్ మోటార్ తీసుకొచ్చిన మెగా సమ్మర్ సెలబ్రేషన్‌లో భాగంగా టయోటా వాహనాలపై ప్రత్యేక వేసవి స్కీములు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పరిమిత కాలానికి అందే ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, డిస్కౌంట్‌లు, ప్రత్యేక ధరల ప్రయోజనాలు వంటి వాటితో వినియోగదారులు తక్కువ బడ్జెట్‌లో తమ కలల కారును సొంతం చేసుకునే అవకాశం పొందుతున్నారు. సమ్మర్ సర్వీస్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి.

కస్టమర్లు ఉచిత 20-పాయింట్ల తనిఖీని కూడా పొందగలుగుతున్నారు. అదేవిధంగా, వాహనాన్ని మెరుగైన లుక్‌తో ఉంచేందుకు T GLOSS పెయింట్ ప్రొటెక్షన్ ట్రీట్‌మెంట్‌లు, వివిధ వాహన యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి. కారు కొనుగోలు సమయంలో హామీగా బహుమతులు, ప్రత్యేక డీల్స్ కూడా ఈ ప్రచారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి. తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను టయోటా డీలర్‌షిప్‌కు రిఫర్ చేస్తే, వారికి ప్రత్యేకమైన రిఫెరల్ ప్రయోజనాలు ఉంటాయి.

Toyota Offers

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Tuesday, May 20, 2025, 17:10 [IST]
English summary
Toyota announced summer special offers on car service accessories in south india
Read more on: #toyota motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+