ప్రపంచంలో అత్యధికంగా ఏ కార్లను కొంటున్నారో తెలుసా..? ఒక్క సంవత్సరంలోనే కోటి సేల్స్..
ప్రపంచవ్యాప్తంగా కార్ల వాడకం విపరీతంగా పెరిగింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కష్టతరం అవుతున్నందున్న చాలా మంది సొంతంగా కార్లలో ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్ల కొనుగోళ్లు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. తయారీ కంపెనీలు డిమాండ్‌కు అనుగుణంగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన మోడళ్లను విడుదల చేస్తూనే ఉన్నాయి. అమ్మకాల పరంగా ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా (Toyota) సేల్స్‌లో ఇతర కంపెనీలకు గట్టి పోటీని ఇస్తూ వరుసగా ఐదవ సంవత్సరం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది. గణంకాలు చూసినట్లయితే 2024 ఏడాదిలో జనవరి నుంచి డిసెంబర్ వరకు దాదాపు ఒక కోటి వాహనాలను విక్రయించింది. దీంతో ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమలో తన పేరును సరికొత్తగా లిఖించుకుంది.
టయోటా కార్లకు ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉండటంతో 12 నెలల కాలంలోనే ఇన్ని అమ్మకాలను నమోదు చేసింది. ముఖ్యంగా దాని సమీప ప్రత్యర్థి జపనీస్ బ్రాండ్ అయినటువంటి ఫోక్స్‌వ్యాగన్ కంటే ఇది 1 మిలియన్ (10 లక్షల) ఎక్కువ వాహనాలను విక్రయించి అంతర్జాతీయంగా తన పట్టును నిలబెట్టుకుంది. టయోటా ప్రపంచంలోనే అతిపెద్ద కార్ బ్రాండ్‌గా టాప్ ప్లేస్‌లో ఉన్నప్పటి కంపెనీ విలువ పరంగా మాత్రం రెండో స్థానంలో ఉంది.

2024 జనవరి నుంచి మొదలు డిసెంబర్ వరకు కూడా టయోటా తన అమ్మకాలతో జోరు చూపించింది. స్థూలంగా టయోటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఒక కోటికి పైగా మొత్తం వాహనాలను విక్రయిచించింది. వీటిలో చాలా లగ్జరీ బ్రాండ్స్ మినీ-వెహికల్ మేకర్ డైహట్సు మోటార్, లగ్జరీ కార్ బ్రాండ్ లెక్సస్, ట్రక్కుల తయారీ సంస్థ హినో మోటార్స్ వంటివి కూడా ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్, టయోటా మధ్య అమ్మకాల పరంగా టఫ్ వార్ ఉంది.
టయోటా గ్రూప్ 2024 ఏడాదిలో విక్రయించిన మొత్తం 1.08 కోట్ల కార్లలో దాని టయోటా-లెక్సస్ కలిసి 1.02 కోట్ల వాహనాల సేల్స్‌ను సాధించడం గమనార్హం. గ్రూప్ మొత్తం అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 95 శాతంగా ఉంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమ కొంచెం ఒత్తిడికి గురవుతుంది. ప్రధానంగా జపాన్, చైనా వంటి పలు మార్కెట్లో పరిస్థితులు భిన్నంగా ఉండటం కారణంగా అమ్మకాలు మరికాస్త తగ్గాయి.

గ్లోబల్ మార్కెట్లలో పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లయితే టయోటా అమ్మకాలు ఇంకా ఎక్కుగానే నమోదు అయ్యేవి అని పరిశ్రమ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. 2024 ఏడాదిలో టయోటా ఎక్కువగా పెట్రోల్, డీజిల్‌తో నడిచే ICE ఇంజిన్ వాహనాలను విక్రయించింది. అయితే వీటికి తోడుగా పెట్రోల్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కార్లను కూడా తీసుకురావడం ద్వారా టయోటా తన అమ్మకాలను పెంచుకుని సక్సెస్ అయింది.
ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారత్‌లో కూడా టయోటా కార్లకు మంచి డిమాండ్ ఉంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు హైబ్రిడ్ మోడళ్లను కూడా విక్రయిస్తుంది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్ వంటి పలు కార్స్ దేశీయంగా బాగా ఆదరణ పొందినవిగా ఉన్నాయి. టయోటా గ్లోబల్ మార్కెట్లలో 40 శాతం హైబ్రిడ్ కార్లను విక్రయిస్తుంది. అదే మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా కేవలం 1.5 శాతం మాత్రమే ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








